శ్రీకాకుళం

జన సేవే జనసేన ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందూరు, అక్టోబర్ 14: జనసేవ చేయడమే జనసేన ధ్యేయంగా అవతరించిందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గరికి గోవర్థన్ అన్నారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో భారీ ఎత్తున జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటుచేసిన సందర్భంగా ఆయన పాల్గొని పైవిధంగా అన్నారు. ఇప్పటి రాజకీయ వ్యవస్థలో ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని, అవినీతిలేని రాజకీయం రావాలనే ఉద్దేశ్యంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారన్నారు. రాష్ట్రంలో యువతరం కథం తొక్కుతో జనసేన వైపు పరుగులు తీసిందన్నారు. అవినీతిపరులను అంతం చేయాలనే ముఖ్యోద్దేశ్యంతో పోటీ బరిలోకి దిగుతుందన్నారు. రైతుకూలి సామాన్య ప్రజానీకానికి అన్యాయం జరిగితే జనసేన ఉపేక్షించేది లేదని అన్నారు. జనసేన జనంలో మమేకమై ప్రజా సమస్యలపై రాజీ లేని పోరుకు సిద్ధమవుతున్నామన్నారు. సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు గుంటూరు మురళి, పిల్లి శివ, పట్టణ పార్టీ అధ్యక్షులు హంస ప్రదీప్, యువనేతలు రాజేష్, శ్రీను, అజిత్, వినోద్, భాస్కరరావు, రాధాకృష్ణ, శివప్రసాద్ పాల్గొన్నారు.

తుఫాన్ బాధితులందరికి న్యాయం
పాతపట్నం, అక్టోబర్ 14: తుఫాన్ బాధితులందరికి న్యాయం జరుగుతుందని విద్యుత్ శాఖా మంత్రి కిమిడి కళావెంకటరావు అన్నారు. ఆయన ఆదివారం పాతపట్నం ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ వద్ద పాత్రికేయులతో మాట్లాడుతూ పాతపట్నం మండలం, కొత్తూరు మండలం, భామిని, మెళియాపుట్టి మండలాలు తుఫాన్ బాధిత మండలాలుగా చేర్చడం జరిగిందని ఆయన అన్నారు. వీరికి కావల్సిన రాయితీలు పొందవచ్చన్నారు. ముందుగా విలేఖరులు,స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ పాతపట్నం వచ్చాక నష్టపరిహారం గూర్చి పూర్తిగా తెలుసుకున్నామని, ప్రతీ రైతుకు పంట నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి, పాలకొండ ఆర్డీవో రెడ్డిగున్నయ్య, పాలకొండ డి ఎస్పీ, విద్యుత్ శాఖాధికారులు పాల్గొన్నారు.

రైతులు ధర్నా
పాతపట్నం, అక్టోబర్ 14: తుఫాన్‌కు సంబంధించి నాలుగు రోజులు గడిసినప్పటికి నేటివరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం శోచనీయమని పాతపట్నం రైతాంగం అన్నారు. వారు ఈమేరకు ఆదివారం మధ్యాహ్నం భారీ స్థాయిలో రైతులు ర్యాలీ జరిపి అధికారులు డౌన్ డౌన్, ప్రజాప్రతినిధులు డౌన్ డౌన్ అంటూ ర్యాలీ జరిపారు. స్థానిక తహశీల్దార్ కూడలి వద్ద గంటపాటు ధర్నా జరిపి రోడ్డుపైన బైఠాయించారు. పంటపొలాలు నీటిలో పూర్తిగా మునిగిపోయినప్పటికి రెవెన్యూ అధికారులు స్పందించలేదని, స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ముఖం కూడా కన్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ పి.వేణుగోపాల్‌కి మెమోరాండం సమర్పించారు.

ఆదిత్యుని దర్శనానికి బారులు తీరిన భక్తులు
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 14: ప్రత్యక్ష నారాయణుడు శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు బారులు తీరారు. ఉచిత దర్శనం క్యూలైన్లలోనే భక్తులు అధికంగా కన్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం ద్వారా రూ.28,400, సూర్యనమస్కారాల ద్వారా రూ. 4,650, కేశఖండన శాల ద్వారా రూ.21,875, లడ్డు, పులిహార విక్రయాల ద్వారా రూ.1,10,000 ఆదాయం లభించినట్లు అధికారులు స్పష్టం చేశారు.