శ్రీకాకుళం

రైతులు అధైర్యపడవద్దు...అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రపుకొత్తూరు, అక్టోబర్ 16: రైతులు కష్టాల్లో ఉన్నారు... ఆదుకునే బాధ్యత తీసుకున్నారు...కష్టాల్లో ఉన్నవారికి బతుకుపై భరోసా కల్పిస్తున్నాం...అన్ని విధాలా ఆదుకోవడమే ప్రస్తుతం తన కర్తవ్యమని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం తిత్లీ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను స్వయంగా కలుసుకొని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసారు. తుపాన్ ధాటికి ఉద్దానం కళావిహీనంగా తయారైందని, ఉద్యానవనంగా తిరిగి తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటానన్నారు. ముందుగా గరుడభద్ర పరిసర ప్రాంతాల్లో తుపాన్‌కు తీవ్రంగా నష్టపోయిన వరి, కొబ్బరి, జీడి,మామిడి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధికారులు స్థానికంగా వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని అసహనం వ్యక్తం చేసారు. విపత్తులకు మరో ప్రత్యామ్నాయం లేదని, నష్టనివారణ చర్యలు మాత్రమే చేసి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోనడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అధికారులు సహకరించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొబ్బరికి 1200 రూపాయలు, జీడి హెక్టారుకు 25 వేల రూపాయలు, నూతనంగా తోటను వేసుకోవడానికి హెక్టారుకు 40 వేల రూపాయలు మంజూరు చేసినట్లు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. తుపాన్ ప్రభావిత గ్రామాల్లోని ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందులు పడకుండా ఆయా చౌకధరల దుకాణాలు ద్వారా సరఫరా చేయడం జరిగిందని చినవంకలో రేషన్‌షాపు డీలర్ అప్పరావును పిలిచి ప్రజలకు అందుతున్నాయా, లేదా అని వారి నుంచి సమాధానం రాబట్టారు. తుపాన్‌లో ఇళ్లు కోల్పోయినవారికి 10 వేల రూపాయలు ఇవ్వడంతోపాటు కొత్తగా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎన్‌డి ఎ ప్రభుత్వం తుపాన్ సహాయంగా రూపాయి విదల్చకపోయినా తన వంతు బాధ్యతగా సహాయం చేస్తున్నానన్నారు.

జగన్‌పై విమర్శలు
వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. తుపాన్ ధాటికి అతలాకుతలమై జీవచ్ఛావాల బతుకుతున్న ప్రజలను ఓదార్చడానికి జగన్‌కు సమయం లేదని, వారం వారం కోర్టుకు హాజరవ్వడానికి సమయం ఉంటుందని ఎద్దేవా చేసారు. కష్టాల్లో వున్న బాధితులను ఓదార్చడానికి మనస్సు రాని ప్రతిపక్షనాయకుడు ఉండడం ప్రజల దౌర్భగ్యమన్నారు. తన పర్యటనను గలాటా చేయడానికి వైసీపీ కార్యకర్తలు పంపిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు. ఈయనతోపాటు మంత్రులు పితాని సత్యానారాయణ, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే శివాజీ, టీడీపీ సమన్వయకర్త వెంకన్నచౌదరి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు శిరీషా, జడ్‌పీటీసీ నీలవేణి తదితరులు పాల్గొన్నారు.

కాకిలెక్కలు చెప్పోద్దు...క్షేత్రస్థాయిలో సర్వే చేయండి: మంత్రి లోకేష్
మందస, అక్టోబర్ 16: తిత్లీ తుపాన్ ప్రభావంతో జీడి,కొబ్బరి, పాడైన ఇళ్లు సర్వం కోల్పోయిన ఉద్దాన గిరిజన గ్రామాలకు చెందిన ప్రజానీకం, తుపాన్ బాధితులకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి, మానవతాదృక్పథంతో బాధితులను ఆదుకునే బాధ్యత మనందరిది అని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేషు అన్నారు. మంగళవారం మందస వెలుగు కార్యాలయంలో 38 గ్రామ పంచాయతీలకు సంబంధించి అధికారులతోపాటు ప్రత్యేకాధికారులు, కలెక్టర్లుతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బాధితులను ఆదుకునే విధంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, నివేదికను అందజేయాలని, నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉండి భరోసా కల్పిస్తుందని, అధికారులు బాధితులకు భరోసా కల్పించే విధంగా పనిచేయాలన్నారు. నిత్యావసర సరుకులు, విద్యుత్తు, తాగునీరు ప్రతి గ్రామానికి అందే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఈయనతోపాటు ఐటీడీ ఎ పీవో ఎల్.శివశంకర్, అధికారులు పాల్గొన్నారు.

తుపాన్ బాధితులను ఆదుకోవాలి
మందస, అక్టోబర్ 16: తిత్లీ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం, పాలకులు ఆదుకోవాలని ఉద్దాన చైతన్య రైతు సంఘం అధ్యక్షుడు ఎం.మాధవరావు అన్నారు. మంగళవారం మార్పుట్రస్టు గ్రంథాలయంలో రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. యుద్దప్రాతిపదికపై ఉద్దానంలో జీడి,కొబ్బరి మొక్కలను పంపిణీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని,కొబ్బరి చెట్టుకు 10 వేల రూపాయలు, ఎకరాకు 5 లక్షల రూపాయలు, జీడికి 2 లక్షల రూపాయలు చెల్లించాలని, వరి ఎకరాకు 25 వేల రూపాయలు చెల్లించాలని, ఉపాధి హామీ పథకం కింద రోజుకు 300 రూపాయలు చొప్పున 300 రోజులు పనులు కల్పించాలని, నేలకొరిగిన ఇళ్లు స్థానంలో ఎన్‌టి ఆర్ గృహాలను మంజూరు చేయాలన్నారు. బ్యాంకు రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో ఎన్.హడ్డి, తులసయ్య, ముకుందరావు, కృష్ణారావు, బాబురావు, సోమనాథం తదితరులు పాల్గొన్నారు.

బాథితులను ఆదుకోవడమే మానవత్వం
మందస, అక్టోబర్ 16: తిత్లీ తుపాన్‌తో సర్వం కోల్పోయి నిరాశ్రయులను బాధితులను ఆదుకోవడమే మానవత్వమని సినీ హిరో నిఖిల్ అన్నారు. మండలంలోని కొండలోగాం, బేతాళపురం, బహడాపల్లి, రాంపురం తదితర గ్రామాల్లో ఆహారం, తాగునీరు, మందుల కిట్‌లను బాధితులకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతంలో పచ్చనిపల్లెల్లో జీడి, కొబ్బరి, చెట్లు, ఇళ్లు నేలకొరిగి నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవడమే తన వంతు బాధ్యత అని అన్నారు. ఈయనతోపాటు గ్రామస్తులున్నారు.