శ్రీకాకుళం

ఊహించని పెను తుఫాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, అక్టోబర్ 16: మానవులు ఊహించని విధంగా తిత్లీ తుఫాన్ జిల్లాను అతలాకుతలం చేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి కళావెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు. సారవకోట మండలంలో తుఫాన్ ప్రభావం నష్టం తీవ్రంగా ఉందన్న విషయాన్ని ముందుగా ఊహించలేకపోయామని స్పష్టం చేశారు. తుఫాన్ వలన జిల్లాలో 36 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని ఇందు 20వేలు స్తంభాలు విరిగిపోయావని వివరించారు. 380 ట్రాన్స్‌ఫార్మర్‌లు పూర్తిగా పాడయ్యాయని, ఈ కారణంగా విద్యుత్ శాఖకు సంబంధించి రూ.600 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. వారం రోజుల్లోగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో మంగళవారం స్థానిక శాసనసభ్యుడు బగ్గు రమణమూర్తితో కలిసి పలు గ్రామాల్లో పర్యటించారు. అంతకు ముందు తహశీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పునరావాస చర్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తుఫాన్ వలన రూ.2,700 కోట్లు నష్టం వాటిల్లినట్లు కేంద్ర ప్రభుత్వాని ప్రాథమిక అంచనా ప్రకారం నివేదిక సమర్పించిందన్నారు. ఇదికాకుండా రూ.1100 కోట్లు వ్యవసాయరంగానికి నష్టం కల్గిందని వివరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాన మంత్రి మోదీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై కక్ష గట్టారని తీవ్రంగా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్న తుఫాన్ నష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి హామీ ఇవ్వలేదని, కనీసం నష్టం వివరాలు సేకరించే ప్రయత్నం చేయలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 40మంది ఐ ఏ ఎస్ అధికారులు, 120 మంది డిప్యూటీ కలెక్టర్‌లు, వెయ్యిమంది వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు, విద్యుత్ శాఖకు సంబంధించి వెయ్యిమంది ఇంజనీర్లు, ఇద్దరు సిఎండిలు, ఒక ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో సహాయ పునరుద్దరణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. రేషన్ సరుకులను బయోమెట్రిక్‌లకు సంబంధం లేకుండా నేరుగా బట్వాడా చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి కళావెంకటరావు స్పష్టం చేశారు. స్థానిక శాసనసభ్యుడు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ సారవకోట మండంలో నెలకొన్న తుఫాన్ తీవ్రత, వివిధ రంగాలలో నష్టం గూర్చి ముఖ్యమంత్రి దృష్టికి తేవాలని మంత్రి కళావెంకటరావుకు విజ్ఞప్తి చేశారు. మండలానికి ఒక ఐ ఏ ఎస్ అధికారిణి ప్రత్యేకాధికారిగా నియమించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. అనంతరం పాలసముద్రం, కిమిడి, రామకృష్ణాపురం, కరడసింగి జగన్నాథపురం గ్రామాల్లో మంత్రి కళావెంకటరావు, శాసనసభ్యుడు బగ్గు రమణమూర్తి విస్తృతంగా పర్యటించి ప్రజలనుంచి వివరాలను సేకరించారు. మండల ప్రత్యేకాధికారి ఎ.వెంకటేశ్, తహశీల్దార్ ఈశ్వరమ్మ, ఎంపీడీవో జగదీశ్వరరావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి సాధు చిన్నికృష్ణమనాయుడు, సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సురవరపు తిరుపతిరావు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నవ సమాజ నిర్మాణమే జనసేన ధ్యేయం
జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడు ఫల్ఘుణరావు
పొందూరు, అక్టోబర్ 16: నవసమాజ నిర్మాణమే ధ్యేయంగా జనసేన నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉందని జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడు డి.్ఫల్ఘుణరావు అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో తనకు కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ పై విధంగా అన్నారు. నవ నాయకత్వానికి పునాదులు వేయాలనే ముఖ్య ఉద్ధేశ్యంతో జనసేన పార్టీ 10 నియోజక వర్గ పరిథిలో ఎన్నికలు సందర్భంగా లీగల్ సెల్ శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు క్రిమినల్ నిబంధనలకు, ఉల్లంఘనలపై జనసేన లీగల్ సెల్ నిఘా ముమ్మరం చేస్తామని ఆయన అన్నారు. స్పష్టమైన ఎన్నికల నిర్వాహణకు నియోజక వర్గ స్థాయిలో ఎంపికైన జనసేన లీగల్ అధ్యక్షులు తన వంతు కృషి చేస్తారని ఆయన అన్నారు. అవినీతిపరులుపై ఎన్నికల నిఘా ఉంటుందన్నారు. ప్రజలకు మభ్యపెట్టే ధన, మద్యం పై కార్యకర్తలు సైతం డేగ కన్ను వేయాలని ఆయన కోరారు. ప్రతీ నియోజక వర్గంలో లీగల్ సెల్ అధ్యక్షుడు పనిచేసి ఎప్పటి సమాచారం అప్పుడే శరవేగంగా జిల్లా అధికారులు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్‌లు అన్నమనాయుడు, రాంబాబుల తదితరులు పాల్గొన్నారు.