శ్రీకాకుళం

జగన్ తుఫాన్ బాధితులను పట్టించుకోకపోవడం విచారకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్), అక్టోబర్ 16: తిత్లీ తుఫాన్ ప్రభావం వలన ఉద్ధానం ప్రాంతం అతలాకుతలం అయిపోతే ముఖ్యమంత్రి జిల్లాకు చేరుకొని సహాయక చర్యలు చేపడుతుంటే పక్కజిల్లాలోనే ఉంటూ జగన్‌మోహనరెడ్డి తుఫాన్ బాధితులను పట్టించుకోకపోవడం విచారకరమని టీడీపీ పూర్వపు జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జి) అన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పలాస కేంద్రంగానే కార్యక్రమాలు చేపడుతూనే సహాయక చర్యలు ముమ్మరం చేశారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ధానం దత్తత తీసుకుంటానని చెప్పి ఇంత వరకు కన్పించకపోవడం విచారకరమన్నారు. సహాయక చర్యలు చేపట్టే వారిని అభినందించాల్సిందిపోయి లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చిన్న లోపాలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌ను, పవన్ కళ్యాణ్‌ను ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. ప్రతి పక్ష పాత్రను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించద్దని పేర్కొన్నారు. తుఫాన్ కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేనున్నానని భరోసా ఇచ్చి సహాయక చర్యలు చేపుడుతున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు రకారకాల వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఓటరు ప్యాకింగ్‌కు కవర్‌లు లేని పక్షంలో హెరిటేజ్ కవర్లను వినియోగించి వాటర్ ప్యాకెట్లను బాధితులకు అందిస్తే దానిని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత భాద్యతారాహిత్యంగా వ్యవహారిస్తున్నారన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే టీడీపీ లక్ష్యమన్నారు. ప్రతిపక్షం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని అన్నారు. విలేఖరుల సమావేశంలో మొదలవలస రమేష్, సింతు సుధాకర్, జామి భీమశంకర్, చిట్టిమోహన్, ఎస్.వి రమణమాదిగ తదితరులున్నారు.

నీటి సరఫరాలో అంతరాయం
ఆమదాలవలస, అక్టోబర్ 16: స్థానిక మున్సిపల్ అధికారులు, సిబ్బందిలో రోజురోజుకు నిర్లక్ష్యం, అలసత్వం పెరిగిపోతుంది. ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పట్టణ నీటి సరఫరాను గత రెండు రోజులగా నిలిపివేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పలు వాటర్‌లో నీటి సరఫరా నిలిచిపోగా మరికొన్ని చోట్ల సాయంత్రం, అర్ధరాత్రి వేళల్లో కుళాయిలు విడిచిపెడుతున్నారు. కుళాయిల నుండి వస్తున్న ఈ నీరు కూడా బురద, చెత్త, చెదారంతో నిండి నీరు వస్తుండటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. పట్టణ నీటి సమస్యపై మున్సిపల్ ఏ ఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా తుఫాన్ కారణంగా పైపు వాల్వాల్ మరమ్మత్తుకు గురయ్యాయని వీటిని పూర్తిస్థాయిలో రిపేరు చేసినంతవరకు ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఏ ఈ శ్రీనివాసరావు సూచించారు.