శ్రీకాకుళం

దశమి పూజ ఘడియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, అక్టోబర్ 16: ఈ ఏడాది దసరా పండుగను పంచాంగ కర్తలు కొన్ని కేలండర్లలో అక్టోబర్ 18 అని, మరి కొందరు పంచాంగ కర్తలు 19న కూడా పండుగను నిర్వహించుకోవచ్చని పేర్కొనడంతో పండుగ నిర్వహణపై తర్జన భర్జన పడుతున్నట్లు ఆంధ్రభూమి దృష్టికి వచ్చింది. ఈ విషయమై స్థానిక శ్రీవిద్య ఉపాసకులు, మారుతీ జ్యోతిషాలయంలో ఉన్న ప్రముఖ వేద పండితులు అనిల్ శర్మను వివరణ కోరగా 18 గురువారం మధ్యాహ్నం 2.07 గంటలకు దశమి వస్తూ 19 శుక్రవారం సాయంత్రం 4.12గంటల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గృహము నందు దేవి పూజలు నిర్వహించేందుకు శుక్రవారం ఉదయం 6.26 గంటల నుండి 8.15 గంటల లోగా దేవి పూజ చేయుటకు శుభమని ఆయన సూచించారు. లేదా 9.10 గంటల నుండి 12.10 గంటల వరకు గృహమునందు పూజలు చేయడం శుభమని అనిల్ శర్మపేర్కొన్నారు. దేవాలయంలో దసరా ఉత్సవాలను నక్షత్రాల ఆధారంగా నిర్వహిస్తారని, గృహాల్లో పూజలను తిథి, దశలు ఆధారంగా పూజలు నిర్వహిస్తారని దీనికారణంగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో గురువారమే పూజలు ప్రారంభమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

అవినీతి సర్కార్ అరాచకాలపై చరమగీతం
* రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు జయప్రతాప్‌కుమార్
పొందూరు, అక్టోబర్ 16: అవినీతి సర్కార్ అరాచకాలపై చరమ గీతం పలికే రోజులు దగ్గరపడ్డాయని రాష్ట్ర బీజేపీ కార్యవర్గసభ్యులు బండారు జయప్రతాప్‌కుమార్ సర్కార్ తీరుపై మండి పడ్డారు. స్థానిక మహారాజ్ మార్కెట్ ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులు సైతం బాబు సర్కార్ గాలి మళ్లించారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రజలకు ద్రోహం చేస్తున్న తీరును కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేయవల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో టీడీపీకి దోచుకోవడం-దాచుకోవడమే తప్ప పేదప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. దేశాన్ని కుదిపేసిన ఎన్నో కుంభకోణాలకు ఏమాత్రం తీసిపోని అతి పెద్ద కుంభకోణం రాష్ట్రంలో జరిగిందని సాక్షాత్తు కాగ్ సంస్థ 2016-17 సర్వేలో ఈ విషయాన్ని పేర్కొన్న ఐదు రాష్ట్రాల్లో పరిశీలిస్తే గుజరాత్ రాష్ట్రంలో నాలుగు వందలు పైచీలుక కాగా ఒడిస్సాలో 800, పశ్చిమ బెంగాల్‌లో 395 ఉండగా ఆంధ్రలో మాత్రం 58,418 ఖాతాలు తెరవడం వెనుక కారణాలు బహిర్గతం చేయలేక అవినీతిని నెత్తిన పెట్టుకొన్న ఘనత చంద్రబాబుదే అన్నారు. ఈ ఖాతాల ద్వారా సుమారు రూ.53వేల కోట్లు ఎందుకు మళ్లించారో సర్కార్ చెప్పాలన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఫిషరీస్ ఫార్మర్స్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ద్వారా రూ. 2,173 కోట్లు, ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారారూ. 3,787కోట్లు ఖర్చుచేసినట్లు సర్కార్ చెబుతుందన్నారు. ఈ వివరాలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదన్నారు. అసలు రూ. 6,700 కోట్లు చెల్లింపులు జరిగివుంటే లబ్ధిదారుల వివరాలు బయటపెట్టాలని ఆయన అన్నారు. సర్కార్ ప్రజా ప్రతినిధులను చూసి అధికారులు కూడా అవినీతిపరులుగా మారారన్నారు. సర్వశిక్ష అభియాన్, ఇళ్ల నిర్మాణాలు, నీరు-చెట్టు, ఆదరణ, అమరావతి నిర్మాణం అన్నింటా అవినీతి నెలకొందన్నారు. బీజేపీ పై అసత్య ప్రచారం చేయడం విడనాడాలన్నారు. ప్రతీ స్కీంను తమదిగా మార్చిన ఘనత దేశం సర్కార్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చిట్టిబాబు, సత్యన్నారాయణ, శ్రీను, మాధవన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

హుదూద్ కంటె తీత్లీ తుఫాన్ తీవ్రత జిల్లాలో ఎక్కువ
* మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ
శ్రీకాకుళం (రూరల్), అక్టోబర్ 16: హుదూద్ తుఫాన్ కంటె తిత్లీ తుఫాన్ తీవ్రత జిల్లాలో ఎక్కువుగా ఉందని మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. అరసవిల్లిలో తన నివాస గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రెండవ కోనసీమగా పేరొందిన ఉద్ధానం, చుట్టు పక్కల ప్రాంతాలలో ఉద్యాన వనాలతో ఉండటంతో హార్టీ కల్చరల్ హబ్‌గా చూడాల్సివుంటుందని అన్నారు. ఈ చెట్లన్నీ తుఫాన్ తీవ్రతకు విరిగిపోవడంతో రహదారుల పూర్తిగా కప్పుకు పోయావని, వేలకొలది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, దీనిని త్వరిత గతిన పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా వచ్చి పరిశీలన చేసి పనులు వేగవంతం చేశారన్నారు. ముఖ్యమంత్రి వచ్చి సహాయక చర్యలు చేస్తూ అధికారులను ముందుకు సాగిస్తుండటాన్ని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రోడ్లుపై చెట్లు తొలగింపు పూర్తిచేసి ప్రజలకు వౌళిక సదుపాయాలు తీర్చడానికి తమ విద్యుత్ అవసరాల దృష్ట్యా 15వేలు విద్యుత్ స్తంభాలు ఉపయోగించడంతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలనుంచి సిబ్బందిని తీసుకొచ్చి పునరావాస పనులు చేపడుతున్నారన్నారు. ప్రతీ చిన్న విషయానికి వైసీపీ నాయకులు ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయడం సరైన చర్య కాదన్నారు. ధర్మాన ప్రసాదరావు పదేళ్లు రెవెన్యూ మంత్రిగానే కాకుండా పునరావాస శాఖ మంత్రిగా కూడా చేసిన సందర్భంలో ప్రజలకు గ్రామాల్లో సివిల్ సప్లయర్స్‌కు చెందిన రేషన్ డిపోల నుంచి నేరుగా పంపిణీ చేయవచ్చని అనడం అర్ధరహితమన్నారు. రేషన్ డిపోలో బియ్యం ప్రభుత్వం 1వ తేదీనుండి ఇవ్వడం జరుగుతుందని, 10వ తేదీలోపు పంపిణీ పూర్తిచేయడం జరుగుతుందని తెలియజేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంకు సంబంధించి 150 రేషన్ డిపోలకు అరసవిల్లి ఎమ్ ఎల్ ఎస్ పాయింట్‌నుండి అధికారంగా బియ్యం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేశ్, గంగు నాగేశ్వరరావు, ఎస్.వి.రమణమాదిగ, ప్రధాన విజయరాం, విభూతి సూరిబాబు, కవ్వాడి సుశీల, కరగాన రాము తదితరులున్నారు.

అపరిశుభ్రత మధ్య ఆమదాలవలస
* రోగాల భయంతో ప్రజలు
ఆమదాలవలస, అక్టోబర్ 16: స్థానిక మున్సిపల్ శానిటరీ విభాగం ఒప్పంద కార్మికులు గత 12రోజులుగా చేపడుతున్న సమ్మె కారణంగా పట్టణమంతా అపరిశుభ్రతగా మారింది. ఎక్కడికక్కడే చెత్తపోగులు, కాలువల్లో మురుగు దుర్వాసన వెదజల్లడం వల్ల దోమలు విపరీతంగా పెరిగి వ్యాధులు విజృంభిస్తున్నాయి. పెరిగిన అపరిశుద్ధ్యం, దోమలు కారణంగా గత మూడు నెలల నుంచి పట్టణంలో విషజ్వరాలు జోరుగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు పట్టణంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి లక్షణాలతో ఈ ఏడాది సుమారు 49మంది వరకు చనిపోయారని వైద్యాధికారులు గుర్తించారు. అపరిశుభ్రతతో పాటు ప్రస్తుతం వర్షాలు కారణంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, కాలువలు చెత్త చెదారంతో నిండి వున్నాయని పలువురు వాపోతున్నారు. వర్షం కురిస్తే రోడ్డుపై చెత్త కుళ్లి మరింత దుర్వాసన పడుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. తిత్లీ తుఫాన్ కారణంగా పట్టణంలో ఎక్కడికక్కడే మూగజీవులు, కుక్కలు వంటివి చనిపోయి మాంసపుముద్దలు రోడ్డుపక్కనే పడివుంటున్నాయని, వీటిని పట్టించుకునే నాధుడు కరువయ్యారని పలువురు వాపోయారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని పలువురు కోరుతున్నారు.