శ్రీకాకుళం

తలసరి ఆదాయం రూ. లక్షకు పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 27: జిల్లాలో తలసరి ఆదాయం లక్ష రూపాయలకు పెరగాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం పిలుపునిచ్చారు. జిల్లా తలసరి ఆదాయం 76 వేల రూ.లు మాత్రమే ఉందని, దీనిని లక్ష రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ తలసరి ఆదాయంగల జిల్లాగా శ్రీకాకుళం ఉందని, అదేవిధంగా తక్కువ తలసరి ఆదాయం గల మండలంగా ఎల్.ఎన్.పేట ఉందని పేర్కొన్నారు. జిల్లాలో స్థితిగతులు మార్చి తలసరి ఆదాయం పెంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దీనిపై ప్రత్యేక సమావేశంను ఎల్.ఎన్.పేటలో త్వరలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రజల్లో అవగాహన అవసరమని, ఉన్న వనరులను ఉపయుక్తంగా వినియోగించుకోవడం ద్వారా ఆదాయ మార్గాలు ఏ విధంగా పెంచుకోవచ్చునో వివరిస్తామన్నారు. ఉన్న భూమిని చక్కగా వినియోగించడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని అన్నారు. పంట సంజీవిని కుంటలలో చేపల పెంపకం చేపట్టడం ద్వారా ఆదాయం సమకూర్చవచ్చని చెప్పారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ల రెండురోజుల సమావేశంలో వివిధ పరిస్థితులను వివరిస్తూ తలసరి ఆదాయం గూర్చి ముఖ్యమంతి ప్రస్తావించారని చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం ఆఖరి స్థానంలో ఉండడం విచారకరమని, ఇకపై ఆ పరిస్థితులు జిల్లాలో కన్పింకుండా అధికారులంతా కలిసి పనిచేసి తలసరి ఆదాయం పెంచాలంటూ కలెక్టర్ తన యంత్రాంగానికి పిలుపునిచ్చారు.