శ్రీకాకుళం

విద్యాప్రమాణాలు పెంచే బాధ్యత టీచర్లదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ, నవంబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం ప్రతి ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని, దీనిని సద్వినియోగపరిచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచే బాధ్యత ఉపాధ్యాయులే తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం అన్నారు. మంగళవారం స్థానిక సి. ఎల్.నాయుడు కళాశాలలో ఉపాధ్యాయులతో నిర్వహించిన ఆర్ ఎం ఎస్ ఏ శిక్షణా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు తరగతి గదుల్లో మారుతున్న పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధన చేసేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తుందన్నారు. ఇటువంటి సందర్భాల్లో ఉపాధ్యాయులు అవగాహన పొంది సద్వినియోగం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ డివిజన్ ఇన్‌చార్జి ఐ.వెంకటరావు, డీ ఆర్‌పీ జగన్నాథరావు, కోటిబాబు, దాలినాయుడు, మురళీ, దామోదర్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన గ్రామాల్లో వౌలిక వసతులు కల్పనే జనసేన లక్ష్యం
మందస, నవంబర్ 13: దశాబ్దకాలంగా గిరిజన గ్రామాల్లో కనీస వౌలిక వసతులు లేక అభివృద్ధికి నోచుకోలేదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆదేశాలు మేరకు గిరిజన గ్రామాల వౌలిక వసతుల కల్పన ధ్యేయంగా కృషి చేస్తామని జనసేన సోషల్ జస్టీస్ కన్వీనర్ శివశంకర్, ప్రభు, మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. మంగళవారం కారిగాం గిరిజన గ్రామాంలో లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన బోరుబావిని ప్రారంభించారు. జనసేన పార్టీకి సంబంధించి సింగపూర్‌దాత సహకారంతో బోరును నిర్మించామన్నారు. గిరిజన గ్రామాల్లో తిత్లీ తుపాన్ ప్రభావంతో నిరాశ్రయులైన బాధితులకు తన వంతు సహకారంతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసామని, రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బాధితులను ఆదుకోవడంలో విఫలమైనాయన్నారు. తుపాన్ ప్రభావంతో నేలమట్టమైన ఇళ్లును చూసైన అధికారులకు, పాలకులకు మానవత్వం లేదన్నారు. దాతలు, స్వచ్చందసంస్థలు ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కో ఆర్డినేటర్ శ్రీరామ్మూర్తి, సుజాతపండా, దుర్గారావు, మోహనరావు, సుమన్, బి.శ్రీనివాసరావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
11175 మందికి పసుపుకుంకుమ
ఇచ్ఛాపురం(రూరల్), నవంబర్ 13: మండలంలో 11175 మందికి పసుపుకుంకుమ కింద నిధుల పంపిణీని ఎపీ ఎం సూర్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించారు. ఇప్పటికే 2000 అందని వారికి అందించడం జరుగుతుందన్నారు. మహిళ సంఘాలు టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలు గూర్చి ప్రసంగించారు. సీసీ రామకృష్ణ, సిబ్బంది సుశీల, సిబ్బంది పాల్గొన్నారు.

సేవాభావంతోనే విద్యార్థులకు ఉజ్వలభవిష్యత్తు
మందస, నవంబర్ 13: విద్యార్థులు విద్యతోపాటు సేవాభావాన్ని అలవరుచుకోవాలని సమాజానికి, కుటుంబానికి సేవలు అందించాలని టి.వాసుదేవరావు అన్నారు. మంగళవారం జిల్లుండ, ఉమాగిరి గ్రామాల్లో హరిపురం శాతావాహన డిగ్రీ,జూనియర్‌కాలేజిల ఆధ్వర్యంలో ఎన్ ఎస్ ఎస్ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మొక్కలు నాటడం, వీధుల పరిశభ్రత, కాలువల్లో చెత్తను తొలగించారు. బ్లీచింగ్ చల్లారు. గ్రామాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు బ్యాంకు ఆర్థిక లావాదేవీలపై చైతన్యం చేసారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పీవోలు త్రినాధరావు, దుదిష్టినాయుడు తదితరులు పాల్గొన్నారు.