శ్రీకాకుళం

గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరుబుజ్జిలి, నవంబర్ 13: రాష్ట్రంలో ప్రతి పల్లెను సంపూర్ణ అభివృద్ధి చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని డకరవలస గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని, సీసీ రహదారులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ రవికుమార్ మాట్లాడుతూ అవినీతి అక్రమార్జన చేసి 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న కోడికత్తి డ్రామాల నాయకుడు జగన్మోహన్‌రెడ్డి మాయమాటలు నమ్మి ప్రజలను టీడీపీని విస్మరిస్తే రాష్ట్ర అభివృద్ధి అర్థాంతరంగా ఆగిపోవడమే కాకుండా రాష్ట్రం అదోగతి పాలవుతుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం ప్రజలు గ్రహించాలన్నారు. నదుల అనుసంధానంలో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గంలో వంశధా, నాగావళి నదుల అనుసంధానం చరిత్రలో మిగులుతుందన్నారు. ఆమదాలవలస మండలం అక్కులపేట వద్ద విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు జరిగిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఎటువంటి ప్రకృతి విలయతాండవం సంభవించి అప్పట్లో హుదూద్ తుపాన్, ఇప్పుడు తిత్లీ తుపాను తీవ్ర నష్టం ఏర్పాటు జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులను ఆదుకొని చరిత్ర సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యు ఎస్ డీ ఈ ఆశాలత, ఎంపీడీవో పావని, పీ ఆర్ జే ఈ గుప్త, టీడీపీ నాయకులు శివ్వాల సూర్యనారాయణ, నందివాడ గోవిందరావు, అదపాక అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీతో అభివృద్ధి
మెళియాపుట్టి, నవంబర్ 13: జనసేన పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర జనసేన కన్వీనర్ శ్రీరామ్మూర్తి అన్నారు. మంగళవారం మెళియాపుట్టిలోని ముత్యాలబొంతులో 60 వేల రూపాయలతో గిరిజనులు పడుతున్న తాగునీటి ఇబ్బందులు దృష్ట్యా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 60 వేల రూపాయలతో నిర్మించిన బోరును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం తిత్లీ తుపాన్ వల్ల పాడైన ఇళ్లును, పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రతినిధులు శ్రీనివాస్, శివశంకర్, సాయిప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

తిత్లీ తుపాన్‌తో నష్టపోయాం
పాలకొండ (టౌన్), నవంబర్ 13: మండలంలోని వెలగవాడ పంచాయతీ సిరికొండ గ్రామానికి చెందిన గిరిజన రైతులు తిత్లీ తుపాను కారణంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ ఐ నాయకులు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ గిరిజనులకు ఆర్థిక వనరుగా ఉన్న జీడి, మామిడి తోటల చెట్లు కూలిపోయాయన్నారు. అధికారులకు ఈ విషయం తెలియజేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదన్నారు. దీంతో ఆందోళన చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి పరిహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి కూలిన చెట్లును పరిశీలించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ ఆందోళనలో నిమ్మక సెరంగో, నిమ్మక చిన్నమ్మ, దండాసి తదితరులు ఉన్నారు.

వందశాతం సబ్సిడీతో ఫింగర్‌లింక్ చేపలు పంపిణీ
పాలకొండ (టౌన్), నవంబర్ 13: మండలంలోని పెదకోటిపల్లి, లుంబూరు గ్రామాల్లో శతశాతం సబ్సిడీతో ఫింగర్‌లింక్ చేప పిల్లలను పంపిణీ చేశారు. మంగళవారం మత్స్యశాఖ అధికారి కె.గంగాధరరావు రైతులకు చేపపిల్లల పెంపకంపై అవగాహన కల్పించారు. చేపపిల్లలను గ్రామాల్లోని చెరువుల్లో విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కలివరపు వెంకటరమణ, కె.నాగరాజు, ఫీల్డ్ మేన్ ప్రత్యూష, మిన్నారావు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు
పాలకొండ (టౌన్), నవంబర్ 13: మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తోటపల్లి రవిరాజు జ్ఞాపకార్థం మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిభా పరీక్షలు మంగళవారం నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి జి.నాగభూషణదొర పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరిగాయి. ఈ నెల 14న ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల వనరుల కేంద్రంలో బహుమతి ప్రధానం ఉంటుందని ఎం ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని హెచ్ ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.