శ్రీకాకుళం

నేటి విద్యార్థులే భావిపౌరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, నవంబర్ 13: నేటి విద్యార్థులే రేపటి భావిపౌరులు అని పలాస వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం భాష్యం పాఠశాలలో బాలలదినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూకు బాలలు అంటే మక్కువ అని, ఇందుకుగాను భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును బాలలదినోత్సవాన్ని నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు, గురువుల శ్రమను గుర్తించి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉత్తమపౌరులుగా గుర్తింపు పొందినప్పుడు వారి సంతోషం వెలకట్టలేనిదన్నారు. విద్యార్థిలో క్రమశిక్షణ, పట్టుదల ఉండాలని, అప్పుడే ఆ విద్యార్థి తాను కన్న కలలను సార్థకం చేసుకోగలరన్నారు. ప్రతి విద్యార్థి విజ్ఞానం పెంపొందించుకొని వృత్తినైపుణ్యం పెంపొందించుకోవడం వల్ల ఉన్నత అవకాశాలు పొందుతారన్నారు. విద్యార్థులపై ఒత్తిడి తెచ్చే విధంగా విద్యాబోధన చేయకుండా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలు బోధిస్తే ఆ విద్యార్థుల్లో జిజ్ఞాస పెరిగి చదువుపై శ్రద్ద చూపుతారన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నీలకంఠం, హెచ్ ఎం ఉషారాణి, కిషోర్, వరిశ హరిప్రసాద్, బల్లయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి అనంతకుమార్ మృతి బీజేపీకి తీరనిలోటు
పలాస, నవంబర్ 13: బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అనంతకుమార్ మృతి చెందడంతో పార్టీకి ఎంతో తీరని లోటు అని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ కణితి విశ్వనాధం అన్నారు. మంగళవారం తన స్వగృహంలో అనంత్‌కుమార్ సంతాపసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతకుమార్ ఆరుసార్లు పార్లమెంటీరీయన్‌గా, కేంద్ర మంత్రిగా ఎన్నో కీలకమైన పదవులు చేపట్టి బీజేపీని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పాలవలస వైకుంఠరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొర్రాయిబాలకృష్ణ, బీజేపీ నాయకులు మాధవరావు, ఎస్.రామారావు, కె.బుజ్జి, ఆర్. ఆనందరావు, ఈశ్వరరావు, సీరపు జోగారావు తదితరులు పాల్గొన్నారు.

తిత్లీ బాధితులకు కిట్ల పంపిణీ
ఇచ్ఛాపురం, నవంబర్ 13 : పట్టణ పరిధి బెల్లుపడలోని తిత్లీ తుపాను బాధితులకు వైసీపీ నాయకులు మంగళవారం బియ్యం తదితర సామగ్రితో కూడిన కిట్లను పంపిణీ చేశారు. పార్టీ అధినేత జగన్ సూచన మేరకు బాధితులను ఆదుకుంటున్నామని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు చెప్పారు. ప్రజల కష్టాలలో పాలు పంచుకుంటామన్నారు. నేతలు పి.దేవరాజురెడ్డి (సంతు), ఎం.వెంకటరెడ్డి, తాడి ఆదిరెడ్డి, ప్రకాశరావు పట్నాయక్, పి.ఆనంద్, కౌన్సిలర్ సుగ్గు ప్రేమ్‌కుమార్, దుర్గాసి పాపారావు, ఎ.పితాంబర్ పాల్గొన్నారు.
పేద దంపతులకు ఆర్థిక సహాయం
ఇచ్ఛాపురం, నవంబర్ 13 : పట్టణ పరిధి రత్తకన్నలోని పేద వృద్ధ దంపతులు ఎల్.తరణీరావు, హేమలతలకు గల్ఫ్‌లో పనిచేస్తున్న స్థానిక యువకులు ఆర్థిక సహాయం చేశారు. వారు పంపిన 10 వేల రూపాయలను స్వర్ణ్భారతి చైర్మన్ చాట్ల తులసీదాస్, కౌన్సిలర్ ప్రతినిధి జగన్ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. గ్రామపెద్దలు జి.బుచ్చయ్య, డాల్ రెడ్డి, అప్పలస్వామి, రెయ్యి బాబు, గిన్ని తులసయ్య పాల్గొన్నారు.