శ్రీకాకుళం

విహారాలకు వెళ్లి... విషాదాల్లోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ, నవంబర్ 17: జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో వంగర మండలంలో ఉన్న మడ్డువలస ప్రాజెక్టు ప్రాంతం ఒకటి. ఇక్కడికి కొద్ది కిలోమీటర్ల దూరంలో జీ ఎం ఆర్ ఐటీ ఇంజనీరింగ్ కళాశాల ఉండడంతో విహారానికి ఎక్కువగా చదువుతున్న యువతీ యువకులు వస్తుంటారు. తెలిసీ తెలియని వయస్సులో హెచ్చరిక బోర్డులను కూడా ఖాతరు చేయకుండా ఆ ప్రాంతంలో మునిగేందుకు ప్రయత్నం చేయడంతో ఈతరాని వీరు మృత్యువాత పడుతున్నారు. తిరిగి రాని లోకాలకు చేరి ఎన్నో ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రకృతి సహజసిద్దమైన కొండ ప్రాంతంలో నిర్మించడంతో వేలాది ఎకరాల పంట భూములకు సాగునీరు అందించడమే కాకుండా మత్స్య సంపదను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో అప్పటి ప్లాన్ ప్రకారం ఫ్లాట్‌ఫారం నిర్మించకపోవడంతో లోతైన గోతులు, ఎతె్తైన చిన్న చిన్న కొండలు ఉన్న మధ్య ప్రాంతంలో నిల్వా ఉన్న నీటిలో మునిగేందుకు యువకులు ఉత్సాహ పడుతూ మృత్యువాత పడుతున్నారు. ఈ కార్తీకమాసంలో రాజాం, వంగర మండలాలతో పాటు అనేక మండలాల నుంచి పిక్నిక్‌లకు ఎక్కువగా వస్తుంటారు. ఈ కార్తీకమాసంలో ఆదివారం, సోమవారం రోజుల్లో వంగర పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాదే వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో స్నానాలకు దిగి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన మరువక ముందే శుక్రవారం రాత్రి రాజాం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇరువురు విద్యార్థులు మృత్యువాత పడడంతో వారి తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదం నింపింది. కేవలం కార్తీకమాసాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఈ పర్యాటక కేంద్రానికి దగ్గరలో ఉన్న జీ ఎం ఆర్ ఐటీ విద్యార్థులు నిత్యం విహారానికి వస్తుంటారు. ప్రతి ఏటా ఇటువంటి విషాద సంఘటనలు ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

తోటపల్లి పాత రెగ్యులేటర్ ఆధునీకరణ చేపడతాం
* తిత్లీ బాధితుల సమాచారం పక్కాగా ఉండాలి
* ముఖ్యమంత్రిని అభినందిస్తూ జెడ్పీ సమావేశంలో తీర్మానం * మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, నవంబర్ 17: తిత్లీ తుఫాన్ సంభవించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు జిల్లి పర్యటనకు విచ్చేయడం జరిగిందని, తుఫాన్ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పలాసలోఉండి స్వయంగా పర్యవేక్షణ చేయడం అభినందనీయమని పలాస శాసనసభ్యులు గౌతు శ్యామ సుందర శివాజీ ప్రస్తావించారు. దీనిని ఇతర సభ్యులు బలపర్చారు. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించడం గ్రామాల్లో పర్యవేక్షించడం, ప్రజలకు దైర్యం నింపడం జరిగిందని అన్నారు. ఐ ఏ ఎస్, ఐ ఎఫ్ ఎస్, గ్రూప్ 1 అధికారులను, వేలాది సిబ్బందిని డిప్యూటీ చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. పునరావాస సహాయక కార్యక్రమాలు వేగవంతం కావడానికి కృషి చేశారు. క్యాబినెట్ మంత్రులు అందరూ ఇక్కడే వుండి తుఫాన్ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రికార్డ్ సమయంలో నష్టపరిహారం పంపిణీ చేశారని పేర్కొంటూ ధన్యవాదాలు తెలియజేసిన తీర్మానాన్ని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. శనివారం జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి అధ్యక్షతన జడ్పీ సాదారణ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈసమావేశంలో రాష్ట్ర రవాణాశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రబీ పంటలో ఆరుతడి పంటలకు మాత్రమే నీరు విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయశాఖపై సమీక్షిస్తు తోటపల్లి ఓల్డ్ రెగ్యులేటరీ ఆధునీకరణ పనులు చేపట్టడం జరుగుతుందని, ఈ ఏడాది రబీకి నీటిని విడుదల చేయడం జరగదని స్పష్టం చేశారు. 2017-18 సంవత్సరంలో నందిగాం మండలంలో కేవలం 5 పంచాయతీలకు మాత్రమే పంటల బీమా అందిందని, మిగిలిన అన్ని పంచాయతీలకు బీమా అందలేదని ఆయన అన్నారు. తిత్లీ తుపాన్‌లో నష్టపోయిన రైతులు సమాచారం పక్కాగా ఉండాలని, అర్హులైన ప్రతీ ఒక్కరికి న్యాయం జరగాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ నష్టపరిహారం నమోదులో అధికారులపై గ్రామాల్లో ఒత్తిడి తేరాదని కోరారు. అనర్హులు నష్టపరిహారం పొందితే వారినుండి రికవరీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దురుద్దేశ పూర్వకంగా అధికంగా పంట నష్టాన్ని నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమలు, అటవీశాఖల్లో నష్టాల అంచనాలను త్వరితగతిన పూర్తిచేసి నష్టపరిహారాన్ని అందిస్తామని అన్నారు. జిల్లాలో తిత్లీ తుఫాన్ నష్టపరిహారం కింద 3.72 లక్షల రికార్డులను నమోదు చేశామని, రూ. 392కోట్లను పంపిణీ చేశామని చెప్పారు. అనర్హులు, సరైన ఆధారాలు లేకుండా ఖాతాల్లో నగదు పడిన దాదాపు ఆరువేల ఎంట్రీలను పెండింగులో పెట్టామని చెప్పారు. పశువుల శాలలకు 48వేలు దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో అర్హులను పరిశీలించాల్సివుందన్నారు. జిల్లాలో రెండువేల గోకులాలను నిర్మించడానికి అనుమతులు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. పలాస, నరసన్నపేట, రాజాం, పాలకొండ శాసనసభ్యులు గౌతు శ్యామసుందరశివాజీ, బగ్గు రమణమూర్తి, కంబాల జోగులు, విశాసరాయి కళావతి, జెడ్పీటీసీలు తదితరులు తిత్లీ తుఫాన్ నష్టపరిహారం పంపిణీలలోను, నమోదులోను లోపాలు సవరించి అర్హులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నందున గిడ్డంగులను మెర్జ్ చేసే ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరారు. బీసీ రుణాలను గ్రౌండింగ్ చేసి లక్ష్యాలను పూర్తిచేయాలని సభ్యులు కోరారు. వ్యవసాయశాఖ, పశుసంవర్థక శాఖ, ఈపిడి సి ఎల్, జలవనరుల శాఖ,వైద్య ఆరోగ్య శాఖ, అటవీశాక తదితర అధికారులు తమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.వి ఎన్ చక్రధరబాబు, జెడ్పీ సి ఈవో బి.నగేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

..............

24న పత్తికొనుగోలు కేంద్రం ప్రారంభం
* మార్కెటింగ్ ఏడి శ్రీనివాసరావు
శ్రీకాకుళం (రూరల్), నవంబర్ 17: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఈనెల 24న పత్తికొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు సహాయ మార్కెటింగ్ సంచాలకులు బి.శ్రీనివాసరావు తెలిపారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2018-19 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌లో పత్తిరైతులను ఆదుకునేందుకు పత్తికి కనీసం మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. క్వింటాకు ఒక్కింటికి రూ. 5,450 మద్దతు ధరగా నిర్ణయించిందన్నారు. అదేవిధంగాపత్తి సేకరణకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ, రాజాంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తుందన్నారు. కార్పొరేషన్ ద్వారా 8నుండి 12శాతం తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుందని, 8శాతానికి పైగా తేమ కల్గిన పత్తిపై ఒక శాతానికి రూ. 54.50 చొప్పున మద్దతు ధర తగ్గించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదే విధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ఇతర నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి వుందన్నారు. కావున రైతులు పూర్తిగా ఆరబెట్టిన పత్తిని తీసుకురావాలన్నారు. పత్తిరైతులు విధిగా తమ పత్తి పంట వివరాలు గ్రామరెవెన్యూ అధికారి, మండల వ్యవసాయాధికారులను సంప్రదించి ఈ పంట పోర్టల్‌లో అనుభవదారు వివరాలన్నీ నమోదు చేయించుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు తమ ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతానెంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, ఐ ఎప్‌సి కోడ్ కల్గివున్న ప్రతులను విధిగా తీసుకురావాలని చెప్పారు. ఈ పంట పోర్టర్‌లో నమోదు కాని రైతుల విషయంలో వ్యవసాయశాఖ జారీచేసిన సాగు ధృవీకరణ పత్రం, రుణ అర్హత పత్రాలను తీసుకురావాలని చెప్పారు. ఇతర వివరాలకు కార్యదర్శి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, రాజాం వారిని సంప్రదించగలరన్నారు. ఫోన్ నెంబర్ 08941-251116ను సంప్రదించాలని సూచించారు.

...........

ప్రజా తప్పులను కాపాడుతున్న ముఖ్యమంత్రి
* మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ
శ్రీకాకుళం (రూరల్), నవంబర్ 17: దేశంలో వ్యవస్థలు కూలుతూ వ్యక్తిగత హక్కులు అంతరించిపోతున్న సందర్భంలో ప్రత్యమ్నాయం వెతుకుతూ తన దైన శైలిలో వ్యవస్థలను నిలబెడుతూ ప్రజాహక్కులను కాపాడేందుకు ముందుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెనుక నడుస్తున్న తమకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇస్తుందని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. అరసవిల్లిలో తన నివాసగృహంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ దేశంలో వ్యవస్థలు కూలి వ్యక్తిగత హక్కులను కాలరాస్తే పార్టీలకు అతీతంగా దానిని అడ్డుకోడానికి ఉద్యమ నిర్మాణం చరిత్ర ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుత విషయాన్ని అధ్యయనం చేసి రాష్ట్ర, దేశ ప్రయోజనాలను, సగటు వ్యక్తిగత హక్కులను కాపాడటానికి సిబి ఐ మాకు వద్దనడం సరైన సమయంలో సరైన చర్యగా తామందరమూ భావిస్తున్నామని తెలిపారు. భారత దేశ చరిత్రను అర్ధం చేసుకొనేందుకు ప్రయత్నం చేస్తే యూనిటీ ఇన్ డైవర్శిటీ అని ఇది జీవన విధానంలో భాగమని అన్నారు. అందుకే సిబి ఐని వద్దని సమర్థిస్తూ విప్లవ ఆలోచనలకు గడ్డ బెంగాళీ అని అటువంటి గడ్డకు నాయకత్వం వహిస్తున్న మమతా బెనర్జీ, చంద్రబాబునాయుడులను సమర్ధించడం తెలుగువారిగా మనకు గర్వకారణం అన్నారు. సిబి ఐలో మొన్న జరిగిన సంఘటనలు లజ్జాకరంగా ఉన్నాయని, ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన దర్యాప్తు మాకొద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌లు సై అనడం భారతదేశ చరిత్రలో ఒక మలుపని ఈ మలుపును ప్రజలు ఆహ్వానిస్తారన్నారు. ఈప్రక్రియ ప్రారంభం మాత్రమేనని పర్యావస్థానం కేంద్రం నిరంకుశత్వాన్ని ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసే ప్రభుత్వం కోసమే నని తెలియజేశారు. విలేఖరుల సమావేశంలో ప్రధాన విజయరాం, మాదారపు వెంకటేశ్, కరగాన రాము, కె.కమల, నాగేశ్వరరావు, ఎన్.విజయ, కె.సుశీల తదితరులు పాల్గొన్నారు.

.................

రూ. 10 కోట్లతో రహదారి విస్తరణ పనులు
*నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీరాములునాయుడు
శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 17: స్మార్ట్ సిటీలో భాగంగా శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు నగర పాలక సంస్థ కమీషనర్ ఆర్.శ్రీరాములు నాయుడు వెల్లడించారు. అందులో భాగంగా నగరంలోని రహదారులను 80 అడుగుల రహదారులుగా విస్తరించనున్నట్లు చెప్పారు. ఈ రహదారుల విస్తరణ కోసం రూ.10కోట్ల నిధులను వెచ్చిస్తున్నామన్నారు. నగరంలో జరుగుతున్న రహదారుల విస్తరణ పనులను ఇంజనీరింగ్, ఇతర శాఖాధికారులతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో రూ.10 కోట్ల రూపాయలతో రహదారుల విస్తరణ పనులను చేపడుతున్నామని దీనివలన నగరంలో 2.10 కిలో మీటర్ల మేర 80 అడుగుల రహదారులుగా విస్తరించడం జరుగుతుందన్నారు. ఈరోడ్లపై మార్గం మద్యలో డివైడర్ల్, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్‌లను ఏర్పాటుచేయనున్నామన్నారు. వీటికోసం రూ. 6.80 కోట్లు నిధులు మంజూరయ్యాయని, టెండర్లను ఖరారు చేసి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. పంచాయతీ రాజ్, జిల్లాపరిషత్, రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి తదితర శాఖల సమన్వయంతో ఈ రహదారుల విస్తరణ పనులను చేపడుతున్నామని, దీనికి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రహదారి విస్తరణ పనులతో శ్రీకాకుళం స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకొందని, త్వరలోనే నగర రూపు రేఖలు మారనున్నాయని తెలిపారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు, జాతీయ రహదారి మెయిన్ ఎంట్రెన్స్‌గా మారనుందని చెప్పారు. అంతేకాకుండా నవభారత్ జంక్షన్ వద్ద రూ. 1.50 కోట్లతో ప్రధాన ముఖద్వారాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అనంతరం నవభారత్ జంక్షన్ నుండి పి ఎన్ కాలనీ వరకు జరుగుతున్న పనుల పురోగతిని కమీషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి బి.నగేష్, జిల్లా పంచాయతీ అధికారి బి.కోటీశ్వరరావు, శ్రీకాకుళం తహశీల్దార్ పి.మురళీకృష్ణ, నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ హేమవతి, కార్యనిర్వాహక ఇంజనీర్ సుగుణాకర్, టౌన్ ప్లానింగ్ అథికారి దేవకుమార్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.