శ్రీకాకుళం

స్వైన్‌ఫ్లూపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, నవంబర్ 17: స్వైన్‌ఫ్లూ వ్యాధిపై అవగాహనా సదస్సును శనివారం గులుమూరు గ్రామంలో నిర్వహించారు. చొర్లంగి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఈవో గణపతిరావు మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ వ్యాధిని గుర్తించి వాటి నివారణా చర్యలు చేపట్టవచ్చునన్నారు. స్వైన్‌ఫ్లూ వ్యాధిపై భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మల్లేశ్వరరావు, కాంచన తదితరులు పాల్గొన్నారు.

ఎల్ ఐసీ డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా విశే్వశ్వరరావు
రేగిడి, నవంబర్ 17: రాజాం ఎల్ ఐసీ బ్రాంచి డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా కిమిడి విశే్వశ్వరరావు నియమితులయ్యారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో విశే్వశ్వరరావును నియమించినట్టు విశాఖ డివిజన్ అధ్యక్షుడు బి.తిరుమలరావు తెలిపారు. ఈ సందర్భంగా విశే్వశ్వరరావు మాట్లాడుతూ ఎల్ ఐసీలో ఇటువంటి పదవి దక్కడం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఎల్ ఐసీ అభివృద్ధికి గాను మరింత మంది ఖాతాదారులను చేర్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.

అద్దెలు చెల్లించకపోతే కరెంట్ కట్ చేస్తాం
*ఎంపీడీవో హెచ్చరిక
రాజాం, నవంబర్ 17: రాజాంలోని ఎన్‌టి ఆర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న 23 షాపుల అద్దెదారులు సక్రమంగా అద్దె చెల్లించడం లేదని వారందరికీ నోటీసులు అందించామని ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 23లోగా అద్దెలు చెల్లించాలని లేకపోతే విద్యుత్ నిలుపుదల చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా అద్దెదారులు అగ్రిమెంట్‌లో రాసుకున్న విధంగా అద్దెలు చెల్లించాలని కోరారు.