శ్రీకాకుళం

వలసపోతున్న దళితవాడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), నవంబర్ 17: ఆర్థిక ఇబ్బందులు తాళలేక దళిత వాడలు వలసపోతున్నాయని జిల్లా దళిత మహిళాశక్తి అధ్యక్షురాలు జి.మరియమ్మ అన్నారు. శనివారం మండలంలోని రాజుపేట గ్రామంలో మహిళలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తమ సామాజిక వర్గాన్ని ఆదుకొనేందుకు ప్రత్యేక పథకాలను చేపట్టాల్సిన అవశ్యకత ఉందన్నారు. కులవృత్తి లేక సాగు చేసేందుకు భూమి కూడా లేకపోవడంతో చేసేందుకు కూలి లేక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు చేతివృత్తులు చేసుకొనేందుకు ప్రత్యేకంగా ఆర్థిక సహకారం ప్రభుత్వం అందించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా ఇంతవరకు నెరవేర్చలేదని ఆరోపించారు. ఇప్పటికీ సొంత ఇళ్లు లేని కుటుంబాలు తమ కులంలో ఉన్నాయన్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబ యజమానికి సక్రమంగా వేతనం అందించే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. దూసి దివ్య, ఎం.అక్కమ్మ అధ్యక్షులుగా, కె.లక్ష్మీ, డి.దుర్గమ్మ ప్రధాన కార్యదర్శులుగా, కె.వెంకటలక్ష్మీ కోశాధికారిగా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు జి.బాలయోగి, దూసి రమణమ్మ, ఎన్.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

బాలికల సంరక్షణకు ప్రాధాన్యత
ఎల్ ఎన్‌పేట, నవంబర్ 17: బాలికలు సంరక్షణ బాధ్యతపై అవగాహనా కార్యక్రమాన్ని శనివారం స్థానిక లక్ష్మీనర్సుపేట కేజీబీవీ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీటీ ఎస్ పీవో జనార్థనరావు మాట్లాడుతూ చైల్డ్‌లైన్ వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బాలల వేధింపులు, సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వీటిపై బాలికలు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్‌టీయూ ప్రతినిధి జగదీశ్వరరావు, ఏపీవో సత్యంనాయడు, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ సంతోషమ్మ తదితరులు పాల్గొన్నారు.

విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలి
హిరమండలం, నవంబర్ 17: పదో తరగతి చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎం ఈవో రాంబాబు అన్నారు. శనివారం స్థానిక ఎం ఆర్‌సీ కార్యాలయంలో ఆల్ ఇన్ ఒన్ పుస్తకాలను పాఠశాల హెచ్ ఎంలకు పంపిణీ చేశారు. విశాఖపట్నానికి చెందిన గుత్తు జగ్గన్న చారిటబుల్ ట్రస్టు ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకొని పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.