శ్రీకాకుళం

పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, నవంబర్ 17: సర్పంచ్‌లు పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారులు పాలన ఆరంభమయిన గ్రామాల్లో పారిశుద్ధ్యపనులు చేపట్టకపోవడం వలన స్థానికులు రోగాల బారిన పడుతున్నారని బీజేపి మండల పార్టీ అధ్యక్షులు మారుపల్లి నారాయణరాజు విమర్శించారు. తక్షణమే తీర గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించేందుకు పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు శ్రద్ధ కనబర్చాలని కోరారు. శనివారం మండల కేంద్రంలో స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని జిల్లా యంత్రాంగం చొరవ చూపి చర్యలు చేపట్టకుంటే గ్రామాల్లో అపరిశుభ్రత నెలకొంటుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెల్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా బడివానిపేట, బుడగట్ల పాలెం, డి.మత్స్యలేశం తీర గ్రామపంచాయతీలో అపరిశుభ్రత వాతావరణం ఉండడం వల్ల అక్కడ జనం అవస్థలు పడుతున్నారని, అధికారులుకూడా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

............

విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
సరుబుజ్జిలి, నవంబర్ 17: విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి సమాజంలో మంచి పౌరులుగా తయరవ్వాలని సరుబుజ్జిలి ఎస్ ఐ డి.విజయకుమార్ అన్నారు. స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కార్యక్రమాన్ని ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రస్తుతం అమలవుతున్న చట్టాలు, నేరాలు, శిక్షలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా, సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయవద్దని ట్రైనీ ఎస్ ఐ మహాలక్ష్మీ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ బి.రవికుమార్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పీవో రాంప్రసాద్, అధ్యాపకులు ధర్మారావు, శ్రీనివాసరావు, రామారావు తదితరులు పల్గొన్నారు.

విషాదం మిగిల్చిన ఐటీ విద్యార్థుల మృతి
రాజాం, నవంబర్ 17: మడ్డువలస రిజర్వాయర్ ప్రాంతంలో మృతి చెందిన ఉరిటి రామతేజ (19), ఎం.సాయికిరణ్ (19) మృతి రాజాం ప్రాంతంలో విషాదం నింపింది. స్నేహితులైన వీరిద్దరు శుక్రవారం మడ్డువలస ప్రాంతంలో విహారయాత్రకు వెళ్లి మృత్యువాత పడ్డారు. రాజాంకు చెందిన ఉరిటి రామతేజ తండ్రి జగదీష్‌కుమార్ రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృత్తివిద్య లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తల్లి పార్వతి గృహిణిగా రామతేజపై గంపెడాశలు పెట్టుకొన్నప్పటికీ మృత్యువు కబళించడంతో వారి రోదన వర్ణనాతీతంగా మారింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన సాయికిరణ్ మృతితో జీ ఎం ఆర్ ఐటీ ప్రాంగణంలో తోటి విద్యార్థులంతా బోరున విలపించడంతో ఆ ప్రాంతం విషాదమయమైంది. ఇద్దరి మృతదేహాలు శనివారం మధ్యాహ్నం రాజాం సామాజిక ఆసుపత్రికి శవపంచనామా కోసం తీసుకొచ్చినప్పుడు మృతుల బంధువులు, తోటి విద్యార్థులు పెద్ద ఎత్తున విలపించడం కనిపించింది. ఏది ఏమైనప్పటికీ మడ్డువలస ప్రాంతంలో తరచూ ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అధికారులు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు కూడా ఈత రానప్పటికీ లోతుగా ఉన్న ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడంలో ఆసక్తి చూపడంతో పలు మరణాలు సంభవిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. రామతేజ తండ్రి జగదీష్ కుమారుడి మృతదేహాన్ని సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయనకు వైద్యసేవలందించారు. శనివారం సాయంత్రం జీ ఎం ఆర్ శ్మశాన వాటికకు రామతేజ మృతదేహాన్ని తరలించినప్పుడు రాజాం ప్రజలు వెన్నంటే నడిచారు. సాయికిరణ్ మృతదేహాన్ని శపపంచనామా అనంతరం ప్రత్యేక వాహనంలో ఆయన స్వగ్రామనికి తీసుకెళ్లిపోయారు.