శ్రీకాకుళం

ప్రజాసంఘాల నాయకులపై కేసులు ఉపసంహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (టౌన్), నవంబర్ 17: జిల్లాలో తిత్లీ తుఫాన్ కారణంగా సర్వం కోల్పోయిన రైతులు, మత్స్యకారులు బాధితులను పరామర్శించి వారికి ఆహారపదార్ధాలు, నిత్యావసర సరుకులు, బట్టలు అందించేందుకు వెళ్లిన దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం, ప్రజా కళామండలి, అమరవీరుల బందు మిత్రుల సంఘం, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు, కార్యకర్తలపై పోలీసులు, ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక అంబేద్కర్ విజ్ఞాణమందిర్‌లో పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు పత్తిరి దానేష్ అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో అఖిళభారత రైతుకూలి సంఘ నాయకులు తాండ్ర ప్రకాశ్, సిపి ఎం జిల్లా కార్యదర్శి బవిరి కృష్ణమూర్తి, ఇప్‌టు జిల్లా కార్యదర్శి నీలం రాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ బాధితుల పక్షాన నిలబడి వారిని ఓదార్చడం మానవతతో ఆహార పదార్ధాలను అందించడం దేశద్రోహమా అని ప్రశ్నించారు. జీవించే హక్కు, ప్రశ్నించే హక్కులను కాదలరాస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలన్నారు. అక్రమంగా అరెస్ట్‌చేసిన 15 మందిలో వ్యాధిగ్రస్థులు, మహిళలు, వృద్ధులు ఉన్నారని, వారి విడుదలకై అందరూ నినదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెలమల ప్రభాకరరావు, పకీర్ నాయుడు, టి.రామారావు, కె.పురుషోత్తం, కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.

..............

కార్మిక హక్కులు పరిరక్షించాలి
గార, నవంబర్ 17: కార్మిక హక్కులు పరిరక్షించని పరిశ్రమలుపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సి.ఐ.టి.యు. డివిజన్ ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు అన్నారు. మండలం వత్సవలస ట్రైమెక్స్ పరిశ్రమ ఆవరణలో తమ డిమాండ్లు పరిష్కారం కోరుతూ గడచిన కాలంగా స్తానిక కార్మికులు పోరాటం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం పరిశ్రమ ఆవరణలోనే కార్మికులు పెద్ద ఎత్తున వంటవార్పు గావించి తమ నిరసనను తెలియజేసారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ పరిశ్రమలు కార్మిక చట్టాలు అమలు చేయాలన్నారు. కార్మిక చట్టాలు అమలు చేయని పరిశ్రమలుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఈ సందర్భంగా పరిశ్రమ ఆవరణలో కార్మికులు వంటావార్పు గావించారు.

తిత్లీ తుఫాన్ గ్రామాల్లో ఎన్ ఎస్ ఎస్ సేవలు
ఎచ్చెర్ల, నవంబర్ 17: జిల్లాను కకావికలం చేసిన తిత్లీ తుఫాన్ బాధిత గ్రామాల్లో అంబేద్కర్ వర్శిటీ ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో వాలంటీర్లు సేవలందించి స్థానికుల మన్ననలు పొందారు. వైస్ ఛాన్సలర్ కూనరామ్‌జీ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అనూరాధ నేతృత్వంలో ప్రోగ్రాం అధికారుల పర్యవేక్షణలో జాతీయ సేవాపతకం వాలంటీర్లు బృందాలుగా ఏర్పడి సహాయ చర్యలు చేపట్టారు. పలాస, కావలి, కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో మంచినీరు, ఆహారం సరఫరా చేయడమే కాకుండా పునరావాస కార్యక్రమాలు చేపట్టి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాలతో పాటు ఉద్దానంలో అనేక గ్రామాల్లో సమీపంలో ఉన్న విద్యా సంస్థల్లో జాతీయ సేవాపతకం వాలంటీర్లను భాగస్వామ్యమం చేసి తిత్లీ బాధితులకు తక్షణం సహాయం అందించడంలో ముందు వరుసలో నిలిచారు. ఈ బృందాలను వైస్ ఛాన్సలర్, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.