శ్రీకాకుళం

మొక్కలు నాటి ఫలితాలు పొందండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 17: ప్రతీ ఇంట మొక్కలు నాటి వాటినుండి వచ్చిన ఫలితాలు పొందాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. శానివారం స్థానిక కంపోస్ట్ కాలనీలో జరిగిన వనం-మనం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనిషి సంపూర్ణమైన ఆరోగ్యం పొందడానికి కావల్సినవి గాలి, నీరు, చెట్లు ప్రధానమైనవి అని అన్నారు. అడవులు అంతరించిపోవడం వలన ప్రకృతి అంతరించిపోతుందని అన్నారు. పూర్వవైభవం కావాలంటే ప్రతీ ఇంటా చెట్లను నాటాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి అని అన్నారు. చెట్లను నాటడం వలన ప్రకృతి చల్లబడి ఎండలు కూడా చల్లబడతాయన్నారు. విద్యార్ధులు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి దాని పరిరక్షణ బాధ్యత తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయని చెప్పారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మొక్కలు నాటడం వల్ల కలిగే సత్ఫలితాలు గూర్చి వివరించి వాతావరణ కాలుష్య నివారణకు తోడ్పడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి బి.్ధనంజయరావు, గృహనిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరక్టర్ ఆర్.నర్శింగరావు, జిల్లా రేంజ్ ఆఫీసర్ జె.జగదీష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఐ ఎస్ నాయుడు, జె.సింధు, రాఘవయ్య, సిబ్బంది, టిపి ఎమ్ హెచ్ హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

..............

పేరుకే ప్రత్యేకాధికారులు.. పాలన పూర్వపు సర్పంచులదే
* కార్యదర్శులు ఖాతరు చేయడం లేదు* పంట భీమా పరిహారంపై న్యాయ సహాయం
* ఎల్.ఈ.డి. బల్బులు ఏర్పాటు చేసేదెన్నడో * సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకరువు
గార, నవంబర్ 17: స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎం.పి.పి. గుండ అమ్మలు అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అజెండా ప్రాప్తికి విభాగాలు వారీగా సమీక్షించారు. పంటలు భీమాకి సంబంధించి వివిధ బ్యాంకులు ద్వారా రైతులు భీమా ప్రీమియం సకాలంలో చెల్లించినప్పటికీ చాలా వరకు భీమా పరిహారం అందలేదని, భీమా ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని, లేకుంటే రైతులు ద్వారా న్యాయ సహాయాన్ని ఆర్ధించవలసి వస్తుందని సతివాడ ఎం.పి.టి.సి. యాళ్ల నారాయణరావు, శ్రీకూర్మం ఎం.పి.టి.సి. కోరాడ వెంకటరావు అన్నారు. సర్పంచులు పదవీకాలం ముగిసినప్పటికీ పంచాయితీల్లో ప్రత్యేకాధికారులు పాలన పేరుకే.. అని, ప్రత్యేకాధికారులు, పంచాయితీ కార్యదర్శులు పూర్వపు సర్పంచులు సూచనలు మేరకే పనిచేస్తున్నారని, తమను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదని ఎం.పి.టి.సి.లు ఆవేదన వ్యక్తం చేసారు. పంచాయితీ స్థాయిలో జరిగే ఏ కార్యక్రమం లోనూ తమను గుర్తించడం లేదని వారు వాపోయారు. పంచాయితీ గ్రామాలకు సంబంధించిన ఏ సమస్యపైన ప్రస్థావించినా సర్పంచును అడగాలని కార్యదర్శులు అంటున్నారని, అటువంటప్పుడు ఎం.పి.టి.సి.లుగా తాము ఎందుకని వారు నిరసన గళం విప్పారు. సర్వసభ్య సమావేశాల్లో కేవలం తాము ఉత్సవ విగ్రహాలుగానే ఏ గుర్తింపు లేకుండా ఉన్నామని, ప్రత్యేకాధికారులు పాలనలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుండడం బాధాకరమన్నారు. పరిస్థితిలో మార్పు రాకపోతే న్యాయపోరాటానికి సిద్ధమని వారు ఈ సందర్భంగా స్పష్టం చేసారు. అలాగే పంచాయితీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఎల్.ఈ.డి. విద్యుత్ బల్బులుపైనా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్రామాల్లో వీది లైట్లు లేక గాడాంధకారం నెలకొంటుందని, బల్బులు కొంటాం వేయండని కార్యదర్శులకు అంటున్నా వారు పెడచెవిన పెడుతున్నారని సభ్యులు వాపోయారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు యల్లాయమ్మ, తహశీల్దారు కార్యాలయ సూపరింటెండెంట్ చక్రవర్తి, ఎం.పి.టి.సి.లు, అధికారులు ఉన్నారు.