శ్రీకాకుళం

టీడీపీతోనే నవ్యాంధ్ర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రపుకొత్తూరు, నవంబర్ 19: టీడీపీ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని టీడీపీ సీనియర్ నాయకుడు వంక నాగేశ్వరరావు అన్నారు. సోమవారం పెద్దబొడ్డపాడులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంక్షేమం ధ్యేయంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా పనిచేస్తుందన్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావడం ప్రభుత్వంపై ప్రజల విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ, ఎంపీ రామ్మోహన్‌నాయుడు సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి కమిటీ అధ్యక్షులు గోపాలరావు, టి.రంగారావు, కో ఆర్డినేటర్లు పి.బాలు, శేషు, ఈశ్వర్, రామారావు, గ్రామనాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ఏకాదశి పూజలు
పలాస, నవంబర్ 19:కార్తీకమాసం తొలి ఏకాదశి కావడంతో విష్ణు ఆలయాలు హరినామస్మరణతో మారుమ్రోగాయి. ఏకాదశి నాడు పలాసలోని శ్రీకృష్ణ చైతన్య పూజా కమిటీ ఆధ్వర్యంలో పెద్దవీధిలో వేకువజామున 3 గంటలకు జలాధివాసం, నగరసంకీర్తన, విఘ్ననేశ్వరపూజ, దీపారాధన, మహామంత్రం, అష్టప్రహారీ మహాయజ్ఞంలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం చేపట్టి సాయంత్రం తులసీకోట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండవ సోమవారం సందర్భంగా శివాలయాలుభక్తులతో కిటకిటలాడాయి. కాశీబుగ్గలోని చిన్నబ్రాహ్మణవీధి వద్ద ఉన్న ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ శక్తి మేర దీపదూప నైవేద్యాలు సమర్పించుకున్నారు. పలు దేశాలయాల్లో ఏకాదశి సందర్భంగా సత్యానారాయణవ్రతాన్ని నిర్వహించారు. 24 గంటల పాటు హరికృష్ణ, హరిరామ భజనతోపాటు మహాయజ్ఞంను నిర్వహించారు.

నయనం ప్రదానం
పలాస, నవంబర్ 19: ప్రతి జీవికి నయనం ప్రదానమని పలాస ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు అన్నారు. సోమవారం పలాస ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థులకు ఉచితంగా నేత్రపరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఇ ఐ కేంద్రంలో అత్యాధునిక కంటి వైద్యపరీక్షలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఈ కేంద్రంలో ప్రతి రోజు నేత్రపరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి కళ్లద్దాలను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఈ కేంద్రాల్లో నేత్రాలను పరీక్షించుకుంటే డయాబెటిక్, రెటోనాపతి, హైటెన్షన్, రెటోనాపతి, గ్లోకామా, 19 ఏజ్ రిలెడెట్ మాక్యులర్ డిజరేషన్ కేసులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకాశ్‌వర్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్, నేత్ర వైద్యనిపుణులు కృష్ణారావు, ఆర్.వెంకటరమణ, సిబ్బంది, నీలవేణి, దివ్య తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు
ఇచ్ఛాపురం, నవంబర్ 19 : కార్తీక ఏకాదశి, సోమవారం సందర్భంగా పట్టణంలోని ఆలయాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గిలాయి వీధి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వేద పండితుడు తెనే్నటి తేజేశ్వరశర్మ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. 134 జంటలు వ్రతాలలో పాల్గొన్నాయి. గత 25 ఏళ్లుగా సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్నామని శర్మ తెలిపారు. జనార్దనాచార్యులు ఆధ్వర్యంలో కోటి తులసి పూజ జరిపారు. పెద్ద జగన్నాథస్వామి, పాతాళ సిద్ధేశ్వరస్వామి, స్వేచ్ఛావతి అమ్మవారు, సత్యనారాయణస్వామి ఆలయాలలో ప్రత్యేక అర్చనలు జరిపారు. వందలాది మంది భక్తులు బాహుదా నదిలో కార్తీక స్నానాలు చేశారు.

ఇందిరాగాంధీ సేవలు అమోఘం
పలాస, నవంబర్ 19: భారతదేశ అభివృద్ధికి తొలి భారత్ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు అమోఘమని ఎ ఐసీసీ సభ్యుడు, పలాస కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి నాయకులు డాక్టర్ దున్న వాసుదేవరావు అన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పలాస ఇందిరాచౌక్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సేవలో పేదరికం నిర్మూలనకు ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేసారని, ఆమె చూపిన తెగువ, సాహసాలు భారతదేశానికి ప్రపంచంలో మంచి గుర్తింపును తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి నేటికి కనిపిస్తుందని, అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ సాటి రాదన్నారు. ఈ కార్యక్రమంలో పలాస కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తంగుడు వీర్రాజు, మందస మండల పార్టీ అధ్యక్షుడు తెప్పల వీరాస్వామి, పి.మాధవరావు, మడ్డు శాంతామూర్తి, పాలవలస జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ
పలాస, నవంబర్ 19: తిత్లీ తుపాన్ బాధితులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం టెక్కలిపట్నం పంచాయతీలో జనసేన నాయకులు కోత పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో 5 వేల కుటుంబాలకు దుప్పట్లును పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకోవడం మానవతా దృక్పథమని, దుబాయ్ పవనిజం సభ్యులు తిత్లీ తుపాన్ బాధితులకు సహాయం చేసేందుకు దుప్పట్లు పంపగా, వాటిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, పవన్ కల్యాణ్ పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం తుపాన్ సహాయంగా 220 కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ సీ ఎం కావడం ఖాయమని, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని, దేశంలో ఏ పార్టీ చేపట్టని విధంగా స్థానిక సమస్యలను ఏజెండా మ్యానిఫెస్టోను రూపొందించి ప్రజల అభివృద్ధి కోసం పరితపించే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ పవనిజం సభ్యులు బల్ల శ్రీనివాసరావు, సవర సుమన్, కె.కృష్ణారావు, కాశీ తదితరులు పాల్గొన్నారు.

తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకోవడం మానవత్వం
పలాస, నవంబర్ 19: తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకోవడం మానవత్వమని వైసీపీ నాయకులు బడగల బల్లయ్య, వాసుదేవ్ ప్రాజెక్టు ఇన్‌ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ బడగల శశాంక్‌లు అన్నారు. సోమవారం పలాస మండలంలోని తిత్లీ తుపాన్ బాధితులకు దుస్తులను, దుప్పట్లును పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిత్లీ తుపాన్ ధాటికి ప్రజలంతా నిరాశ్రయులుగా మారారని, కొన్ని కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డునపడ్డారని, ఆ కుటుంబాలకు నేటికీ ఆసరా లేకుండా పోయిందన్నారు. అటువంటి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ పెద్ద మనస్సుతో ముందుకు రావాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేసారు. తిత్లీ తుపాన్ సమయంలో అధికారుల హాడావుడి, ప్రభుత్వ ప్రచార ఆర్భాటం తప్పితే ప్రజలకు మాత్రం న్యాయం చేకూరలేదన్నారు. ఇప్పటికి నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో కె.శ్రీకాంత్, రామారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జోరుగా టీడీపీ సభ్యత్వాల నమోదు
మందస, నవంబర్ 19:మందస మండలంలోని నారాయణపురం పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదు జోరుగా సాగుతుంది. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ అధ్యక్ష,కార్యదర్శులు డి.తాతారావు, లింగరాజులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఉద్దాన ప్రజలు ఆదరాభిమానాలకు రుణపడి ఉంటామని, పార్టీలో సభ్యత్వం నమోదుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, అభివృద్ధిని చూసి దేశం పార్టీకి ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. సీ ఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్నప్పటికి అన్ని రంగాల్లో అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు చేయూతను ఇవ్వాలన్నారు. టీడీపీ నాయకులు దుర్వాసులు, తులసీరావు, రుద్రయ్య, దామోదరం, రాజశేఖర్, బీమారావు, ఎ.తాతారావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ పాలనలో సమగ్రాభివృద్ధి
ప్రభుత్వ విప్ కూన రవికుమార్
సరుబుజ్జిలి, నవంబర్ 19: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పుడు ప్రతి గ్రామం సమగ్రాభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. సోమవారం మండలంలోని చిగురువలస గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మాణం చేస్తున్న రక్షిత మంచినీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. శిలాఫలకం ఆవిష్కరించిన విప్ రవికుమార్ అనంతరం చిగురువలస ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలతో పాటు సామాజిక అభివృద్ధి సాధించడమైందన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రహదారులు పూర్తి చేయడంతో పాటు ప్రధాన రహదారి నుంచి గ్రామాలకు పక్కా రహదారులు కూడా ఏర్పాటు చేయడమైందన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఇప్పటికే కొన్ని గ్రామాలకు బీటీ రహదారుల నిర్మాణాలు పూర్తి చేయగా మిగిలిన గ్రామాలకు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇంకా రహదారులు లేని గ్రామాలకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. అలాగే పార్టీలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమైందన్నారు. చిగురువలస గ్రామ పంచాయతీలోని ఐదు గ్రామాలకు ఎటువంటి సాగునీటి ఆధారం లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకుంటున్న వంశధార, నాగావళి అనుసంధాన కాలువలకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధి గూర్చి నిరంతర శ్రామికుడిగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఎంసీ చైర్మన్ పల్లి భాస్కరరావు, మండల పార్టీ అధ్యక్షులు లావేటి పూర్ణారావు, టీడీపీ నాయకులు శివ్వాల సూర్యనారాయణ, కింజరాపు సురేష్‌బాబు, ఆర్‌డబ్ల్యు ఎస్ డీ ఈ ఆశాలత, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.