శ్రీకాకుళం

హృదయాన్ని కదిలించింది...బాధితులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రపుకొత్తూరు, నవంబర్ 19: తిత్లీ తుపాన్ హృదయాన్ని కదిలించిందని తుపాన్ బాధితులను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హంస కుమార్ గంగరాం అహిర్ అన్నారు. సోమవారం తుపాన్ ప్రభావిత ప్రాంతంలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. మంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం ముందుగా నగరంపల్లి తుపాన్ బాధితులతో మాట్లాడాల్సి ఉండగా ఆలస్యం కావడంతో రద్దు చేసుకున్నారు. పిహెచ్‌సి కమిటీ చైర్మన్ దువ్వాడ వెంకటకుమార్ చౌదరి మాట్లాడుతూ కేంద్రమంత్రికి పంట నష్టం, రైతుల సమస్యలు విన్నవించుకుందామని రైతులతో వేచి ఉంటే మంత్రి పర్యటన రద్దు కావడం నిరాశకు గురి చేసిందన్నారు. తుపాన్ తీరం దాటిన చినవంక ప్రాంతానికి చేరుకొని తుపాన్ ధాటికి నేలకొరిగిన జీడి, కొబ్బరి చెట్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి తుపాన్ రోజు వారు ఎదుర్కొన్న కష్టాలను తెలుసుకొని చలించిపోయారు. డోకులపాడులో తుపాన్‌కి కూలిన ఇళ్లను పరిశీలించారు. తుపాన్ సృష్టించిన విధ్వంసాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధితులకు నేరుగా నష్టపరిహారం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. తుపాన్ నష్టపరిహారం పంపిణీలో అవకతవకలు భారీగా జరిగాయని తమ దృష్టికి వచ్చిందని, భూములు లేని వారు విచిత్రంగా పరిహారం అందుకున్న వారి జాబితాలో ఉండడంతో నిజమైన బాధితులకు అన్యాయం జరిగిందని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. జడ్‌పిటిసి యు.నీలవేణి, అగ్నికుల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యు. ఉదయ్‌కుమార్‌లు కేంద్ర సహాయమంత్రిని కలుసుకొని తిత్లీ తుపాన్ సాయం అందించాలని వినతిపత్రం అందించారు. ఉద్దానం ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు కలుసుకొని తుపాన్ బాధితుల సమస్యలను కేంద్రమంత్రికి వివరించారు. ఆయనతో పాటు ఇన్‌చార్జ్ కలెక్టర్ కెవి ఎన్ చక్రధరబాబు, బిజెపి జాతీయకార్యదర్శి సునీల్ ధియోధర్, రాష్ట్ర బిజెపి కార్యదర్శి పైడి వేణుగోపాలం, మాజీ ఎంపి కె.విశ్వనాధం, బిజెపి శాసనసభ పక్షనేత టి.విష్ణుకుమార్‌రాజు, ఎం ఎల్‌సి మాధవన్, పలాస నియోజకవర్గ ప్రతినిధి కొర్రాయి బాలకృష్ణ, డి.రవీంద్రబాబు, చల్లా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.