శ్రీకాకుళం

సత్యసాయి మందిరాన్ని దర్శించిన ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్), నవంబర్ 19: నగరంలోని న్యూకాలనీలో ఉన్న సత్యసాయిబాబా మందిరాన్ని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి దర్శించారు. బాబా భక్తులు సాయి మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేవ, సహనంతో మనుషులుంటే ఈ సమాజం బాగుపడుతుందని, మహిళలకు సేవ, సహనం కలదని మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేశారు. మహిళలు పురుషుల కన్నా దేంట్లోను తీసిపోరని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి భక్తులు పాల్గొన్నారు.
కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో లక్ష తులసీ దళార్చన
శ్రీకాకుళం (రూరల్), నవంబర్ 19: కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా నగరంలోని కలెక్టర్ బంగ్లాకు సమీపంలో ఉన్న శ్రీకళ్యాణ వెంకటేశ్వర దేవస్థానంలో సోమవారం లక్ష తులసీదళార్చన కార్యక్రమం నిర్వహించారు. సహస్ర విష్ణు పారాయణం, శివ స్తోత్రం ఆలయ అర్చకులు భాస్కరబట్ల చంద్రశేఖర్ బృందంచే నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఘనంగా ఆదిత్యుని కళ్యాణం
శ్రీకాకుళం (రూరల్), నవంబర్ 19: ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్తీకమాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకర శర్మ నేతృత్వంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఉత్సవంలో దంపతులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.