శ్రీకాకుళం

బీజేపి భూ రక్షణ దీక్షను జయప్రదం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 19: రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులనుండి లాక్కొన్న వేలాది ఎకరాల భూమిని అభివృద్ధి వంకతో తమకు కావలిసిన వారికి దారాదత్తం చేస్తున్న టీడీపీ భూ దాహానికి వ్యతిరేకంగా బీజేపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21న ఉదయం 10 గంటలనుండి కలెక్టర్ కార్యాలయం వద్ద భూరక్షణ దీక్ష చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షులు కోటగిరి నారాయణరావు తెలిపారు. ఉదయం 10గంటల నుండి ఈ దీక్ష ప్రారంభమవుతుందని బీజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19 నుండి 24 వరకు చేపడుతున్న దీక్షల్లో భాగంగి జిల్లాలో 21న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీక్షా కార్యక్రమం నగరంలోజరుగుతున్నందును నగర బీజేపి సభ్యులందరూ పాల్గోనాలని కోరారు.
మైలేజ్ కోసమే జగన్ రాజకీయ డ్రామా
* మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 19: మైలేజ్‌కోసమే జగన్మోహనరెడ్డిది రాజకీయ డ్రామా అని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పేర్కొన్నారు. అరసవిల్లిలో తన నివాస గృహంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోడికత్తి డ్రామా అసత్యం వల్లే ప్రజాస్పందన లేదని దీనికి తెరమీదకు తీసుకురావడం కోసం తల్లి విజయమ్మను ఉపయోగించడం, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఈ విషయాన్ని నెట్టేందుకు ప్రయత్నం చేయడం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడమేనని అన్నారు. ప్రాథమిక దర్యాప్తుకు సహకరించకుండా జగన్ ధరించిన వస్త్రాలను పోలీసులకు అప్పజెప్పకుండా హుటాహుటిన ఆంధ్రప్రదేశ్‌ను విడిచి విమానంలో తెలంగాణ వెళ్లడం బాధ్యతను విస్మరించడం కాదా అని ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదేవిషయాన్ని కోర్టులు, పోలీసులతో పాటు సాధారణ పౌరులు కూడా ప్రశ్నిస్తున్నారని, ఈవిషయం జగన్‌కు తెలీదా అని అన్నారు. దీనంతటికి కారణం అతుకుల్లేని అసత్యకరంగా వ్యవహారిస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా ప్రజా విశ్వాసం లేని కత్తి డ్రామాను తెరపైకి తెస్తూ ప్రజలను విసిగించవద్దని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేశ్, తోణంగి వెంకన్న యాదవ్, ప్రధాన విజయరాం, కె.సుసీల, గంగు నాగేశ్వరరావు, కరగాన రాము, సీపాన రమ, బుర్రా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.