శ్రీకాకుళం

తిత్లీ బాధితులను కేంద్రం ఆదుకుంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 19: తిత్లీ బాధితులకు కేంద్రం సహాయమందించి ఆదుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహీర్ అన్నారు. సోమవారం తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన అనంతరం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఉద్దానం ప్రాంతంలోని వజ్రపుకొత్తూరు, టెక్కలి మండలాల్లో పర్యటించడం జరిగిందన్నారు. తుఫాన్ సంభవించిన తక్షణమే అక్టోబర్ 11న ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాలను తక్షణ సహాయక చర్యల్లో భాగంగా జిల్లాకు పంపించడం జరిగిందని తెలిపారు. ఇంటర్ మినిస్టీరియల్ టీంను సైతం తక్షణమే పంపించామని ఎన్డీ ఆర్ ఎఫ్ నిబంధనల ప్రకారం రూ.539 కోట్లును అదనంగా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. 2018-19 సంవత్సరానికి ఎన్డీ ఆర్ ఎఫ్ నిబంధనల మేరకు రెగ్యులర్‌గా విడుదల చేసే రూ. 229 కోట్లు డిసెంబర్‌లో విడుదల చేయాల్సి వుండగా ముందుగా అక్టోబర్‌లో విడుదల చేశామని చెప్పారు. తిత్లీ తుఫాన్‌లో దెబ్బతిన్న 45వేల గృహాలను పి ఎం ఏ వై కింద మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ. 2.50 లక్షలు అందిస్తుందని అన్నారు. ఫుడ్ సెక్కూరిటీ స్కీం కింద ఆరునెలల వరకు రేషన్ షాప్‌ల ద్వారా బియ్యాన్ని కార్డుదారులకు ఉచితంగా అందించేందుకు అవకాశం మేరకు ఏడాది కాలం పాటు పంపిణీకి యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి కృషి సిచా యోచనా కింద జిల్లాలోని ఇరిగేషన్ చెరువులకు నిధులను మంజూరు చేస్తామన్నారు. ఉపాధి హామీలో జిల్లాలో 100 నుండి 200 పనిదినాలకు పెంపుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 18 మండలాలలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతలను ఆదుకుంటామని, రాజకీయాలకతీతంగా తెలుగు ప్రజలకు సహాయసహకారాలను అందిస్తామన్నారు. ఎన్డీ ఆర్ ఎఫ్ నిబంధనల మేరకు రు.1339 కోట్లు మాత్రమే నష్ట అంచనాలుగా తేలిందని ఆయన వివరించారు. ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ కెవి ఎన్ చక్రధరబాబు తిత్లీ తుఫాన్ ప్రభావం, నష్టాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. రాష్ట్ర విపత్తులు, పునరావాస శాఖ సంచాలకులు ప్రసన్న వెంకటేశ్ మాట్లాడుతూ ఎన్డీ ఆర్ ఎఫ్ నిబంధనల కింద రూ. 1330 కోట్లను విడుదల చేయాల్సిందిగా మంత్రిని కోరారు. తిత్లీ తుఫాన్ సంభ వించిన వెంటనే అక్టోబర్ 12వ తేదీన తాత్కాలిక అంచనాల ప్రకారం రూ. 2,305 కోట్లు నష్టం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారని తెలిపారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 1030 కోట్లు తుఫాన్ సహాయక పునరావాస చర్యలకు వ్యయం చేసిందని వివరించారు. ఎన్టీ ఆర్ ఎప్ నిబంధనల కింద విడుదల చేయాల్సిన రూ.1330 కోట్లు విడుదలకు లేఖ రాయడం జరిగిందని చెప్పారు. రెగ్యులర్‌గా ఎన్డీ ఆర్ ఎఫ్ నిధిగా విడుదల చేసే రూ. 229 కోట్లును మాత్రమే కేంద్రం విడుదల చేసిందని ప్రసన్న వెంకటేశ్ చెప్పారు. ఈ మొత్తం సైతం డిసెంబర్‌లో విడుదల చేయాల్సివుండగా ముందస్తుగా అక్టోబర్‌లో విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. తిత్లీ తుఫాన్‌కు సంబంధించిన ఏ మొత్తం కేంద్రం నుండి ఇంకా విడుదల కాలేదని ఆయన తెలిపారు. ఈమేరకు వినతి పత్రాన్ని మంత్రికి ప్రసన్న వెంకటేశ్ అందించారు. సమాచారం పౌర సంబంధాల శాఖ నిర్వహించిన తిత్లీ తుఫాన్ ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి, బృంద సభ్యులు తిలకించారు. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు పివి ఎన్ మాధవ్, విశాఖపట్టణం ఎమ్మెల్యే టి. విష్ణుకుమార్‌రాజు, ఎస్పీ సి ఎం త్రివిక్రమవర్మ, డి ఆర్‌వో కె.నరేంద్రప్రసాద్, హోం శాఖ విపత్తుల విభాగం డైరక్టర్ సుధీర్‌కుమార్ రాయ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరక్టర్ ప్రసన్నవెంకటేశ్, ఎన్డీ ఆర్ ఎప్ కమాండెంట్ జహీద్, డిప్యూటీ కమెండర్ లవకుమార్, ఆర్‌డివో ఎమ్‌వి రమణ, జిల్లా అధికారులు, అనాధికారులు సునీల్ దియోదర్, పైడి వేణుగోపాలం, దుప్పల రవీంద్రబాబు, కణితి విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.

తిత్లీ తుఫాన్ నిధులు విడుదల చేయాలి
* రాష్ట్ర విపత్తుల శాఖ డైరక్టర్

శ్రీకాకుళం, నవంబర్ 19: రాష్ట్ర విపత్తులు, పునరావాస శాఖ సంచాలకులు ప్రసన్నవెంకటేశ్ ఎన్డీ ఆర్ ఎప్ నిబంధనల కింద రూ. 1330 కోట్లును విడుదల చేయాల్సిందిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని కోరారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేశ్ మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ సంభవించిన వెంటనే అక్టోబర్ 12న తాత్కాలిక అంచనాలు ప్రకారం రూ.2,305 కోట్లు నష్టం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖరాసినట్లు తెలిపారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తుఫాన్ సహాయక, పునరావాస చర్యలకు వ్యయం చేసిందని వివరించారు. ఎన్డీ ఆర్ ఎప్ నిబందనల కింద విడుదల చేయాల్సిన రూ. 1330 కోట్లు విడుదలకు లేఖ రాయడం జరిగిందని చెప్పారు. రెగ్యులర్‌గా ఎన్డీ ఆర్ ఎప్ నిధిగా విడుదల చేసే రూ. 229 కోట్లను మాత్రమే కేంద్రం విడుదల చేసిందని ఆయన చెప్పారు. ఈమొత్తం సైతం డిసెంబర్‌లో చేయాల్సివుండగా ముందస్థుగా అక్టోబర్‌లో విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈసందర్భంగా మంత్రికి వినతి పత్రాన్ని ప్రత్యేకంగా సమర్పించారు.
అఖండ నామ సంకీర్తనతో భక్త జనం
లావేరు, నవంబర్ 19: కార్తీక సోమవారం, ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకొని భక్తజనం అఖండ నామ సంకీర్తనతో శివనారాయణులను స్మరించారు. భక్తుల సందోహాల మద్య శైవ, వైష్ణవ ఆలయాలు కిటకిటలాడాయి. మురపాకలో రామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో 24 గంటల నిర్విరామ భజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక వేత్త జగిలింకి శ్రీరాములు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ కార్తీక మాసం అన్ని మాసాల్లో ఉత్కృష్టమైనదని అన్నారు. కార్తీక మాసంలో శైవ, వైష్ణవ ఆలయాల్లో దీపారాధన, దీపదానం, అన్నదానం, వస్తద్రానం చేయడంతో పుణ్యలోకాలు సిద్ధిస్తాయని అన్నారు. భజన బృందం సభ్యులు బార్ల సింహాచలం, ప్రగడ శ్రీనివాసరావు, గండేపల్లి వాసు, ఎనే్నటి వాసు తదితరులు రామమందిరంలో భక్తుల దర్శనార్ధం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లావేరు చంద్రశేఖర ఆలయం, తామాడ రంగనాధస్వామి ఆలయం, రౌతుపేట నీలకంఠేశ్వరస్వామి ఆలయం, మురపాక సనారి విశే్వశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడాయి.

అయ్యప్ప ఆరాధనలో స్వాములు
లావేరు, నవంబర్ 19: కార్తీక మాసాన్ని పురష్కరించుకొని అయ్యప్ప దీక్షలు పూనిన స్వాములు దీక్షా మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయ్యప్పమాలాదారణ కఠిన నియమనిబంధనలతో కూడినప్పటికి భక్తులు మాలాదారణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. గ్రమాల్లో ఈ ఏడాది అయ్యప్ప స్వాముల సంఖ్య గణనీయంగా పెరిగింది. మురపాక సన్నిధానంలో సుమారు 40 మంది వరకు స్వామి దీక్షాదారులు భజనలు చేస్తున్నారు. గడిచిన 20 ఏళ్లుగా ఈ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కార్తీక సోమవారాన్ని పురఫ్కరించుకొని అయ్యప్పదీక్షా దరులు స్వామివారిని స్తుతిస్తూ ప్రత్యేక గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి కేశవ స్వామి, కిషోర్‌స్వామి, సుబ్బారావుస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌స్పైర్ అవార్డ్‌కు కార్తీక్ ఎంపిక
లావేరు, నవంబర్ 19: మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్ అవార్డ్‌కు తామాడ జూనియర్ కళాశాలలో 8వ తరగతి విద్యార్థి చిత్రిక కార్తీక్ ఎంపికయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో5,698 మంది విద్యార్థులు ఇన్‌స్పైర్ అవార్డ్‌కి ఎంపికకాగా జిల్లాలో 71 మంది మాత్రమే ఎంపికయ్యారు. వీరిలో లావేరు మండలం నుండి ఒకే ఒక్క విద్యార్థి కార్తీక్ ఎంపికవ్వడం విశేషం. కార్తీక్ ఎంపిక పట్ల ఎమ్ ఈవో లండ ఈశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపల్ కె.సంధ్యలు, విద్యార్థులు కార్తీక్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

శివాలయంలో పోటెత్తిన భక్తులు
పాతపట్నం, నవంబర్ 19: కార్తీక నెల సందర్భంగా శివాలయంలో అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా రెండవ సోమవారం ఏకాదశి రెండు కలిసి రావడంతో భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. పాతపట్నం నీలకంఠేశ్వర ఆలయంలో వేకువజామునుంచే అభిషేకాలతో ప్రారంభమై సాయంత్రం వేళలో ఆకాశ దీపం, శిఖర దీపాలతో భక్తులు నిమగ్నమయ్యారు. అదేవిధంగా స్థానిక కేదారీశ్వర ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. నారాయణ నామస్మరణలతో దేవాలయం మార్మోగింది. నీలకంఠేశ్వర ఆలయంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.