శ్రీకాకుళం

తుపాన్ నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంలో సీ ఎం వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, నవంబర్ 20: తిత్లీ తుపాన్ నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లకుండా సీ ఎం చంద్రబాబునాయుడు, అధికారులు శతవిధాలుగా ప్రయత్నించారని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ కణితి విశ్వనాథం అన్నారు. మంగళవారం కణితి స్వగృహంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోం సహాయమంత్రి హన్షరాజ్ గంగారాం అహీర్ తిత్లీ తుపాన్ నష్టాన్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు శారదాపురం వద్ద దృశ్యాన్ని చూసీ తీవ్రంగా చలించిపోయారని, ఇంత నష్టం జరిగినా కేంద్రం దృష్టికి తీసుకురాకుండా సీ ఎం అడ్డుకున్నారన్నారు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో ఇప్పటికి స్పష్టత లేదని, రోజుకో లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. ఇప్పటికీ రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గంతోపాటు మెళియాపుట్టి మండలానికి 10 వేల ఇళ్లు అవసరం ఉన్నాయని, బాధితులకు ప్రధానమంత్రి గృహయోజన పథకం కింద ఇళ్లును మంజూరు చేస్తామన్నారు. కేంద్ర సహాయ మంత్రి స్థానిక పరిస్థితులను చూసి 529 కోట్ల రూపాయలు మంజూరుకు సంసిద్దత వ్యక్తం చేసారన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలో ఈ జిల్లా 13వ స్థానంలో ఉందని, జిల్లాలో అధిక వర్షపాతం, తక్కువ ఉష్ణోగ్రత ప్రాంతం అయినప్పటికి పరిశ్రమలు లేకపోవడంతో వెనుకబడిపోతుందన్నారు. ఎన్ ఆర్ ఐ జీ ఎస్ ద్వారా ప్రతి కుటుంబానికి 200 పనిదినాలు, నిరుద్యోగులు కోసం వృత్తినైపుణ్యం నేర్పించి, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లాలో 8 లక్షల హెక్టార్లు సాగుభూమి ఉందని, వాటి నదుల అనుసంధానం ద్వారా నీరు అందిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని, కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాలవలస వైకుంఠరావు, కె.్భస్కరరావు, పి.మాధవరావు, వైశ్యరాజు రాజు, ఎస్.రామారావు, ఎర్రయ్య, ఎస్.జోగారావు, ఎస్ ఎస్ నాయుడు, దేవరాసు పాల్గొన్నారు.

జగన్ పాదయాత్రను విజయవంతం చేయండి
పలాస, నవంబర్ 20:శ్రీకాకుళంలో చేపట్టనున్న జగన్ పాదయాత్రను వైసీపీ అభిమానులంతా విజయవంతం చేయాలని పలాస వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నియోజకవర్గ ముఖ్యనాయకులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24వ తేదిన వజ్రపుకొత్తూరు మండలంలో వైసీపీ సమావేశం ఉంటుందని, 26వ తేదిన పార్టీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర జిల్లాలో ప్రారంభంకానున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అక్కడకు చేరుకొని జగన్‌కు స్వాగతం పలకాలన్నారు. పలాస నియోజకవర్గానికి డిసెంబర్ నాటికి చేరుకోవచ్చునన్నారు. పాదయాత్రలో ప్రతి కార్యకర్త పాల్గొని నభూతోనభవిష్యత్తుగా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాలిన శ్రీనివాసరావు, బి.గిరిబాబు, దానయ్య, మెట్టకుమారస్వామి, సాయికృష్ణ, సూర్యారావు, భవానీ, పైల చిట్టి, బోర బుజ్జి, బల్లయ్య, పులిరాజు, మధుకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల ఆవరణలో పాము కలకలం
సరుబుజ్జిలి, నవంబర్ 20: మండలంలోని చిన్నపాలెం ఎంపీపీ ఎస్ పాఠశాలకు ఎప్పటికప్పుడు పాములు బెడద భయపెడుతుంది. ఈ పాఠశాల భవనం పొలాల మధ్యలో ఉండడంతో పంట పొలాల్లో ఉన్న పాములు అప్పుడప్పుడు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం ఒక విషసర్పం ప్రవేశించడంతో ఆ గ్రామానికి చెందిన యువకులు దానిని మోది చంపివేశారు. ఈ పాఠశాల భవనానికి చుట్టూ ప్రహరీగోడ లేకపోవడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, గత ఏడాది కూడా ఒక విష సర్పాన్ని చంపడం జరిగిందని హెచ్ ఎం తొత్తడి వైకుంఠరావు తెలిపారు. ఈ విషయాన్ని ఎస్ ఎంసీ సమావేశంలో అనేకసార్లు ఎం ఈవోకు విన్నవించుకున్నట్టు తెలిపారు. అలాగే మధ్యాహ్న భోజనానికి వినియోగించే భవనం పూర్తి స్థాయిలో నిర్మించాలని ఎస్ ఎంసీ భాస్కరరావు, ఉపాధ్యాయులు కోరారు.

పోలీసుల అదుపులో అగ్రిగోల్డ్ ఏజెంట్లు
రాజాం, నవంబర్ 20: ఈ నెల 21న అమరావతిలోని హాయిల్యాండ్ ప్రాంతంలో నిర్వహించనున్న సత్యాగ్రహ దీక్షకు హజరవుతున్న అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంఘ ప్రతినిధులు మీసాల సూర్యనారాయణ, పొగిరి చంద్రరావు, బి.షన్ముఖరావు, దాసరి సూర్యనారాయణలను రాజాం ఏ ఎస్ ఐ నారాయణ, సిబ్బంది మంగళవారం అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారికి రాజాం సీపీ ఐ పార్టీ తరుపున పెంకి కృష్ణ, నీలకంఠశే్వరయాదవ్, దుర్గారావులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని విధాలా నష్టపోయిన ఏజెంట్లు, కస్టమర్లు సత్యాగ్రహ దీక్షకు వెళుతున్నప్పుడు ఇటువంటి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. వారిని విడిచిపెట్టి సత్యాగ్రహ దీక్షకు వెళ్లనివ్వాలని డిమాండ్ చేశారు.

ఘనంగా క్షీరాబ్ది ద్వాదశి
రాజాం, నవంబర్ 20: రాజాంలోని వైష్ణవ దేవాలయాల్లో ఘనంగా క్షీరాబ్ది ద్వాదశి మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్తీకమాసంలో లక్ష్మీసమేత శ్రీమహావిష్ణువు శేషపాన్పు నుంచి ఈ సృష్టి విశేషాన్ని తిలకించే సమయం కాబట్టి ద్వాదశి అత్యంత పుణ్యమైనదని వేద పండితులు పేర్కొన్నారు. రాజగోపాలస్వామి, వరదరాజస్వామి ఆలయాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సారధిలోని విజయ కోదండరామాశ్రమంలో చతుర్మాస దీక్షపూనిన టంకాల సన్యాసినాయుడు దీక్ష విరమణ సందర్భంగా ద్వాదశి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.