శ్రీకాకుళం

క్రీడల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, నవంబర్ 20: విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లోకూడా రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర ఒలింపిక్ సంఘ ఉపాధ్యక్షులు, వాలీబాల్ సంఘ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం కేశవరావుపేట ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో జూనియర్స్ వాలీబాల్ జట్టు ఎంపికలును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసం కల్గుతుందని గుర్తెరగాలన్నారు. క్రీడలు పట్ల ఆశక్తిపెంచుకుంటే చదువుల్లో వెనుకబడతామన్న అపోహను పక్కనపెట్టి విద్యార్థి దశనుంచే క్రీడాపోటీలో పాల్గోవలన్నారు. క్రీడాపోటీల్లో గెలుపోటములు పక్కన పెట్టి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడల పట్ల విద్యార్థులు మక్కువ పెంచుకుంటే క్రీడాస్ఫూర్తి అలవడుతుందన్నారు. దీనివల్ల ఒత్తిడిని జయించి విజయం వైపు దూసుకుపోవచ్చని స్పష్టం చేశారు. ఈయనతో పాటు కార్యదర్శి టి.రామిజోగినాయుడు, ఒలింపిక్ సంఘ కార్యదర్శి పి.సుందరరావు, వై.పోలినాయుడు, పి ఈటి అధ్యక్షులు ఎమ్.వి రమణ, వి.వెంకటనాయుడు, కె.రామచంద్రుడు, బి.సతీష్‌కుమార్, కె.హరిలు మాజీ సర్పంచ్ పైడి భాస్కరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జూనియర్స్ వాలీబాల్ జట్లు ఎంపికలు నిర్వహించారు. ఈనెల 29నుండి గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు.
వాలీబాల్ జట్టు ఎంపికైన క్రీడాకారులు వీరే:
ఎమ్.నీహారిక, డి.రమణమ్మ,మాదవి, ఇందు, వెంకటలక్ష్మి, వి.లత, మల్లిమాధవి, భారతి, లావణ్య, కె.హని, జాహ్నివి, లిఖితనాయుడు, పల్లవి, రీనా, ఇందుమతి బాలికల విభాగంలో ఎంపికయ్యారు. అలాగే ఎమ్.సుధీర్, ఎన్.ప్రసన్నకుమార్, టి.బాలాజి, తరుణ్‌కుమార్, ఎల్.సాయిహరీష్, ప్రకాశ్, గోపి, శ్రీను, నవీన్‌కుమార్, సింహాచలం, చంద్రశేఖర్, లోకేష్, అనంతకుమార్‌లు బాలుర విభాగంలో వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. వీరికి ఈనెల 23 నుంచి డి ఎస్ ఏ కోచ్ కె.హరికృష్ణ ఆధ్వర్యంలో కోచింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ఆఫీస్‌పై అవగాహన పెంచుకోవాలి
* వైస్ ఛాన్సలర్ రామ్‌జీ
ఎచ్చెర్ల, నవంబర్ 20: కాగిత రహిత పాలన కార్యాలయాల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పై బోధనేతర సిబ్బంది ఈ ఆఫీస్‌పై మరింత అవగాహన పెంచుకుంటే విధులు సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారని అంబేద్కర్ వర్శిటీ వైస్ ఛాన్సలర్ కె.రామ్‌జీ అన్నారు. రెండు రోజుల పాటు క్యాంపస్‌లో కార్యాలయ విధులు నిర్వహిస్తున్న 60 మంది బోధనేతర సిబ్బందికి కంప్యూటర్‌పై అవగాహన కల్పించేందుకు శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణాకార్యక్రమాన్ని వీసి మంగళవారం పరిశీలించి మాట్లాడారు. ప్రతీ ఒక్క సిబ్బంది డిజిటల్ సిగ్నేచర్‌తో కార్యాలయ విధులు నిర్వహించేలా శిక్షణలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, అకడమిక్, ఎగ్జామినేషన్ విభాగాలకు చెందిన విధులు వేగవంతంగా నిర్వహించేందుకు ఈ ఆఫీస్ మరింత దోహదపడుతుందన్నారు. ఇదే దిశగా బోధనేతర సిబ్బంది ఆన్‌లైన్ కార్యాకలాపాలపై మరింత ఆశక్తి పెంచుకోవాలన్నారు. శిక్షణలో మెలికవలు నేర్పేందుకు ఏపీఎస్‌ఈహెచ్ రిసోర్స్ పర్సన్ శ్రీకాంత్, డాక్టర్ రామకృష్ణ బోధనేతర సిబ్బందికి సందేహాలు నివృత్తి చేసి ఈ ఆఫీస్ వల్ల కల్గే ప్రయోజనాలను నివృత్తి చేయాలని సూచించారు.

మరుగుదొడ్లు శతశాతం పూర్తిచేయాలి
* ఎంపీపి రమణారెడ్డి
ఎచ్చెర్ల,నవంబర్ 20: వ్యక్తిగత మరుగుదొడ్లు గ్రామాల్లో శతశాతం నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ సిబ్బందితో మరుగుదొడ్లు నిర్మాణాలపై సమీక్షించారు. అన్ని గ్రామాలను ఓడిఎఫ్‌గా తీర్చి దిద్దే బాద్యతను అందరూ సంయుక్తంగా నిర్వహించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జనం వల్ల కలిగే అనర్ధాలను స్థానికులుకు వివరించి మరుగుదొడ్లు నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకొచ్చేలా చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో ఆర్.వెంకటరావు, పశువైద్యాధికారి జి.సురేష్, ఏపీవో సత్యన్నారాయణ, ప్రత్యేకాధికారులు, సిబ్బంది ఉన్నారు.

రోగులకు సాయిభక్తులు పండ్లు పంపిణీ
పలాస, నవంబర్ 20: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 93వ జన్మదిన వేడుకల్లో భాగంగా యువజనోత్సవాలు సందర్భంగా పలాస సత్యసాయిభక్తులు మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు, స్వామివారి ఫోటో, విభూది ప్రసాదం పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సాయిభక్తులు డాక్టర్ బాలకృష్ణ, మల్లా రామేశ్వరరావులు మాట్లాడుతూ సాయితత్వం అంటే ఇతరులపై దయాగుణం కలిగి ఉండడమేనని, మానవ సేవ మాధవసేవ అని అన్నారు. సాయి తన బోధనల్లో నిత్యం ఇతరులకు సహాయం చేయాలని సూచించేవారు అని, సేవ చేయడంలో సాయిభగవాన్‌కు ఎవ్వరూ సాటి లేరని, సాయిని స్పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఇతరులకు సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిభక్తులు శ్రీనివాసరావు, తాళాసు సూర్యప్రకాశ్, మల్లా శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ముస్లింమైనార్టీ మహిళలకు టీడీపీ అండ
పలాస, నవంబర్ 20: తెలుగుదేశం పార్టీ ముస్లింమైనార్టీ మహిళలకు అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషా అన్నారు. మంగళవారం 12వ వార్డులో ముస్లింమైనార్టీ మహిళలు కోసం ఏపి ఐటిసీవో ద్వారా కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లింమైనార్టీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టేందుకు సీ ఎం చంద్రబాబునాయుడు కార్యాచరణ సిద్దం చేసారన్నారు. శిక్షణ కేంద్రంలో మహిళలంతా కుట్టుమిషన్‌లను నేర్చుకొని స్వశక్తిపై నిలవాలని ఆకాంక్షించారు. ఈ కేంద్రంలో 37 మందికి శిక్షణ ఇస్తున్నామని, ప్రతి నెల 500 రూపాయలు స్ట్ఫైండ్ ఇస్తూ శిక్షణ పూర్తి చేసినవారికి ఉచితంగా కుట్టుమిషన్‌లను ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం 16వ వార్డుకు చెందిన ఎన్.జోగారావు మృతి చెందడంతో నామినీ భారతికి 30 వేల రూపాయలు, 20వ వార్డులో ఎస్.కామేశ్వరరావు మృతి చెందడంతో నామినీ రాజేశ్వరీకి 30 వేల రూపాయలు, 3వ వార్డుకు చెందిన ఎం. ఆనంద్ మృతి చెందడంతో నామినీ కుమారికి 2 లక్షల రూపాయలు విలువైన ప్రోసిడింగ్స్ పత్రాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ ఇడి మొహమ్మద్ సంసాదుద్దీన్, ఎపి ఐటి సీవో సీబి ఇ విజయ్‌సారధి, మున్సిపల్ వైస్ చైర్మన్ సూర్యనారాయణ, ఎ ఎంసి చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, పలాస ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు, 12వ వార్డు ఇన్‌చార్జి ఎంజి అబ్థులఖాన్ తదితరులు పాల్గొన్నారు.