శ్రీకాకుళం

కాలుష్య రహిత మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట,నవంబర్ 20: వాతావరణంలో కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు అవసరమైన విధంగా పాఠశాల ఆవరణలలో మొక్కలు నాటాలని ఉపాధి హామీ పథకం ఏపీడి లవరాజు సూచించారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణను మంగళవారం పరిశీలించిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ సాంద్రతతో కూడిన మొక్కలు నాటడం వలన పక్షులకు నివాసం కల్పించవచ్చని తెలిపారు. తన పరిథిలో సారవకోట ఉన్నత పాఠశాలను మొక్కలు నాటే కార్యక్రమానికి ఎంపిక చేశామని ఇందుకు ఉపాధి హమీ పథకం నుండి రూ.4.82 లక్షలను వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఫల, పుష్ఫ సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తిచేసే 5 అడుగులు ఎత్తుపెరిగే మొక్కలను మూడు వరుసలలో నాటాలని సంబంధిత అధికారులకు సూచించారు. రెండేళ్లవరకు ఈ మొక్కలను పెంచడానికి ప్రత్యేకంగా వేతన దారులను నియమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి ఈశ్వరరావు, ఉపాధి హామీ ఏపివో శశిభూషణరావు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, సమీకృత వసతిగృహం సమీక్షాధికారి చల్ల సత్యన్నారాయణ పాల్గొన్నారు.

బయోమెట్రిక్ విధానంపై సబ్సిడీ విత్తనాలు
సారవకోట, నవంబర్ 20: రబీ పంటగా వేయడానికి రైతులకు 50శాతం సబ్సిడీపై వివిధ రకాల విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు వ్యవసాయ శాఖాధికారి మురళీధర్ తెలిపారు. నాలుగు కిలోల పెసలు రూ.190, మినుమలు రూ. 200లు, రెండు కిలోల రాగులు ప్యాకెట్ రూ.60లకు రైతులుకు అందజేస్తున్నట్లు వివరించారు. మండలానికి 420 కిలోల మినుములు, 420కిలోల పెసలు, 120 కిలోల రాగులు జిల్లా అధికారులు విడుదల చేసారని ఆయన స్పష్టం చేశారు.

గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వండి
సారవకోట, నవంబర్ 20: మండలంలోని గిరిజనులకు 50 సంవత్సరాలకే సామాజిక భద్రతా పింఛన్ మంజూరు చేయాలని స్థానకి గిరిజన సంఘం నాయకులు చౌదరి లక్ష్మీనారాయణ, బెల్లుకోల దండాశి, జన్ని రామారావుతదితరులు డిమాండ్ చేశారు. సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిథిలో గల ఏడుమండలాల్లో నివసిస్తున్న గిరిజనులుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 50 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నారని, ఈ ఉత్తర్వులన సారవకోట మండలంలో గల గిరిజనులకు కూడా వర్తింపజే యాలని మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ గిరిజన సంఘం నాయకులు కోరారు. ఈమేరకు స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి వినతిపత్రం సమర్పించినట్లు వీరు తెలిపారు.

సనాతన హైందవ ధర్మరక్షణకు సత్పురుషులారా కదిలిరండి
* ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి
పొందూరు, నవంబర్ 20: సనాతన హైందవ ధర్మ రక్షణకు ఆధ్యాత్మిక హిందూ ధార్మిక సంస్థమేధావులు సత్పురుషులారా లేవండి ముందుకు రారండి, ధార్మిక సదస్సును విజయవంతం చేయండని ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షులు ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ధర్మ రక్షకులకు పిలుపునిచ్చారు. మండలం కృష్ణాపుర ఆనంద ఆశ్రమంలో మంగళవారం అఖిలాంధ్ర హిందూ మహా సమ్మేళన ధార్మిక సదస్సు పోస్టర్‌లను విడుదల చేసిన సందర్భంగా అమృత ప్రవచనం అందించారు. సమస్త వేదములకు పుట్టినిళ్లయిన భారతదేశం ప్రపంచానికే ఆధ్యాత్మిక బోధనలను అందించినది మన హిందూదేశమేనన్నారు. యోగిపుంగవులు, మహారుషులు తమ తపస్సు చేత పరిష్కరించబడిన మన సనాతన హైందవ ధర్మం ఎంతో ఉన్నతమైనదని అన్నారు. అంతటి మహోన్నతమైన సంస్కృతి సాంప్రదాయములకు వారసులమయిన మనం మానవీయ విలువలను పరిష్కరించుకోవడమే కాకుండా ఇంకా ఉద్దీపన గావించి మరింత శక్తివంతమైన సమైఖ్య సామరస్యత భావాలతో నిండిన హిందూ సమాజంను మన భవిష్యత్ తరాలకు అందించాలన్న దృక్పధంతో శ్రీకాకుళం జిల్లాలోని అతి పెద్ద ధార్మిక సదస్సు ఆదివారం ఉషోదయం నుండి సంద్యాసమయం వరకు ఆనందాశ్రమ 13వ వార్షికోత్సవం పురష్కరించుకొని అఖిలాంధ్ర హిందూ మహాసమ్మేళనమును విజయవంతం చేయాలని, అలాగే రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలనుండి కదలివచ్చిన పీఠాధిపతులు, స్వామీజీల ఆశీస్సులతో దర్శన భాగ్యం పొందాలని హిందువు బంధువులకు కోరారు. ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ ప్రతినిధి గారవెంకట రమణమూర్తిస్వామి, పివి ఎస్ రామ్మోహన్, డాక్టర్ పేడాడ సుజాత, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు