శ్రీకాకుళం

మొక్కలను ‘ఎండ’గట్టేసారు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: జిల్లాలో ఈ ఏడాది వనం-మనం కార్యక్రమం ద్వారా కోటి మొక్కలు నాటాలన్నదే ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారుల లక్ష్యం! అందుకు ఎక్కడపడిడే అక్కడ అటవీశాఖ ఆధ్వర్యంలో వనసమితుల్లో లక్షలాది మొక్కలు పెంపకం, నిర్వాహణ, వాటి సవంరక్షణ కోసం ప్రభుత్వం రూ. కోట్లాది నిధులు వెచ్చిస్తుండడం పరిపాటి. జిల్లాలో ఎం.జి.ఎస్.ఆర్.జి.జి.స్కీమ్‌లో 31.05 లక్షల మొక్కలతోపాటుగా అటవీశాఖ వివిధ పథకాల ద్వారా మరో 3.05 లక్షల మొక్కలను పెంచడమైంది. ఈ మొక్కల్లో ఇప్పటి వరకూ 32.80 లక్షలు రైతులకు, అడవుల అభివృద్ధికి వినియోగించినట్టు ఆ శాఖ డివిజన్ అటవీశాఖాధికారి శాంతిస్వరూప్ ఇటీవలే జరిగిన జెడ్పీ సర్వసభ్యసమావేశానికి వివరాలు తెలిపారు. అయితే, గణాంకాలు కాగితాలమీద అచ్చుగుద్దించి ఉన్నతాధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇచ్చినంత సులభతరమైంది మొక్కల సంవరక్షణ కాదన్నది ముమ్మాటికి నిజం. అందుకే, ఆయన వివరించిన గణాంకాలతో పోలిస్తే లక్షలాది మొక్కలు మాడిపోయి, జీవం కోల్పోయి ఎండిపోయాయి. అందుకు నిదర్శనమే శ్రీకాకుళం శివారులో సిద్ధిపేటవద్ద ఏపీ అటవీశాఖ కేంద్రీయ నర్సరీ. అందులో 12000 మొక్కలు ఎండిపోయాయి. తగిన నిర్వాహణ, పర్యవేక్షణాలోపాలతో మొక్కలను అక్కడ నిర్వాహకులు మాడ్చేసి, రాత్రికిరాత్రి ట్రాక్టర్లతో తరలించి కాల్చేస్తున్నారు. కానీ, ఆ మొక్కలన్నీటికీ నిర్వాహణ, సంవరక్షణ వ్యయం మాత్రం రికార్డుల ప్రకారం అటవీశాఖ సిబ్బంది బుక్కేస్తున్నారన్నది ఆలస్యంగా నర్సరీ చుట్టుపక్కల ఉన్న రైతులు ‘ఆంధ్రభూమి’ దృష్టికి తీసుకువచ్చారు. శ్రీకాకుళం జిల్లా వనం-మనం కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఎన్నో ప్రసంశలు, బహుమతులు అందుకున్న అటవీశాఖ అధికారుల్లో కొంతమంది ఇటువంటి తప్పిదాలు చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పెంచే మొక్కలు కొరత ఏర్పడుతోంది. ఈ ఏడాది వర్షాకాలంలో సామాజిక అటవీశాఖ ద్వారా మొక్కలు పంపిణీ చేసేందుకు నర్సరీలలో మొక్కలు పెంపకం చేపట్టిన ప్రభుత్వం ఇళ్ళల్లో మొక్కలు పెంచుకునేందుకు ఉపయోగపడే మొక్కలతోపాటుగా, రైతులు పొలం గట్టలపైన, జాతీయ రహదారులపపై పెంచుకునేందుకు ఉపయోగపడే మొక్కలు సిద్ధిపేట కేంద్ర నర్సరీలో ఉన్నాయి. ఎతె్తైన మొక్కల్లో రావి, మర్రి తెల్లమద్ది, వేప కానుగ, నేరెడు, బాదం, తురాయి మొక్కలు ఉన్నాయి. ఇళ్లల్లో పెంచుకునే వాటిలో తులసి, వాము, బచ్చలి, కరివేపాకు, సీతాఫల్, దానిమ్మ, జామి, సువర్ణగనే్నరు, గోరింట రకకాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ జీయోట్రాకింగ్‌లో మొదటి వరుసలో గల డివిజన్ అటవీశాఖ అధికారులు సిద్ధిపేట వద్ద ఏర్పాటు చేసిన వనమిత్ర ద్వారా మొక్కల పెంపకం ఆవశ్యకత, తదితర వాటిపై ప్రజల్లో అవగాహన కలిగించేవిధంగా పనిచేస్తున్నప్పటికీ, అడ్డదారిలో మొక్కల సంవరక్షణ నిధులు మింగేసేలా మొక్కలను మాడ్చేస్తున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. దీనిపై ప్రత్యేకంగా కలెక్టర్ దృష్టిసారిస్తేగానీ, సిద్ధిపేట కేంద్రీయ నర్సరీలో మొక్కలు మొలకెత్తేందుకు ఆస్కారం లేకపోవచ్చు!!
చంద్రన్న సరుకులును పరిశీలించిన ఏపీఎస్సీఎస్సీ ఏజిఎమ్
జలుమూరు, డిసెంబర్ 6: గ్రామీణ నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకుల కింద విడుదల చేసిన వివిధ రకాల సరుకులను ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరా సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వి ఎస్ సత్యన్నారాయణ గురువారం పరిశీలించారు. జలుమూరు నిత్యావసర సరుకుల గిడ్డంగిలో ఉన్న వివిధ రకాల సరుకుల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. నాణ్యతపై ఎటువంటి లోపాలున్నా చట్టపరంగా చర్యలుంటాయని ఆయన అన్నారు. సరుకులు విడుదల చేసిన ఏజెంట్లపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వస్తువులను తూకం వేసి కచ్చితంగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో విడుదల చేసిన సరుకులను సకాలంలో సక్రమంగా వినియోగదారులకు అందేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఆయనతోపాటు గౌడౌన్ ఇంఛార్జ్ మురళి పాల్గొన్నారు. అనంతరం ఆ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.

కొమనాపల్లి గ్రామదర్శిని రసాబస
జలుమూరు, డిసెంబర్ 6: మండలం కొమనాపల్లి గ్రామంలో గురువారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమం రసాబసగా మారింది. గ్రామీణ ప్రాంత సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు అక్కడకు వెళ్లిన గ్రామదర్శిని అధికారుల బృందానికి స్థానికులు తిత్లీ తుఫాన్‌పై అన్యాయం జరిగిందని సభావేదిక ముందు ఆందోళన చెందారు. తుఫాన్ నష్టపరిహారం పంపిణీలో రాజకీయాలు చోటుచేసుకున్నాయని వైసీపీ నేత, గ్రామ మాజీ సర్పంచ్ కలుసు సీతారాం వర్గీయులు అధికారులకు నిలదీయగా స్థానిక ఎంపీటీసీ ప్రతినిథి సాధు ఉమారావు వర్గీయుల మద్య చిన్నపాటి ఘర్షణ మొదలు కావడంతో అధికారులు సమాధానం చెప్పాలనుకున్నా సమావేశాన్ని అర్ధాంతంగా ముగించారు. ఏది ఏమైనా గ్రామదర్శిని సమావేశంలో పూర్తిస్థాయి సమాచారంతో అధికారులు హాజరైతే బావుంటుందని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
గ్రామదర్శినిని సద్వినియోగం చేసుకొండి:
* మండల ప్రత్యేకాధికారి సాయిరాం
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన గ్రామదర్శిని కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి ఎమ్.సాయిరాం అన్నారు. మండలం అత్యుతాపురం గ్రామంలో గురువారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకున్న సమస్యలు నేరుగా తెలియజేయాలని, సమస్యలు పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం అని అన్నారు. ఈ సమావేశంలో తహశీల్దార్ కె.ప్రవళ్లిక ప్రియ, పంచాయతీ విస్తరణాధికారి కొమరాపు అప్పలనాయుడు, మండల విద్యాశాఖాధికారి బమ్మిడి మాధవరావు, అత్యుతాపురం పశువైద్యాధికారిణి లీలారాణి, జేఈలు నాగభూషణ,సత్యన్నారాయణ , ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.
పింఛన్‌లందించి బాధలను తీర్చండి
జలుమూరు, డిసెంబర్ 6: ప్రతీనెల రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వృద్ధులకందిస్తున్న పింఛన్ పథకం పనితీరును మార్చి మా బాధలను తీర్చండని మండలం చల్లవానిపేట గ్రామానికి చెందిన దీర్ఘాశి దుర్గమ్మ, బైరి రామారావు, బుచ్చిన తవిటమ్మ పలువురు ఆందోళన చెందారు. మమ్మల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతీనెల 1వ తారీఖున అందజేస్తున్న పింఛన్ తమకు అందక అనేక ఇక్కట్లు పడుతున్నామని అన్నారు. గతంలో వేలిముద్ర, గుర్తింపు కార్డుతో పింఛన్ అందేదని, నేడు బయోమెట్రిక్ విధానం అమలు చేయడంతో వేలిముద్రలు పడక రోజూ కార్యాలయం చుట్టూ పనులు మాని నడవలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామని వారన్నారు. రెండుమూడు నెలలు వేలిముద్ర పడని వారికి సంబంధిత అధికారి నేరుగా అందించి మా బాధలను తీర్చండని వారన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టిసారించి వృద్ధులకు సహకరించాలని కోరారు.
ఆదిత్యుని దర్శించుకున్న సినీ సంగీత దర్శకుడు కోటి
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 6: ప్రత్యక్షనారాయణుడు శ్రీ సూర్యనారాయణ స్వామిని గురువారం ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరు కోటి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనివెట్టి మండపంలో స్వామి వారి శేష వస్త్రాన్ని, చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశి ఆశీర్వచనాలు పలికారు. సూర్యనమస్కారాల ప్రాధాన్యతను ఆలయ విశిష్టతను కోటి దంపతులకు వివరించారు. ఈయన వెంట భారతి రమేష్ తదితరులున్నారు.

బీజేపీని ఆదరించండి
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 6: భారతీయ జనతాపార్టీని ఆదరించి అభివృద్ధికి తోడ్పడాలని బీజేపి శ్రీకాకుళం నియోజకవర్గం కన్వీనర్ చల్లా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని రిమ్స్ ఆసుపత్రిలో కాంటాక్ట్ వర్కర్లను కలిసి ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా బీజేపీని అడ్డుకుంటుంది, కేంద్ర నిధులను జన్మభూమి కమిటీలు ఏ విధంగా దోచుకుంటున్నదీ, కేంద్రం ఇస్తున్న ఇళ్లను ఏ విధంగా టీడీపీ కార్యకర్తలకు ఇస్తున్నదీ వివరించారు. కేంద్ర సంక్షేమ పథకాలకు చంద్రన్న పేరు పెట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తుందని వివరించారు. వారంతా మోదీపై సానుకూల దృక్పధంతో ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎంబిజి నాయుడు, గొద్దు భాగ్యలక్ష్మి, బత్తుల పవన్‌సాయి, ఎస్‌వి రమణమూర్తి, చింతపల్లి దుర్గారావు గాంధి, పండి యోగీశ్వరరావు, మజ్జి వెంకటరావు, అల్లు మల్లేశ్వరరావు, సురేష్‌సింగ్, సోషల్‌మీడియా కీర్తి శాంతారావు, ఎస్సీ మోర్ఛా రుప్ప రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాయకులందరూ అంబేద్కర్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.