శ్రీకాకుళం

వృత్తి నైపుణ్యతలో రానించేవారికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, డిసెంబర్ 10: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచే విధంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణాతరగతులను ఏర్పాటుచేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక పద్మావతి డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన శిక్షణా తరగతులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువనేస్తం ద్వారా ఇప్పటికే నిరుద్యోగ భృతిని ప్రభుత్వం కల్పిస్తుందని దీని ద్వారా పోటీ పరీక్షలకు తల్లిదండ్రులపై ఆధారపడకుండా పరీక్షలో పాల్గొనే విధంగా కృషిచేస్తుందని స్పష్టం చేశారు. ఉత్తీర్ణత సాధించిన పట్ట్భద్రులకు ప్రభుత్వం తరుపునే కాకుండా అనేక పరిశ్రమల ద్వారా ఉద్యోగాలను అందించే విధంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజర్ గోవిందరావు, జెడ్పీటీసీ శకుంతల, ఎంపీడీవో విద్యాసాగర్, రాష్ట్ర పరిశీలకులు సంజయ్‌కుమార్, శిక్షకులు అర్చన తదితరులు పాల్గొన్నారు.
యుటి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా గొంటి గిరిధర్ ఐదోసారి ఎన్నిక
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 10: యుటి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా గొంటి గిరిధర్ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విజయవాడలో జరిగాయి. రాష్ట్ర కార్యదర్శిగా గొంటి గిరిధర్ ఐదోసారి ఎన్నికయ్యారు. అలాగే శ్రీకాకుళం జిల్లాక సంబంధించి సంపతిరావు కిషోర్‌కుమార్ మళ్లీ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. జిల్లానుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రెడ్డి మోహనరావు, పొందూరు అప్పారావు, చౌదరి రవీంద్ర, ఎమ్.వాగ్ధేవి, పి.్ధర్మారావు, దండు ప్రకాశరావులు ఎన్నికయ్యారు. కౌన్సిల్ సమావేశంలో సిపి ఎస్ రద్దు, 34 శాతం ఐ ఆర్, 68 శాతం ఫిట్‌మెంట్‌తో పి ఆర్‌సి, ఉపాధ్యాయుల సర్వీస్ రూల్, అన్ని క్యాడర్ల ప్రమోషన్లు, స్పెషల్ టీచర్స్ నోషనల్ ఇంక్రిమెంట్లు, ట్రైబల్ వెల్ఫేర్ టీచర్లకు డ్రాయింగ్ పవర్స్ పునరుద్ధరణ, మున్సిపల్ టీచర్ల బదిలీలు, పి. ఎఫ్ ఖాతాల నిర్వహణ, 22వేలు పోస్టులకు డి ఎస్సీ నియామకాలు, అంతర్జిల్లా బదిలీలు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు, బోధనేతర కార్యక్రమాలు రద్దు, పాఠశాలలకు వౌళిక సదుపాయాలు కల్పన, మెడికల్ రీ ఎంబర్స్‌మెంట్ సమస్యల పరిష్కారం, మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వమే నిర్వహణ, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పోస్టుల అప్‌గ్రేడేషన్ తదితర సమస్యలు పరిష్కరించాలని తీర్మానాలు చేసినట్లు గిరిధర్ తెలిపారు. 2019 జనవరి మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను చేపడతామని తెలిపారు.
నీలం జ్యూట్ మిల్లు వద్ద కార్మికులు నిరసన
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 10: మండలంలోని సింగుపురం సమీపంలో ఉన్న నీలం జ్యూట్‌మిల్లు అక్రమ లాక్ అవుట్‌లను నిరసిస్తూ సోమవారం సి ఐటియు, ఐ ఎఫ్‌టియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. ఎటువంటి ముందస్థు నోటీస్ లేకుండా జ్యూట్ మిల్లు అక్రమ లాక్ అవుట్‌ను ప్రకటించడం అన్యాయమన్నారు. అక్రమ లాక్ అవుట్‌తో సుమారు 900 మంది కార్మికులు రోడ్డున పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. అక్రమ లాక్ అవుట్‌లను ఎత్తివేసి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘ నాయకులు నేతింటి నీలం రాజు తదితరులు పాల్గొన్నారు.