శ్రీకాకుళం

శిక్షణ తరగతుల్లో సోంపేట నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోంపేట, డిసెంబర్ 11: విజయనగరంలో రెండు రోజులుగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతుల్లో సోంపేటకు చెందిన ఎంపీపీ శ్రీనివాసరావు, జడ్‌పీటీసీ చంద్రమోహన్‌లతోపాటు మండలానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సంబంధించి విజయనగరం ఎమ్మెల్యే గీత ఆధ్వర్యంలో వారికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ భవనాలు మంజూరు
మెళియాపుట్టి, డిసెంబర్ 11: మండలంలో గొప్పిలి, సంతలక్ష్మిపురం, గంగరాజపురం,జోడూరు, వసుంధర గ్రామాలకు అంగన్‌వాడీ భవనాలు మంజూరు చేసినట్లు మండల టీడీపీ అధ్యక్షుడు ఎ.రాజశేఖరరెడ్డి మంగళవారం విలేఖరులకు తెలిపారు. రట్టిణి, మహేంద్రతనయ నది వద్ద 7 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు.

ఓటు వేసి రుణం తీర్చుకొండి: మంత్రి అచ్చెన్న
కోటబొమ్మాళి, డిసెంబర్ 11: అభివృద్ధిచేసిన నాయకులకు ఓటు వేసి తమ రుణాన్ని తీర్చుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని జాతీయరహదారి నుంచి సరియాబొడ్డపాడుకు 90 లక్షల రూపాయలతో, శ్రీజగన్నాథపురంకు 75 లక్షల రూపాయలతో తారురోడ్లు, బడ్డిపేటలో 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేసారు. శ్రీజగన్నాథపురంలో 13 లక్షల రూపాయలతో నిర్మించిన పంచాయతీ భవనానికి మంత్రి ప్రారంభించారు. సరియాబొడ్డపాడులో గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొని అనంతరం జరిగిన బహిరంగసభలో మంత్రి మాట్లాడుతూ వంశధార నదితో బహుదానదికి అనుసంధానం చేసి ఇచ్ఛాపురంకు వంశధార నీరు అందించడానికి 6500 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయన్నారు. గత 45 ఏళ్లు నుంచి తమకు గాని, తమ పార్టీకి గాని ఓటు వేయని గ్రామాలకు రహదారులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపించానని ప్రజలు గుర్తించి ఈ సారినైనా ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్‌కు 100 శాతం అనుకూలంగా ఉన్న పలు గ్రామాల్లో గత పదేళ్లు కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి కూడ ఖర్చు పెట్టలేని స్థితిని ప్రజలు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామకృష్ణ, ఎ ఎంసి చైర్మన్ విజయలక్ష్మి, జడ్‌పీటీసీ పద్మశ్రీనివాస్, మాజీ ఎ ఎంసి చైర్మన్ లక్ష్మణరెడ్డి, నాగయ్యరెడ్డి, ఆనందరావుపాల్గొన్నారు.
దేశవ్యాప్తసమ్మెను విజయవంతం చేద్దాం
కోటబొమ్మాళి, డిసెంబర్ 11: అంగన్‌వాడీ,కార్మిక, ప్రజాసంఘాల పిలుపు మేరకు జనవరి 8,9వ తేదిల్లో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీ ఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.సురేషుబాబు అన్నారు. మంగళవారం ఊడికలపాడుతోటలో వనభోజన సందర్భంగా అంగన్‌వాడీ, రైస్‌మిల్లుల కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యలపై సంఘటితం కావాలని, ఐకమత్యంతోనే ఏదైనా విజయం సాధ్యమవుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ పోరాటాల్లో పాల్గొన్నాలన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలను తరిమికొట్టేందుకు జరుగుతున్న ఈ సమ్మెకు ప్రతి కార్మికుడు పాల్గొన్నాలన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి సీ ఐటియు డివిజన్ కార్యదర్శి షణ్ముఖరావు, సీ ఐటియు నాయకులు సుధ, నీలన్న, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నం అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తాం
కొత్తూరు, డిసెంబర్ 11: పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని టీడీపీ నాయకులు మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం మండలంలోని కృష్ణాపురం నిర్వాసిత పునరావాస కేంద్రంలోని ఓ శుభకార్యానికి ఎమ్మెల్యే కలమట వెంకటరమణతో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, గోవిందరావు విలేఖర్లతో మాట్లాడుతూ టీడీపీ నాయకుల్లో ఎటువంటి విభేదాలు లేవన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో మళ్లీ తెలుగుదేశం జెండా ఎగురవేసేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణా ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీ ఆర్ ప్రభుత్వం అక్కడ ప్రజలకు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని విజయం అందించారన్నారు. మహాకూటమిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో కలిసిందన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీయేతర పక్షాల గెలుపునకు ఇది తొలిమెట్టు అన్నారు. మన రాష్ట్రంపై టీ ఆర్ ఎస్ ఫలితాలు ప్రభావం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అగతముడి బైరాగినాయుడు, జెడ్పీటీసీ ప్రతినిధి పాలక రవి, పలువురు టీడీపీ నాయకులున్నారు.

జయహో బీసీ పోస్టర్ ఆవిష్కరణ
కొత్తూరు, డిసెంబర్ 11: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాతపట్నం నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 22న, రాష్టస్థ్రాయిలో ఈ నెల 30న రాజమండ్రిలో జరగనున్న జయహో బీసీ పోస్టర్‌ను ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మంగళవారం ఆవిష్కరించారు. మాతలలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. బీసీల అభ్యున్నతి కోసం టీడీపీ కట్టుబడి ఉందన్నారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో 22న కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరభద్రరావు, అగతముడి బైరాగినాయుడు, బర్రి గోవిందరావు తదితరులున్నారు.
132 జీవోను రద్దు చేయాలని డిమాండ్
కొత్తూరు, డిసెంబర్ 11: ఐటీడీ ఏ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న 132 జీవోను తక్షణమే రద్దు చేయాలని యూటీ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పొందూరు అప్పారావు డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని మెట్టూరు బిట్-1 గ్రామంలో యూటీ ఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ ఐటీడీ ఏ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారి అధికారాలను కుదించే విధంగా ఉన్న ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు జీతాలు కూడా ఈ జీవోతో ముడిపడి ఉండడంతో సక్రమంగా అందడం లేదన్నారు. జీవో 73,74ను రద్దు చేసి మధ్యంతర భృతిని అమలు చేయాలన్నారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని, ఐ ఆర్‌ను 34 శాతం ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉమాశంకర్, మండల యూటీ ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.శ్రీనివాసరావు, బర్రి పురుషోత్తం, గౌరునాయుడు తదితరులున్నారు.
* ప్రకాశరావు ఎంపిక పట్ల హర్షం
యూటీ ఎఫ్ జిల్లా కార్యదర్శిగా దండు ప్రకాశరావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల యూటీ ఎఫ్ నాయకులు హర్షం ప్రకటించారు. ఈ నెల 8,9 తేదీల్లో యూటీ ఎఫ్ రాష్టస్థ్రాయి కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో ఏకగ్రీవంగా ప్రకాశరావును ఆమోదించడం పట్ల ఉపాధ్యాయ సంఘ నాయకులు గౌరునాయుడు, మాధవరావు తదితరులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.
ఎం ఎల్ ఎఫ్ గొడౌన్ హమాలీలు నిరసన
కొత్తూరు, డిసెంబర్ 11: కొత్తూరు, భామిని మండలాలకు చెందిన స్థానిక ఎం ఎల్ ఎఫ్ గొడౌన్ హమాలీలు మంగళవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. హమాలీల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీమన్నారాయణ, గోవిందరావుల ధ్వర్యంలో స్థానిక గొడౌన్ హమాలీలు కృష్ణారావు, ఢిల్లేశ్వరరావు తదితరులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ ఎస్ ఐ సౌకర్యాలు కల్పించాలని, పీ ఎఫ్ ద్వారా పింఛను ఇప్పించాలని డిమాండ్ చేశారు. సొంత గొడౌన్లను నిర్మించాలని కోరారు. హమాలీలుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీల సంఘ నాయకులు శ్రీను తదితరులున్నారు.
పాలిథిన్ కవర్లు కటింగ్ యంత్రం మంజూరు
వీరఘట్టం, డిసెంబర్ 11: మండల కేంద్రంలో ఉన్న ఘన వ్యర్థాల సంపద తయారీ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంగళవారం పాలిథిన్ కవర్ల కటింగ్ యంత్రాన్ని మంజూరు చేసినట్టు టీడీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు జామి లక్ష్మీనారాయణ తెలిపారు. గతంలో ప్రభుత్వం నుంచి ఈ కేంద్రానికి ప్లాస్టిక్ కటింగ్ యంత్రాన్ని మంజూరైందన్నారు. ఈ యంత్రంతో పాలిథిన్ కవర్లు నిషేధానికి అవకాశం ఉంటుందన్నారు. పారిశుద్ధ్యం మెరుగుపడడానికి వీలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో ఐ.విశ్వనాధం, సీనియర్ అసిస్టెంట్ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

రోడ్లు విస్తరణకు రూ.2.90 లక్షలు మంజూరు
రాజాం, డిసెంబర్ 11: రాజాం రహదారుల విస్తరణకు సంబంధించి ప్రభుత్వం రూ.2.90 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్ వెల్లడించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయగా, ఆ నిధులతో కొన్ని పనులు చేపట్టారని, ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో బొబ్బిలి జంక్షన్ నుంచి కొత్త పెట్రోల్ బంకు వరకు పనులు చేపడతారన్నారు. నిధులు మంజూరుపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

పశుసంపద సంరక్షణ అందరి బాధ్యత
సరుబుజ్జిలి, డిసెంబర్ 11: పాడిపరిశ్రమను అభివృద్ధి చేయడం, పశుసంపదను సంరక్షించడం మనందరి బాధ్యత అని సరుబుజ్జిలి మండల ప్రత్యేకాధికారి, పశుసంవర్ధకశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ దామోదరరావు పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సరుబుజ్జిలి ఎన్ ఎస్ ఎస్ విభాగం ప్రత్యేక సేవా శిబిరం మంగళవారం నాటికి ఐదో రోజు జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో దామోదరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక రాయితీలను వినియోగించుకోవాలన్నరు. ఎన్ ఎస్ ఎస్ పీవో దుగ్గివలస రాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈవో పీ ఆర్‌డీ ఎం.విజయభాస్కర్, ఎన్ ఎస్ ఎస్ వలంటీర్లు, గ్రామస్తులు, పశువైద్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు పశువైద్య సమస్యలు, నివారణా మార్గాలను ప్రదర్శన చేసి చూపించారు.

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
పాలకొండ, డిసెంబర్ 11: ఆర్టీసీ నష్టాలకు కారణం కార్మికులు కాదని, యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి బి.కె.మూర్తి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట భోజన విరామ సమయంలో ఈయూ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం కార్మికులపై పనిభారం పెంచుతూ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందన్నారు. బస్సులు మెంటినెస్స్ లేక ప్రమాదాలకు గురవుతున్నాయని తెలిపారు. పల్లెవెలుగు బస్సులను తగ్గిస్తూ జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి పాలకొండ నుంచి ఒక్క పల్లె వెలుగు బస్సు కూడా లేకపోవడం సిగ్గు చేటని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ స్పందించడం లేదన్నారు. యజమాన్యం ఇప్పటికీ స్పందించకపోతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికులంతా సమ్మెకు సిద్దం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి దుమ్మెద దుర్గారావు, ఎం.వి. ఎస్.నారాయణ, ఎం.డి. అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా కార్యదర్శి
పాలకొండ (టౌన్), డిసెంబర్ 11: నగర పంచాయతీ పరిధిలోని శాఖా గ్రంథాలయాన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి జి.తిరుమలకుమారి మంగళవారం సందర్శించారు. నిర్వహణకు సంబంధించి రికార్డులు తనిఖీ చేశారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ నగర పంచాయతీ అధికారులకు తెలియజేయాలని స్థానిక గ్రంథాలయాధికారి బబ్బురు గణేష్‌కుమార్‌ను సూచించారు. డీ ఎస్సీకి అవసరమైన పుస్తకాలను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని పాఠకులకు సూచించారు. ఆమెతో పాటు ఎస్.వి.రమణమూర్తి, ఈశ్వర్‌లున్నారు.

క్యాంపస్ ఇంటర్వ్యూలకు స్థానిక విద్యార్థులు ఎంపిక
పాలకొండ (టౌన్), డిసెంబర్ 11: టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం విప్రో కంపెనీ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో స్థానిక విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. తమ్మినాయుడు డిగ్రీ కళాశాలకు చెందిన ఎ.దేవయాని, ఎస్.పవన్, ఎస్.రామ్మోహన్, జి.ప్రవీణ్‌లను సంస్థ ఎంపిక చేసింది. 500 పైగా విద్యార్థులు ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొనగా 60 మందిని మాత్రమే ఎంపిక చేశారని, వీరిలో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటడం సంతోషకరమైన విషయమని కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతిరావు అన్నారు.

డిమాండ్ల సాధనకు హమాలీల ఆందోళన
ఇచ్ఛాపురం, డిసెంబర్ 12 : తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ స్థానిక పౌర సరఫరాల సంస్థకు పనిచేస్తున్న హమాలీలు కోరారు. ఈ మేరకు అమిన్‌సాహెబ్‌పేటలోని మండల పౌరసరఫరాల గోదాము ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని, సొంత గోదాములు నిర్మించాలని, పనభద్రతకు హామీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. తమను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
బీజేపీతోనే ప్రగతి సాధ్యం: కణితి
పలాస, డిసెంబర్ 11: బీజేపీతోనే ప్రగతి సాధ్యమని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు, శ్రీకాకుళం పార్లమెంటరీ బీజేపీ కన్వీనర్ డాక్టర్ కణితి విశ్వనాధం అన్నారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా పలాస మున్సిపాలిటీలో 21వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటూ ఆ పథకాల్లో టీడీపీ కార్యకర్తలు దోచుకుంటున్నారని, తద్వారా ప్రగతి కుంటుపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకోవడమేకాకుండా ఆ పథకాలను నిర్వీర్యం చేస్తూ ప్రగతిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలు కోసం భారతదేశ అభివృద్ధి కోసం సుమారు 151 పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధిని చేస్తూ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా గుర్తింపు తీసుకురావడంలో సఫలీకృతమైనారన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుందని, రానున్న ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పలాస బీజేపీ ఇన్‌ఛార్జి కొర్రాయి బాలకృష్ణ, పలాస పట్టణ బీజేపీ అధ్యక్షుడు పాలవలస వైకుంఠరావు, బీజేపీ నాయకులు వాసుదేవరావు, కె.్భస్కరరావు, తాళాసు తిరుమల, మల్లా భార్గవ్, టి.మాధవరావు, ఎవికె దీనబందు, కె.పడమన్న, సీరపు జోగారావు, అట్టాడ మాధవరావు, లోకనాధం, ఎం.జోగరావు, పి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
డీలర్లుకు వేతనాలు చెల్లించాలి
మందస, డిసెంబర్ 11: డీలర్లు సమస్యలను పరిష్కారించి గ్రామీణ ప్రాంతాల్లోని డీలర్లుకు 20 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లోని డీలర్లుకు 24 వేల రూపాయలు గౌరవ వేతనాలు చెల్లించాలని డీలర్లు సంఘం అధ్యక్ష,కార్యదర్శులు వై ఎస్ ఎన్‌మూర్తి, లక్ష్మణరావులతోపాటు డీలర్లు మంగళవారం తహసీల్థార్ పివి శ్యామసుందరరావు వినతిపత్రం అందించారు. డీలర్లును కారుణ్యనియమాకాలు చేపట్టాలని, గ్రూపు ఇన్సూరెన్స్ కల్పించాలని, 61 కేసులను రద్దు చేయాలని, కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న కమిషన్ విధానాన్ని ఏపీలోని డీలర్లుకు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు వాసు, శంకరరావు, హైమవతి, ఎస్.చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.
జనసేనకు జనం అండ
మందస, డిసెంబర్ 11: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ప్రజలు ఆదరాభిమానాలు చూపుతున్నారని, ప్రజాసమస్యలపై ప్రశ్నించడం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిలదీయడం మ్యానిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను గుర్తించిన విధంగా ప్రచురించిన కరపత్రాలను మంగళవారం పలాస మున్సిపల్ చైర్మన్, జనసేన నాయకులు కోత పూర్ణచంద్రరావు పంపిణీ చేసారు. మండలంలో రంగనాధపురం, బాలిగాం గ్రామాల్లో జనసేన తరంగ్ కార్యక్రమాలను నిర్వహించి, పవన్‌కల్యాణ్ సిద్థాంతాలను, ప్రజాపోరాటాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ప్రజలు ఆదరించాలని కోరారు. తిత్లీ తుపాన్ ప్రభావంతో సర్వం కోల్పోయిన బాధితులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకొని నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బి.శ్రీనివాసరావు, సవర సుమన్, బి.సంతోష్, ఎం. ఆశ, సునీల్, కె.కృష్ణారావు, తేజ తదితరులు పాల్గొన్నారు.
చక్కెర పరిశ్రమను బాబే మూయించేశారు
* వైసీపీ అధినేత జగన్ ఆరోపణ
ఆమదాలవలస, డిసెంబర్ 11: ఇక్కడి సహకార చక్కెర పరిశ్రమను ముఖ్యమంత్రి చంద్రబాబే మూసివేయించారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ నేతలు అన్యాయమైన రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు నిరుద్యోగ భృతి, పక్కా ఇళ్లు, అన్న క్యాంటీన్లు వంటివి మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా అవీ అరకొరగానే ఉన్నాయన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే సహకార డెయిరీలు, చక్కెర కర్మాగారాలు తెరిపిస్తామని, సీపీఎస్ రద్దుచేస్తామని, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. నవరత్నాల్లో భాగంగా రైతులకు ప్రతీ మే నెలలో రూ. 12,500లు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ విప్ కూనరవికుమార్ ఇసుకమాఫియా, దందాలకు పాల్పడుతున్నారని, వెనె్నలవలసలో కోట్లు విలువైన భూమిని కబ్జా చేశారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కోసం సహకార రంగంలో ఉన్న పాలకేంద్రాలన్నీ మూతపడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్, రెడ్డిశాంతి , తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్, సువ్వారు గాంధి, బొడ్డేపల్లి నారాయణరావు పాల్గొన్నారు.

చెత్తసంపద కేంద్రాలను పరిశీలించిన డి ఎల్‌పీవో
నందిగాం, డిసెంబర్ 11: మండలంలోని నందిగాం, కాపుతెంబూరు,చిన్నలవునిపల్లి, నరేంద్రపురం గ్రామాల్లో గల చెత్తసంపద కేంద్రాలను డివిజనల్ పంచాయతీ అధికారి కోటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తుపాన్‌కు పాడైన కేంద్రాలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ద్య పనులను చేపట్టి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. చెత్తసంపద కేంద్రాలు ద్వారా పారిశుద్ద్యాన్ని పెంపొందించుకోవచ్చునన్నారు. ఈయనతోపాటు ఎంపీడీవో రాంబాబు, ఇవోపి ఆర్‌డి రాజారావు తదితరులున్నారు.
మూడు తరగతి గదులు..137 మంది విద్యార్థులు
* లుకలాం ఉన్నత పాఠశాల దుస్థితి
నరసన్నపేట, డిసెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఎన్నో ప్రణాళికలు చేపడుతున్నప్పటికి దానికి విరుద్ధంగా మండంలోని లుకలాం ఉన్నత పాఠశాల పరిస్థితి భిన్నంగా దర్శనమిస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఎన్నో ఏళ్ల క్రిందట స్థానిక పంచాయతీలో ఉన్నత పాఠశాలలను ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇటీవల కాలంలో ఆనాడు నిర్మించిన తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో బిక్కు బిక్కు మంటూ విద్యార్థులు విద్యాభ్యాసాన్ని కొనసాగించేవారు. దీని స్థానంలో అదనంగా మరో మూడు తరగతి భవనాలను నిర్మించిన ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభోత్సవాన్ని చేపట్టాయి. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియని అగమ్య గోచరంలో నూతనంగా నిర్మించిన మూడు గదుల భవనాల్లోనే ఉన్నత పాఠశాలలను కొనసాగిస్తున్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు సుమారు 137 విద్యార్థులు ఉండగా ఉన్న మూడు గదుల్లోనే సర్దుకు పోవల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అదనపు తరగతి గదులను నిర్మించాలని ముక్త కంఠంతో కోరుకున్నారు.

సంక్షేమ పథకాలే తెరాసాను గెలిపించాయి
* ఇదే పరిస్థితి రాష్ట్రంలో పునరావృతమవుతుంది * ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, డిసెంబర్ 11: దేశంలోని తెలుగు రాష్టమ్రైన తెలంగాణలో అక్కడ రాష్ట్ర తెలంగాణ సమితి అమలు చేసిన సంక్షేమ పథకాల వలనే నేడు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాయని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విశే్లషించారు. మంగళవారం మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలోమాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో టీడీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వలనే విజయం సాధిస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒక విధంగా తెలంగాణలో ఓడి గెలిచామని, తమ లక్ష్యం బీజేపి ఓటమి చెందాలని, మహాకూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేరారని వివరించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై బీజేపిని ఓడించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీతో కలవడం జరిగిందని వివరించారు. తెలంగాణలో అమలు చేసిన పథకాల కన్నా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

రూ. 3లక్షలు విలువ చేసే ధాన్యం కుప్పలు దగ్ధం
నరసన్నపేట, డిసెంబర్ 11: మండలంలోని చింతువానిపేట గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.3లక్షలు విలువ చేసే ధాన్యం కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు తాడేల కృష్ణారావుకు చెందిన ధాన్యం కుప్పలు అగ్నికి ఆహుతవ్వడం బాధాకరమని తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సుమారు ఐదు ఎకరాల్లో పండిన ధాన్యాన్ని కుప్పలుగా పెట్టుకున్నారని, వాటిని త్వరలోనే నూర్పు చేపట్టే దిశగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరంగి మురళీధర్, సహకార సంస్థ అధ్యక్షుడు సురంగి నర్శింగరావు, మాజీ జెడ్పీటీసి సి.హెచ్ రామారావు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి వేతనాలు అందడం లేదంటూ ఆందోళన
నరసన్నపేట, డిసెంబర్ 11: మండలంలోని అంబాజీపేట గ్రామానికి చెందిన ఉపాధి వేతన దారులకు వేతనాలు అందడం లేదంటూ ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. మంగళవారం కార్యాలయాన్ని చేరుకున్న వేతనదారులు మాట్లాడుతూ గత నాలుగు వారాలుగా తాము ఉపాధి పనులు చేపడుతున్నప్పటికి నేటి వరకు తమ ఖాతాలలో వేతనాలు వెయ్యలేదంటూ ఆరోపించారు. ప్రతీ రోజు ఎంతో కష్టపడినప్పటికి వేతనాలు రాక రోడ్డున పడ్డామంటూ వాపోయారు. అనంతరం ఎంపీడీవో విద్యాసాగర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ సంబంధిత పంచాయతీలకు సంబంధించి లుకాలాంలోని పోస్టల్ బ్రాంచ్ మేనేజర్‌పై విచారణ చేస్తామని, ఇప్పటి వరకు ప్రతీ ఒక్క ఖాతాకు వేతనాలు చెల్లించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఏపీవో రవి మాట్లాడుతూ ఈనెల 10వతేదీన స్థానిక పోస్ట్ఫాస్ నుండి జరిగిన లావాదేవీలలో అవకతవకలు ఉన్నట్లుగా గుర్తించామని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

జగన్ దృష్టికి మత్స్యకారులు సమస్యలు
ఎచ్చెర్ల,డిసెంబర్ 11: మత్స్యకారులు సమస్యలు పరష్కరించాలని బడివానిపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కారి తాతారావు, విపక్షనేత, వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహనరెడ్డికి వినతి అందించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో పాదయాత్ర సాగిస్తున్న జగన్మోహనరెడ్డిని కలిసి మంగళవారం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఇటీవల వలస వెళ్లిన మత్స్యకారులు పాక్ కోస్ట్‌గార్డులకు చిక్కి బందీలుగా మారారని వీరిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 193 కిలోమీటర్లు తీరం ఉన్నప్పటికి 104 గ్రామాల్లో ఎక్కడ కూడా జట్టీలు నిర్మించకపోవడం వల్ల స్థానికంగా చేపల వేట లభ్యం కావడం లేదని, ఈ కారణంగా వలస జీవులుగా బతుకు బండి సాగించాల్సి వస్తుందని వివరించారు. దీనిపై సానుకూలంగా జగన్ స్పందించి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా మరిన్ని ఉపాధి కార్యక్రమాలు అమలు చేసేందుకు కృషి చేస్తానని మీరంతా రానున్న ఎన్నికల్లో తనకు అండగా నిలవాలని కోరారు.
కార్మికులకు ప్లంబింగ్ పనిముట్లు
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 11: కార్మిక శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎలక్ట్రికల్,ప్లంబింగ్ కార్మికులకు పనిముట్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం కార్మిక శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి కార్మికశాఖ అధికారులు రాధాకుమారి, కొండలరావు కిట్లను పంపిణీ చేశారు. కిట్లు కావల్సిన కార్మికులు కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించవల్సిందిగా కోరారు.

సివిల్ సప్లై హమాలీలు సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 11: సివిల్ సప్లై హమాలీలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం డిసి ఎమ్ ఎస్ గొడౌన్‌ల వద్ద హామాలీలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు హామాలీలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హమాలీలకు ఇ ఎస్ ఐ అమలు చేయాలని, మండల గొడౌన్‌లను పక్క గొడౌన్‌లలో విలీనం చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. పదేళ్లు పి ఎఫ్ కట్టిన వరందరికి పెన్షన్ మంజూరు చేయాలని, రిటైర్ అయిన వారందరికీ వెంటనే ఏరియర్స్ ఇప్పించాలని కోరారు. హమాలీల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇప్పించాలని, పనిచేస్తున్న హమాలీలకు పేర్లు నమోదు చేసి బోనస్, బట్టలు అందరితో పాటు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కెంబూరి శ్రీమన్నారాయణ, చిక్కాల గోవిందరావు, కోశాధికారి రావాడ కాంతారావు, సంచాన సత్యం తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు విజ్ఞాణ అభివృద్థికి దోహదపడాలి
లావేరు, డిసెంబర్ 11: విద్యార్థులు విజ్ఞాణ అభివృద్ధికి ఉపాధ్యాయులు దోహదపడాలని మండల విద్యాశాఖాధికారి లండ ఈశ్వరరావు సూచించారు. మంగళవారం బీమునిపాలెం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఆయన విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36 పాఠశాలలకు వంటశాలలు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఆయన వెంట పి ఆర్‌పీ, ఉపాధ్యాయులు ఉన్నారు.

బీజేపీ వల్లే తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కూటమి ఓటమి
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కూటమి ఓటమికి బీజేపీ పార్టీయే కారణమని ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర మంతటా వచ్చే లోక్ సభ ఎన్నికలకు బలమైన పునాదులు వేసుకున్నామని బీజేపీ శ్రీకాకుళం అసెంబ్లీ కన్వీనర్ చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. గతంలో టీడీపీ పొత్తు వలన కేవలం 5 స్థానాల్లో గెలిచామని నేడు స్వతంత్య్రంగా పోటీచేసి 1,2 స్థానాల్లో గెలవడమే కాకుండా రాష్టమ్రంతటా ఓట్లు శాతం పెంచుకొని పునాదులు వేసుకున్నామని, తెలుగు రాష్ట్రాల్లో బీజేపికి స్థానం లేదనుకునే వాళ్లకు ఇదే సమాదానం అని అన్నారు. అవినీతి మూలాలు ఉన్న టీడీపీ, కాంగ్రెస్ కూటమి ఓటమి చెందడం తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి మేలని అన్నారు. తెలంగాణలో టీడీపీని వ్యతిరేకించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చామని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని వ్యతిరేకించి ప్రభుత్వం అనుకూల ఓటున చీలుస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వలన సమయం సరిపోక ఎక్కువ సీట్లలో గెలవలేకపోయామని, ఇక్కడ టీడీపీపై తీవ్ర వ్యతిరేకత, ఎన్నికలకు కావల్సిన సమయం ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో గెలుపు దిశగా పార్టీని తీసుకెల్తామని అన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పుకున్న చంద్రబాబునాయుడును తరిమి కొట్టిన తెలుగు ప్రజలు అమరావతికి పునాదులే వేయని చంద్రబాబును ఏమి చేస్తారో వేచి చూడాలని అన్నారు. తెలుగు దేశం పార్టీతో పొత్తు వలన కాంగ్రెస్ నష్టపోయిందని, చంద్రబాబును తెలుగు ప్రజలు నమ్మడం లేదని స్పష్టమైందని అన్నారు. టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా నియోజకవర్గంలో పనిచేయాలని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
రాహుల్ నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 11: కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మద్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలలో విజయపథంలో ముందుకు దూసుకుపోవడం ఏ ఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధి నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ప్రజలు చూపారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధులు ముస్తాక్ మహ్మద్, రత్నాల నర్సింహమూర్తులు తెలిపారు. మంగళవారం ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ సిబి ఐ విషయంలో, జి ఎస్‌టి, పెద్దనోట్లు రద్దు విషయంలో ప్రజలను పూర్తిగా మోసం చేసిన తీరు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పార్టీ విజయపధంలో దూసుకుపోవడం బలపరుస్తున్నాయని అన్నారు. 2019 ఎన్నికల్లో మోదీకి బలమైన సవాళ్లు విసురుతూ కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయపధంతో సమాదానం చెప్పిందన్నారు. కాంగ్రెస్ గెలిచిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఉండడం ఒక విశేషం అంటే ప్రధాని మోదీపై ఉన్న నమ్మకం, బీజేపీ మీద ఉన్న విశ్వాసం ఏవిధంగా ఉందో ఈ ప్రజా తీర్పు వలన అర్ధమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంటును టి ఆర్ ఎస్ వాడుకోవడం దురదృష్టకరం అన్నారు. అధికార దుర్వినియోగంతో పాటు చాలా ఓట్లు గల్లంతవ్వడం ప్రజా కూటమి అపజయానికి ఒక కారణమన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ఆనాడు చెప్పిన కేసి ఆర్ ప్రస్తుతం గాంధి కుటుంబాన్ని మోసం చేయడం అందరికి తెల్సిన విషయమేనని, ఏది ఏమైనా తెలంగాణ ప్రజా తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని, సెమీ ఫైనల్స్‌లో కాంగ్రెస్ విజయపథంలో దూసుకుపోవడం ఆనందిస్తున్నామన్నారు.

నల్లబ్యాడ్జీలతో హమాలీల నిరసన
పొందూరు, డిసెంబర్ 11: సర్కార్ పథకాల పల్లకి మోసే హామీలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక సివిల్ సప్లై గొడౌన్ వద్ద హమాలీ కార్మికులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యూనియన్ నేత కొండల సూర్యారావు మాట్లాడుతూ తరతరాలుగా సివిల్ సప్లై గొడౌన్‌నే నమ్ముకున్నా కార్మిక తలరాతలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ వెట్టిచాకిరికి గురవుతున్నామన్నారు. హమాలీ కార్మికులకు ఇ ఎస్ ఐ, పి ఎఫ్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు.