శ్రీకాకుళం

మత్స్యకారులను విడిపించేలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 13: అనె్నం.. పునె్నం ఎరుగని మత్స్యకారులు బతుకు బాట సాగించేందుకు ఉన్న ఊరిని, కన్నవారిని విడిచి గుజరాత్‌లో చేపల వేట కూలీలుగా వెళ్లిన గంగ పుత్రులు నవంబర్ 27న యాధృచ్ఛికంగా అరేబియా మహాసముద్రంలో పాక్ జలాల్లోకి చొచ్చుకుపోయారు. ఇలా సరిహద్దులు దాటిన మత్స్యకారులను పాక్ కోస్ట్ గార్డులు పట్టుకొని అక్కడ జైలులో నిర్భందించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం తీర గ్రామాలైన డి.మత్స్యలేశం, బడేవానిపేట గ్రామాలనుంచి 13 మంది, శ్రీకాకుళం దమ్మలవీధికి చెందిన వారు ఒకరు పాక్ బంధీలుగా ఉన్న విషయం తెల్సిందే. విజయనగరం జిల్లా నుంచి ఆరుగురు పశ్చిమ గోదావరి నుంచి నలుగురు మత్స్యకారులు చేపల వేటకు వలస వెళ్లి పాక్ బంధీలుగా చిక్కుకున్నారు. 24 మంది మత్స్యకారులును విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ద్వారా పాక్ బందీలను విడిపించేందుకు సన్నాహాలు మొదలుపెట్టి ఆయా కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని కూడా నింపింది. అయితే మత్స్యకారులను తిరిగి విడిపించే బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు ప్రత్యేకంగా అప్పగించినట్లు తెల్సింది. దీనిపై రామ్మోహన్‌నాయుడు తనదైన శైలిలోకేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లి విదేశీ రాయభార కార్యాలయంలో డాక్యుమెంటీషన్ పూర్తి చేసారు. పాక్ బందీలుగా ఉన్న 24 మంది కుటుంబ నేపథ్యాన్ని సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకువెళ్లి వారంతా ఆందోళన చెందుతున్నారని చట్టపరంగా ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడు తీసుకువెళ్లారు. ఇప్పటికే ఇస్లామ్‌బాద్‌లోని భారత్ రాయిబారి అధికారులకు దిశా నిర్ధేశం చేశామని, ప్రస్తుతం బంధీలుగా ఉన్న మత్స్యకారుల పౌరసత్వ గుర్తింపు ప్రక్రియ పాకిస్తాన్ అధికారులు నిర్వహిస్తున్నారని చెప్పినట్లు తెలిపారు. భారతరాయబారి అధికారులు మత్స్యకారులను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఆ కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కేంద్రం చేపడుతున్న చర్యలను బాధిత కుటుంబ సభ్యులకు వివరించి భరోసా కల్పించాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ సూచించినట్లు ఎంపీ రామ్మెహన్‌నాయడు ఢిల్లీ నుంచి ఆంధ్రభూమికి తెలిపారు.
ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు ఆర్ధిక సహాయం:
వలస వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కి బంధీలుగా ఉన్న మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2లక్షలు వంతున ఆర్థిక సహాయం అందించేలా సంబంధిత అధికారులనుంచి ప్రతిపాదనలు కోరింది. సర్కార్ ఆదేశాల మేరకు మత్స్యశాఖ జేడి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా నుంచి బందీలుగా ఉన్న 14 మంది కుటుంబ వివరాలను ఆర్థిక సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై జీవో విడుదల కావల్సి వుంది.
రూ. 10వేలు వంతున పంపిణీకి చర్యలు:
ప్రభుత్వ ఆదేశాల మేరకు బందీలుగా ఉన్న మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10వేలు వంతున ఆర్థిక సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి సర్వం సిద్ధం చేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి కిమిడి కళావెంకటరావు ద్వారా డి.మత్స్యలేశం, బడేవానిపేట గ్రామాలకు చెందిన 13 మంది మత్స్యకారులు బందీలుగా ఉండడంతో ఆ కుటుంబాలకు రెండురోజుల్లో అందించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. పొన్నాడలో నిర్వహించే ఒక కార్యక్రమంలో ఈ ఆర్థిక సహాయాన్ని మత్స్యకార కుటుంబాలకు కళా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే పాక్ బందీలుగా ఉన్న మత్స్యకార కుటుంబాలకు 50 కిలోలు బియ్యం, నిత్యావసర వస్తువులు ఉచితంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ సాగిస్తున్నారు.
సుభ్రమణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవం
జలుమూరు, డిసెంబర్ 13: మండలం చల్లవానిపేట జంక్షన్ సమీపంలో ఉన్న శ్రీసుభ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టి మహోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. పురోహితులు, వేదపండితులు మావుటూరి సంతోష్‌కుమార్ బృందం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు పాలాబిషేకాలు, నెయ్యాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు చేపట్టారు. తెల్లవారు జామునుండి అనేక ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో అన్నసంతార్పణ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో చల్లవానిపేట, దరివాడ, జలుమూరు, లింగాలవలస గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

గ్రామదర్శినితో సమస్యలు పరిష్కారం
జలుమూరు, డిసెంబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అనేక సమస్యలు పరిష్కారమవుతాయని మండల పంచాయతీ విస్తరణాధికారి కొమరాపు అప్పలనాయుడు అన్నారు. మండలం రామయ్యవలస, కూర్మనాధపురం గ్రామాల్లో గురువారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటివరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఇంకా మిగిలిన సమస్యలు ఉంటే గ్రామదర్శిని అధికార బృందానికి తెలియజేయాలని అన్నారు. మండల విద్యాశాఖాధికారి బమ్మిడి మాధవరావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని, గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి దుద్ది భాస్కరరావు, రెవెన్యూ పరిశీలకులు రావాడ త్యాగరాజు, పలుశాఖాధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
బీజేపికి పెరిగిన ఓట్లు శాతం
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 13: ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాళ్లకు బలపాలు కట్టుకొని బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు దేశమంతటా తిరిగారని, అయితే టీడీపీ, కాంగ్రెస్ అనైతిక కూటమని తెలుగు ప్రజలు తిప్పి కొట్టారని పేర్కొన్నారు. ఇకనైనా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 15 ఏళ్లు పైబడి బీజేపీ అధికారంలో ఉండడం, అక్కడ ముఖ్యమంత్రుల పనితీరుపై వ్యతిరేకత ఉండడం వల్ల కొద్ది ఓట్లశాతంతో వెనుకబడి అధికారం కోల్పోయిందని అన్నారు. మోదీపై నమ్మకం, విశ్వాసం కారణంగా కేవలం 0.5 శాతం లోపునే ఓట్ల శాతం తగ్గిందని 2019లో ఇప్పటికంటె ఎక్కువగా పార్లమెంట్ స్థానాలను గెలుచుకొని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని తెలిపారు. వేరే గత్యంతరం లేని పరిస్థితిల్లో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని, రాహుల్ గాంధీపై విశ్వాసంతో కాదని పేర్కొన్నారు. తెలంగాణలో వేలు పెట్టి చంద్రబాబు చేతులు కాల్చుకున్నారని, సొంత పార్టీలోనే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు, రాష్ట్ర మజ్థూర్ సెల్ కన్వీనర్ ఎంబిజి నాయుడు, గొద్దు భాగ్యలక్ష్మి, ఎస్‌వి రమణమూర్తి, మైలపిల్లి అప్పారావు, అల్లు మల్లేశ్వరరావు, దయాసాగర్, మజ్టి వెంకటరావు, సురేష్ సింగ్, రోహిత్, కలగ అప్పారావు, పైడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

క్షయ వ్యాధి నిర్మూళనపై శిక్షణ
శ్రీకాకుళం (రూరల్), డిసెంబర్ 13: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం డి ఎమ్ హెచ్‌వో డాక్టర్ ఎమ్.చెంచయ్య అధ్యక్షతన క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా జిల్లాలోని సూపర్‌వైజర్‌లకు, వైద్యాధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డి ఎమ్‌హెచ్‌వో చెంచయ్య మాట్లాడుతూ డాట్స్ కోర్సును పూర్తిచేసి తెలవైన వారుగా నిరూపించుకోవాలన్నారు. మనం ప్రారంభించిన ఏ పనినైనా మద్యలో ఆపడం అవివేకమన్నారు. ఎట్టి పరిస్థితిల్లోను డాట్స్ కోర్సును సగంలో వదలరాదని సూచించారు. కెల్ల పరీక్ష నుండి చికిత్స పూర్తయ్యేవరకు ఆరోగ్య కార్యక్రమం పర్యవేక్షణలో క్షయ వ్యాధికి చికిత్స పూర్తిగా ఉచితమని తెలియజేశారు. నవంబర్ నెలలో 240 నూతన క్షయ వ్యాధి గ్రస్థులను గుర్తించడం జరిగిందని, వీరికి పోషకాహరం కోసం నెలకు రూ.500లును ఆన్‌లైన్ ద్వారా వీరి బ్యాంక్ అకౌంట్‌కు జమచేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో టీబీ పేషెంటును గుర్తించినచో వారికి మందుల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసి వారికి మందులు వాడేటట్లు చూడాలన్నారు. జిల్లాలో క్షయ వ్యాధి మందులను మద్యలో మానివేయకుండా చూడాల్సిన బాధ్యత ఆరోగ్య కార్యకర్తలపై ఉందన్నారు. జిల్లా అంతా యుద్ధ ప్రాతికదిన క్షయ వ్యాధి గ్రస్థులను గుర్తించి క్షయ వ్యాధి లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఐవో బగాది జగన్నాధం, కృష్ణమోహన్, పరిపాలనాధికారి పైడి వెంకటరమణ, జిల్లాలోని సూపర్‌వైజర్‌లు, వైద్యాధికారులు గోవిందాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

ఉచిత పశువైద్యశిబిరాలను వినియోగించుకోవాలి
సంతబొమ్మాళి, డిసెంబర్ 13: రైతులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత పశువైద్యశిబిరాలను వినియోగించుకోవాలని మండల పశువైద్యాధికారి ఎల్.శ్రీనివాసరావు అన్నారు. గురువారం సంతబొమ్మాళి మండలంలో పందిగుంట గ్రామంలో 216 గొర్రెలకు, 93 మేకలకు నట్టలనివారణ మందులను ఉచితంగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో వీరాస్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి గ్రామదర్శిని
టెక్కలి, డిసెంబర్ 13: గ్రామాల్లోని సమస్యల పరిష్కారం జరిగేందుకు ప్రభుత్వం ప్రజలు వద్దకు వచ్చి గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎంపీపీ సుందరమ్మ అన్నారు. టెక్కలి గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతం కంటే అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయంటే రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవ వల్ల అని ఆమె కొనియాడారు. బీసీ కులవృత్తులవారికి వాషింగ్‌మిషన్‌లు తదితర పరికరాలను ఇప్పటికే అందించడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఎమైనా సమస్యలుంటే పరిష్కారానికి కృషి జరుగుతుందని, తమ దృష్టికి తేవాలన్నారు. వినతులను స్వీకరించారు. వాటిని త్వరలో పరిష్కారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హరిహరరావు, తహసీల్థార్ అప్పలరాజు, గ్రామపంచాయతీ ఇవో శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావు, ఎంపీటీసీ మామిడి రాము, టీడీపీ నాయకులు గాంధీ తదితరులు పాల్గొన్నారు.

రాష్టస్థ్రాయి పోటీల్లో రావివలస విద్యార్థులు విజయం
టెక్కలి, డిసెంబర్ 13: రాష్టస్థ్రాయిలో అనంతపురం జిల్లాలో జరిగిన అండర్-14 సీ ఎం కప్ పోటీల్లో జిల్లా పరిషత్ హైస్కూల్, రావివలసకు చెందిన 9వ తరగతి విద్యార్థి వెంకటేష్, కడప జిల్లాలో జరిగిన అండర్-19 క్రికెట్ పోటీల్లో రాజ్‌కుమార్ ప్రతిభ కనబరిచారు. పాఠశాల హెచ్ ఎం మాధురి, వ్యాయామోపాధ్యాయులు త్రినాధరావు, ఉపాధ్యాయులు పద్మనాభరావు, అలివేలు, భాస్కరరావు, నారాయణమూర్తి, మోహినికుమారి, విద్యాకమిటీ చైర్మన్ మన్మధరావు విజేతలకు అభినందనాలు తెలిపారు.

పాముకాటుతో మహిళ అస్వస్థత
టెక్కలి, డిసెంబర్ 13: నౌపడ ఆర్ ఎస్‌కు చెందిన భూలక్ష్మి అనే వివాహిత పాముకాటుకు గురై తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం భూలక్ష్మి వ్యిక్తిగత పనులు నిమిత్తం తన ఇంటి పెరట్లోకి వెళ్తుండగా పాముకాటుకు గురైనట్లు తెలిపారు. ఇది గుర్తించిన స్థానికులు హుటాహుటిన 108లో టెక్కలి ఆసుపత్రికి చేర్పించి, వైద్యులు చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
టెక్కలిలో ఇంటింటికి బీజేపీ
టెక్కలి, డిసెంబర్ 13: క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు బీజేపీ క్రియాశీలక నాయకులు అట్టాడ రవిబాబ్జీ అన్నారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా టెక్కలిలో బీజేపీ ఆదరించండి అంటూ కరపత్రాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో బీజేపీ సామాన్యప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలను ప్రవేశపెట్టిందని, దానిని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ కన్వీనర్ లక్ష్మినారాయణ, మణిబాబు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు
వజ్రపుకొత్తూరు, డిసెంబర్ 13: ఉత్తరాదిలో ఇటీవల జరిగిన ఎన్నికలలో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా అనుకూల పవనాలు వీస్తున్నాయని స్పష్టమైందని పలాస నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ దున్న వాసుదేవ్ అన్నారు. నువ్వలరేవులో గురువారం మహిళలు, మత్స్యకారులతో మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేయడానికి ఉత్తరాది ఎన్నికల ఫలితాలు ఊపు ఇస్తున్నాయన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాహుల్‌గాంధీకి పట్టం కట్టాలని ఉత్సాహం కల్పిస్తుందన్నారు. రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినంతరం మొదటి సంతకం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఫైల్‌పైనే ఉంటుందని, రాష్ట్రం యావత్తు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఈయనతోపాటు మండల పార్టీ అధ్యక్షుడు ఎం.శాంతామూర్తి, రైతు సంఘం అధ్యక్షుడు టి.అప్పలస్వామి, శ్యామసుందరబెహారా, ఎం.శ్యామలరావు, ద్రౌపది, పార్వతి తదితరులు పాల్గొన్నారు.