శ్రీకాకుళం

పాలిటెక్నిక్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరుబుజ్జిలి, డిసెంబర్ 14: పాలిటెక్నిక్ విద్య అభ్యసించడం ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ కె.నారాయణరావు అన్నారు. రొట్టవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధిస్తే చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చునన్నారు. పాఠశాల ఇన్‌చార్జి హెచ్ ఎం టి.్ధనలక్ష్మీ, కళాశాల అధ్యాపకులు పి.శ్రీనివాసరావు, అనె్నపు గోపి, జి.వి.రమేష్, జి.తేజేశ్వరరావు, మందపల్లి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
16న బాలసాహితీవేత్తలకు పోటీలు
రాజాం, డిసెంబర్ 14: రాజాం రచయితల వేదిక సారధ్యంలో ఈ నెల 16న విద్యానికేతన్ పాఠశాలలో బాలసాహిత్యవేత్తలకు కథా, వ్యాసరచన ఇతర అంశాలపై పోటీలు నిర్వహించనున్నట్టు రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాధం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8,9,10 తరగతుల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. విజేతలకు తమ సంస్థ వార్షికోత్సవంలో బహుమతులు అందిస్తామని వివరించారు.
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
రాజాం, డిసెంబర్ 14: వచ్చే ఏడాది జనవరి 8,9,10 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని జిల్లా సీ ఐటీయూ కార్యాదర్శి గోవిందరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయని, దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు రాజాం సీ ఐటీయూ నాయకులు రామ్మూర్తినాయుడు కూడా పాల్గొన్నారు.
గ్రామదర్శినిని ఉపయోగించుకోండి
రాజాం, డిసెంబర్ 14: సమస్యల పరిష్కారానికి అధికారులు నిర్వహిస్తున్న గ్రామదర్శినిని వినియోగించుకోవాలని ఎంపీడీవో వెంకటేశ్వరరావు కోరారు. శుక్రవార వీ ఆర్ అగ్రహారంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో 16 శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కనీస వౌళిక సదుపాయాలు కోసం ఇస్తున్న ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో పొందుపరిచి పరిష్కరిస్తామని, ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలన్నారు. తహశీల్దార్ సత్యనారాయణ, ఏవో బి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షనేతకు కళా బహిరంగ లేఖ
రాజాం, డిసెంబర్ 14: రాష్ట్ర విద్యుత్‌శాఖామంత్రి కిమిడి కళా వెంకటరావు ప్రతిపక్ష నాయకులు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్టు క్యాంప్ కార్యాలయం ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. ప్రతిపక్ష నాయకునిగా జగన్ తన పాత్ర పోషించలేకపోయారని, రాష్ట్రాన్ని విడగొట్టి విజయాన్ని సాధించిన పక్క రాష్ట్రం తెలంగాణాలో విజయానికి వైకాపా శ్రేణులు సంబరాలు చేసినప్పుడే ప్రతిపక్ష నేత డొల్లతనం బయటపడిందన్నారు. ఇటువంటి కారణాలవల్ల అభివృద్ధి కుంటుపడుతుందని లేఖలో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమించాలి తప్ప చవకబారు నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు.