శ్రీకాకుళం

గ్రామదర్శిని ద్వారా సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, డిసెంబర్ 14: ఎంతో ప్రతిష్టాకరంగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా గ్రామాల వద్దకు వెళ్లి సమస్యలను గుర్తించే విధంగా గ్రామదర్శిని కార్యక్రమాలను చేపడుతుందని మండల ప్రత్యేకాధికారి ఆర్.వెంకటరామన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కొత్తపోలవలస, కంబకాయ పంచాయతీలలోజరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గాను ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేపడుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. ముఖ్యంగా వౌళిక సదుపాయాల కల్పనకు దృష్టి సారించామని, వీటిని అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన వివరించారు. ముఖ్యంగా స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా చెత్తనుండి సంపద కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎ.రామారావు, మండల అధికారులు పాల్గొన్నారు.

టెక్కలిపాడు భూమిని సర్వేచేయిస్తా
* కలెక్టర్ ధనంజయరెడ్డి
జలుమూరు, డిసెంబర్ 14: మండలం టెక్కలిపాడు గ్రామపంచాయతీ రైతుల కోరిక మేరకు పంచాయతీ పరిథిలో ఉన్న వ్యవసాయభూమిని పూర్తిస్థాయిలో సర్వేచేయించి రైతుల కోర్కెను తీరుస్తానని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి భరోసా ఇచ్చారు. టెక్కలిపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గతంలోసక్రమంగా సర్వే జరగలేదంటూ రైతులు తెలిపిన ఫిర్యాదుమేరకు ఆయన రైతులకు సభాముఖంగా హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే తీరు పలు అంశంలపై అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో గ్రామదర్శిని కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. తిత్లీ తుఫాన్‌లో నష్టపరిహారం అందలేదని మరికొందరు పలువురు తమ దృష్టికి తెచ్చినందున త్వరలో ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ విధానం, అంగన్వాడీ, పాఠశాల పనితీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డి ఆర్‌డి ఏ ప్రాజెక్ట్ డైరక్టర్ కిషోర్‌కుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో స్వయంశక్తి సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సహాయ సహకారాలను వివరించారు. గ్రామాల్లో ఈ సంఘాలకు అనేక విధంలుగా మా సంస్థ చేయూతనిస్తుందని తెలిపారు. గ్రామంలో సంఘాల పనితీరుపై సంఘ మహిళలను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ డీ ఈవో, ఎంపీడీవో పడాల వాసుదేవరావు, తహశీల్దార్ కె.ప్రవళ్లికప్రియ, ఎం ఈవో బమ్మిడి మాధవరావు, పంచాయతీ విస్తరణాధికారి కొమరాపు అప్పలనాయుడు, ఎంపీటీసీ బండి ఎర్రన్న, పలు మండల స్థాయి అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.