శ్రీకాకుళం

నాన్నకు ప్రేమతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్దదిక్కుగా పేరున్న దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు ప్రజల మధ్య ఉన్న కాలంలో ఇచ్ఛాపురం నుంచి అనకాపల్లి వరకూ జాతీయ రహదారి పక్కన ఏ బస్‌షెల్టర్ చూసినా కింజరాపు ఎర్రన్నాయుడు బస్‌స్టాప్‌లే.. అన్నీ ఆయన స్వతహాగా ప్రయాణికులకు కోసం నిర్మించినవే... ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన హఠాన్మరణం తర్వాత ఎర్రన్న పేరుతో నిమ్మాడ నుంచి న్యూఢిల్లీ వరకూ పలు ప్రాజెక్టులు, పథకాలు, ప్రైవేటు సంస్థలు ప్రేమతో... ఆయనకు నాలుగేళ్ళుగా ఘన నివాళులు అర్పించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే ఎన్.జి.రంగా, గౌతు లచ్చన్నల చరిత్ర వెంటనే గుర్తుకువస్తుంది! వీరిపేర్లుతో యూనివర్సిటీలు, తోటపల్లి ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే! గత రెండేళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాన్నకు ప్రేమతో... శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రధానిమంత్రి మోదీకి శ్రీకాకుళం జిల్లా పేరును ఎర్రన్నాయుడు జిల్లాగా మార్చాలంటూ ప్రతిపాదన ఇచ్చారు.
ఢిల్లీ సర్కార్ ఆ ప్రతిపాదనపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో శ్రీకాకుళం జిల్లాను ఎర్రన్నాయుడు జిల్లాగా మార్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. రేపోమాపో ఆ ఉత్తర్వులు విడుదల కానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిపిడబ్ల్యుఎస్ స్కీమ్‌కు దివంగత ఎర్రన్నాయుడు మంచినీటి సరఫరా పథకంగా ఆయన జ్ఞాపకార్థం మారుస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల టెక్కలిలో 20 కోట్ల రూపాయలతో నిర్మించి, కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు అంకితం చేసిన మంచినీటి పథకానికి ఎర్రన్నాయుడు పేరుగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు కలెక్టర్‌కు అందాయి. ఈ నీటిపథకం 22.25 కోట్ల రూపాయలతో మొదటి విడతగా టెక్కలి, సంతబొమ్మాళి మండలాల్లో 24 గ్రామాలకు మంచినీరు సరఫరా చేస్తున్నారు. రెండోవిడతగా మరో 30 కోట్ల రూపాయలతో 50 గ్రామాలకు మంచినీరు అందించనున్నారు. మొత్తంగా ఈ స్కీమ్ ద్వారా 76 వేల మంది జనాభాకు మంచినీరు అందజేయనున్నారు. నాటి ఉద్దానం ప్రాజెక్టు రూపశిల్పి ఎర్రన్న మరణం తర్వాత అతి పెద్ద మంచినీటి ప్రాజెక్టుకు ప్రభుత్వం నిమ్మాడ నేత ఎర్రన్న పేరు పెట్టడం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎర్రన్న ఆ కుటుంబానికి జిల్లాలో అధిక ప్రాధాన్యం ఇవ్వడమేకాకుండా ఆయన పొలిటికల్ మైలేజ్ మరణాంతరం కూడా పడిపోకుండా లైవ్‌లో ఉంచేలా జయంతి.. వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఎర్రన్న ప్రతీ విగ్రహావిష్కరణ, సంస్మరణ సభ వేదికల్లో జిల్లాకు చెందిన నేతలతోపాటు రాష్ట్ర నాయకులు కూడా శ్రీకాకుళం జిల్లాను ఎర్రన్న జిల్లాగా పేరు మార్చాలని డిమాండ్ కూడా తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇటువంటి సంప్రదాయాలను రాజకీయ పార్టీలు ఆయా ప్రభుత్వాలు పనిచేస్తున్నప్పుడు మహోన్నత వ్యక్తుల చరిత్ర గుర్తువుండేలా చిహ్నంగా నిర్ణయాలు తీసుకోవడం పరిపాటి. కడప జిల్లాకు డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జిల్లాగా, అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు నెల్లూరు జిల్లాకు మార్చినట్లే... శ్రీకాకుళం జిల్లా పేరును కూడా ఎర్రన్నాయుడు జిల్లాగా మార్చాలంటూ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. నాన్నకు ప్రేమతో... ఎం.పి. రామ్మోహన్‌నాయుడు కేంద్ర ప్రభుత్వంలో నాయూడిజీ పేరు మరింత పటిష్ఠంగా నిలిచేలా చూస్తుంటే...జిల్లాలో సోదరుడు మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి మంచినీటి పథకానికి ఎర్రన్న పేరుగా ఉత్తర్వులు తెప్పించగలిగారు.