శ్రీకాకుళం

వ్యవసాయంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్), జనవరి 21: వ్యవసాయంలో సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా దిగుబడులు పెరిగి అధికాదాయం పొందవచ్చని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కెసి హెచ్ అప్పలస్వామి అన్నారు. సోమవారం శ్రీకాకుళం డివిజన్ పరిథిలో గార, శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల మండలాల వ్యవసాయసిబ్బందికి సామర్ధ్యపు పెంపు, సమగ్ర పనితీరుపై శిక్షణాకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేడి ఏ అప్పలస్వామి మాట్లాడుతూ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు అందజేయాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రైతురథం, వ్యవసాయ యాంత్రీకరణ వంటి లక్ష్యాలను పూర్తిచేయాలని ఆదేశించారు. మార్కెట్‌లో నకిలీ ఎరువుల పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ ఎరువులు, పురుగుల మందుల దుకాణాలలోతనిఖీలు చేపట్టి నకిలీ ఎరువు నమూనాలు సేకరించాలని ఆదేశించారు. నమూనాల పరీక్షలో ఎరువులు నకిలీవని నిర్ధారణ అయితే వాటిని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నమూనాలు సేకరించి తేమ శాతం పరీక్షలు చేసి ధాన్యం కొనుగోలు జరపాలన్నారు. ఈకార్యక్రమంలో రైతు శిక్షణా కేంద్రం డిడిఏ కె.శ్రీ్ధర్, ఏడిబివి తిరుమలరావు, ఏవోలు, ఎంపి ఈవోలు, ఆత్మబిటిఎమ్, ఏటిఎమ్‌లు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే యువతకు భవిత
వజ్రపుకొత్తూరు, జనవరి 21: కాంగ్రెస్ పార్టీతోనే యువతకు అవకాశాలు లభించి బంగారుభవిత సాధ్యమవుతుందని పలాస నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ దున్న వాసుదేవరావు అన్నారు. సోమవారం పల్లివూరు పంచాయతీ, నూకలవానిపేటలో తిత్లీ బాధితుల పరామర్శతోపాటు యువతతో కలిసి మాట్లాడారు. దేశానికి దిశ,నిర్థేశం చేయాల్సిన గురుతర బాధ్యత యువతపై ఉందన్నారు. రాహుల్‌గాంధీ యువనాయకత్వం దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ సమయంలో దేశభవిష్యత్తు కోసం యువత కాంగ్రెస్ విధానాలకు ఆకర్షితులై రాహుల్‌గాంధీ వెంట నడవాల్సిన అవసరం ఉందన్నారు. తిత్లీ తుపాన్ వచ్చి మూడు నెలలు దాటిన పూర్తిస్థాయిలో పరిహారం అందకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. ఈయనతోపాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.శాంతామూర్తి, మల్లి, ఆదిలక్ష్మి, భాస్కరరావు, తులసీరావు, లక్ష్మినారాయణ, మోహిని, అశోక్, డి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
చంద్రన్న బీమా బాధితులకు వరం
వజ్రపుకొత్తూరు, జనవరి 21: చంద్రన్నబీమా పథకం బాధిత కుటుంబాలకు వరంలాంటిందని నువ్వలరేవు ఎంపీటీసీలు బి. ఆనంద్, వెంకటేష్‌లు అన్నారు. గ్రామానికి చెందిన బి.లోచ్చి ఇటీవల మృతి చెందారు. ఆ కుటుంబానికి చంద్రన్నబీమా పథకం కింద 2 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. తక్షణ సహాయం కింద నామినీ సోనీయాకు సోమవారం అందించారు. కుటుంబ యజమాని మరణించిన ఆపద సమయంలో సీ ఎం చంద్రబాబునాయుడు ఆ కుటుంబానికి చంద్రన్నబీమా పథకం కింద సహాయం అందించి పెద్దదిక్కుగా నిలుస్తున్నారన్నారు. మిగతా సొమ్ము బాధిత కుటుంబ అకౌంట్‌లో జమ చేయనున్నట్లు బీమా మిత్ర ప్రసన్నలక్ష్మి తెలిపారు. వారితోపాటు గ్రామైక్య సంఘం సభ్యులు ఎర్రమ్మ, చొప్పమ్మ పాల్గొన్నారు.

ఎన్ ఎంయు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష
టెక్కలి, జనవరి 21: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎన్ ఎంయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా ఎన్ ఎంయు ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలేనిరాహారదీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష,కార్యదర్శులు అనంతయ్య, దశరధులు మాట్లాడుతూ సర్వీసు నిబంధనలను అమలు చేయాలని, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్నారు. ఉద్యోగ నియామాల్లో ఔట్‌సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేసారు. ఈ విషయమై ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన చర్యలు కానరావడం లేదన్నారు. బికె రావు, జెవి రావు,సత్యనారాయణ, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విద్య బలపడాలి
టెక్కలి, జనవరి 21: మారుమూల గ్రామాల్లో వున్న ప్రభుత్వ పాఠశాలల విద్య బలోపేతం కావాల్సి ఉందని నర్శింగపల్లి మాజీ సర్పంచ్ పి.శరణకుమారి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు కూర్చొనేందుకు డెస్క్‌బల్లలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. హెచ్ ఎం నారాయణమూర్తి ప్రహారీగోడ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాల్సిందిగా కోరారు. పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ రాణి, మాజీ సర్పంచ్ రాజారావు, గ్రామస్తులు బాలరాజు, కామరాజు, పి. ఆనందరావు, పాపారావు, ఉపాధ్యాయులు పి.్ఢల్లేశ్వరరావు, చిన్నవాడు, హేమసుందర్, బి.ప్రమీల, సుమలత తదితరులు పాల్గొన్నారు.
పల్లెలకు వైద్యశిబిరాలను విస్తరించడం మంచి పరిణామం
నందిగాం, జనవరి 21: పల్లె గ్రామాలకు వైద్యశిబిరాలను విస్తరించడం మంచి పరిణామమని పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలో కొండతెంబూరు గ్రామంలో జనసేన పార్టీ, స్పా స్వచ్చందసంస్థ ఆధ్వర్యంలో విజయనగరంకు చెందిన శ్రీవెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వైద్యులు వచ్చి సేవలు అందించడం శుభపరిణామమన్నారు. రోగులు వద్దకు వైద్యులు వచ్చి సేవలు అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేసారు. ఈ శిబిరంలో 114 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా, అందులో 30 మందిని శస్తచ్రికిత్సలకు ఎంపిక చేసారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మనోజ్‌కుమార్‌యాదవ్, చిన్న ఆచారి, సునీల్‌వర్మ, గోపాలకృష్ణ, దానేసు, జనసేన పార్టీ నాయకులు జగదీష్, బి.శ్రీనివాస్, సంతోష్, సుమన్, శ్రీ్ధర్, ప్రసాద్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
శిథిలావస్థలో ఉన్న తుపాన్ షెల్టర్లు
మందస, జనవరి 21: మండలంలోని రట్టి, గంగువాడ, లక్ష్మిపురం గ్రామాల్లో దశాబ్దకాలంగా శిథిలావస్థకు చేరుకొని తుపాన్ షెల్టర్లు తీర గ్రామ ప్రజలకు భయాందోళనలకు గురిచేస్తుంది. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఆయా ప్రాంత ప్రజలు, తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు శిథిలావస్థలో వున్న తుపాన్ షెల్టర్లులోని తలదాచుకోవడానికి భయపడి ఆందోళన చెంది ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాల్లో తలదాచుకున్నారు. 20 ఏళ్లుగా ఈ భవనాలకు ఎటువంటి మరమ్మతు చర్యలు చేపట్టలేదు. ఈ భవనాల్లో విషజంతువులు నిలయంగా మారాయి. అసాంఘిక కార్యకార్యలాపాలకు దారితీస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సందర్భంగా మత్స్యకారులు, ప్రజలు తలదాచుకోవడానికి ఉద్దేశించిన ఈ భవనాలను తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆ యా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.