శ్రీకాకుళం

జగన్‌కు చేతకాకే పక్క రాష్ట్ర నేతలతో దోస్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జనవరి 23: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎదుర్కోవడం చేతకాక ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి పక్క రాష్ట్రం నేతలతో దోస్తీ చేసుకున్నాడని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మోడీ, కేసీ ఆర్, జగన్‌లు అడ్డుకుంటున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ముగ్గురు మోడీలు కలిపి చంద్రబాబునాయుడును ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. బుధవారం మండలంలోని నివగాంలో పాతపట్నం నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మోడీ, కేసీ ఆర్, జగన్‌లు కలిసి చంద్రబాబునాయుడుపై దాడి చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు చేసిన తప్పు ఏమిటి, తెలుగు వారికి బాబు చేసిన మోసం ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గత నాలుగన్నరేళ్ల పాలనలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి చర్చకు రావాలని సవాల్ విసిరితే పారిపోతున్నారని అచ్చెన్న ఎద్దేవా చేశారు. విభజనలో తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్ర ప్రదేశ్‌కు విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు అమలుచేయాల్సిన బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చేసుకొని చంద్రబాబునాయుడు పరిపాలన చేస్తుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్ష నేత జగన్, పక్క రాష్ట్రం తెలంగాణా ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందన్నారు. చేసిన అభివృద్ధిపై వైకాపా నాయకుల ఇళ్ల ముందుకు వెళ్లి టీడీపీ నాయకులు తొడకొట్టి చర్చకు రావాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మళ్లీ అధికారంలోకి టీడీపీ వచ్చేలా టీడీపీ శ్రేణులు పాటుపడాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిని చేస్తే నవ్యాంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే గుర్తింపు పొందిన రాష్ట్రంగా పేరు పొందుతుందన్నారు. రానున్న రోజుల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ జిల్లాలో వెయ్యి కోట్లతో వంశధార, నాగావళి కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణంతో పాటు అంగన్‌వాడీ, పాఠశాలలు, సామాజిక భవనాలు, పింఛన్లు రెట్టింపు, రైతులకు పూర్తిగా రుణమాఫీ వంటి పథకాలు అమలు చేసి చూపిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కలమట వెంకటరమణను గెలిపించాలని కోరారు. ఎంపీగా తనను కూడా గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు, టీడీపీ నాయకులు బైరాగినాయుడు, లక్షుమయ్య, వీరభద్రరావు, ఎంపీపీ ఆరిక రాజేశ్వరి, జెడ్పీటీసీ పాలక ధనలక్ష్మీ, ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.