శ్రీకాకుళం

మొరాయించిన బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతబొమ్మాళి, జనవరి 23: బోరుభద్ర గ్రామంలో ఏర్పాటు చేసిన బీ ఎస్ ఎన్ ఎల్ నెట్‌వర్క్ నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురైనారు. బీ ఎస్ ఎన్ ఎల్ వినియోగదారులతోపాటు ఇంటర్నెట్ వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నెట్‌వర్క్‌ను పునరుద్దరించాలని కోరుతున్నారు.
మంత్రిని కలిసిన డి ఆర్ డి ఎ పిడి
కోటబొమ్మాళి, జనవరి 23: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కల్యాణచక్రవర్తి నిమ్మాడలోని మంత్రి క్యాంపుకార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్వాదపూర్వకంగా కలిసారు. జిల్లాలోని డి ఆర్ డి ఎ పరిధిలోని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మంత్రితో చర్చించారు. ఉద్యోగ విధులను సక్రమంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
బకాయిలు చెల్లించకపోతే విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తాం
కోటబొమ్మాళి, జనవరి 23: మండల కేంద్రంలో వివిధ కార్యాలయాలు విద్యుత్తు బకాయిలు పెరిగిపోయాయని, వెంటనే చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని ఎ ఇ చంద్రశేఖర్ బుధవారం విలేఖరులతో అన్నారు. కస్తూరిభా విద్యాకేంద్రానికి సంబంధించి 2 లక్షల 78 వేల 741 రూపాయలు, తహసీల్థార్ కార్యాలయం 2 లక్షల 11 వేల 463 రూపాయలు తదితర కార్యాలయాలు విద్యుత్తు బకాయిలున్నాయన్నారు. ఈ బిల్లులు వెంటనే చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామన్నారు.
వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం
నందిగాం, జనవరి 23: వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరమని వినియోగదారుల సంఘం జిల్లా ప్రతినిధి చల్లా రామారావు అన్నారు. ఈ మేరకు బుధవారం మండలంలోని నర్శిపురం గ్రామంలో ఎన్ ఎస్ ఎస్ మూడవ రోజు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించారు. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా బిల్లులను తీసుకోవాలన్నారు. నకిలీ వస్తువులను గుర్తించి తక్షణమే వినియోగదారుల సంఘానికి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పివో రోజారాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చంద్రన్నబీమా బాధిత కుటుంబాలకు భరోసా
వజ్రపుకొత్తూరు, జనవరి 23: చంద్రన్నబీమా పథకం బాధిత కుటుంబాలకు భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ అన్నారు. మంచినీళ్లుపేటలో ఇటీవల లక్ష్మి, కమలమ్మలు ఇటీవల మృతి చెందారు. ఆ కుటుంబాలకు చంద్రన్నబీమా పథకం కింద 30 వేల రూపాయలు, 2 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన ప్రోసిడింగ్స్‌ను ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు బుధవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ యజమాని మృతి చెందితే ఆ కుటుంబం వీధినపడకుండా ఉండేందుకు సీ ఎం చంద్రబాబునాయుడు చంద్రన్నబీమా పథకం ద్వారా ఆ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారన్నారు. దేశంలోని ఎక్కడా అమలుకాని విధంగా చంద్రన్న బీమా పథకం మన రాష్ట్రంలో అమలు అవుతుందని గుర్తు చేసారు. టీడీపీ ప్రభుత్వానికి అండదండలు అందిస్తే ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు చేరువ చేయడానికి సీ ఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తారన్నారు. టీడీపీ పేదలపక్షపాతి అని, పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసంతస్వామి, ఎంపీటీసీ ఎస్.మాధవరావు, పలాస మాజీ ఎంపీపీ ఎన్.బైరాగి, మాజీ సర్పంచ్ చిన్నారావు, గ్రామ అభివృద్ధి అధ్యక్షుడు ఎ.పాపారావు, బీమా మిత్ర ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరూ తెలుసుకోవాలి
వజ్రపుకొత్తూరు, జనవరి 23: ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు మహిళ సంఘాల సభ్యులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని వెలుగు ఏపీ ఎం ప్రసాదరావు అన్నారు. బుధవారం మండలంలోని హుకుంపేటలో సంఘదర్శిని రెండవ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘదర్శినికి సభ్యులకు మధ్య అనుబంధం ఏర్పడాలన్నారు. లింగవివక్షత, సామాజిక అంశాలపై మహిళ సంఘం సభ్యులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘదర్శిని సి ఆర్‌పిలు బానుమ్మ, రుక్మిణి, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
రైతుల అభ్యున్నతే ధ్యేయం: మంత్రి అచ్చెన్న
మెళియాపుట్టి, జనవరి 23: రైతుల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మెళియాపుట్టి మండలంలోని పెద్దపద్మాపురం గ్రామంలో బుధవారం 3.25 కోట్ల రూపాయలతో నీరు-చెట్టు పథకం కింద నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో వున్న ప్రాజెక్టులను మరో ఆరు నెలల్లో పూర్తిచేస్తామని సంకల్పం చేసారు. పెద్దపద్మాపురం రికార్డు స్థాయిలో ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం జరిగిందని పేర్కొంటూ సంబంధిత అధికారులను ఆయన అభినందించారు. ఈ ఎత్తిపోతల పథకం 20 ఏళ్లు నాటి కలను తీర్చామన్నారు. ఎంతోమంది రైతులకు సాగునీరు అందించే బృహత్తరమైన పథకమన్నారు. ప్రతి నీటిబొట్టును రైతులు వినియోగించుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఈయనతోపాటు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే కె.వెంకటరమణమూర్తి, మెళియాపుట్టి ఎంపీపీ ఎస్.రాజేశ్వరీ, మోహనరావు, టీడీపీ అధ్యక్షుడు ఎ.రాజశేఖరరెడ్డి, దేశం పార్టీ ప్రతినిధులు సంజీవరావు, కృష్ణమూర్తినాయుడు, షణ్ముఖరావునాయుడు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.