శ్రీకాకుళం

ట్రీగార్డ్ నిధులు కైంకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, ఫిబ్రవరి 18: మండలంలోని మొక్కలు నాటి ప్రగతిబాటన పర్యావరణాన్ని రక్షించే దిశగా లక్షలాది మొక్కలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నాటడం జరిగిందని, దీనికి సంబంధించి ట్రీగార్డులకు లక్షల రూపాయలు వెచ్చించినప్పటికి వాటి నిధులు కైంకర్యం అయినట్లుగా సోషల్ ఆడిట్‌లో వెల్లడయ్యింది. సోమవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సోషల్ ఆడిట్ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీడీలు అప్పలసూరి, వెంకటరామన్, అలివేలుమంగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పంచాయతీలలో మొక్కలుకు రక్షించే విధంగా ట్రీగార్డుల్లో లక్షల రూపాయలు కైంకర్యం అయినట్లుగా వెల్లడించారు. దీనివలన వేలాది మొక్కలు చనిపోయావని, ప్రభుత్వ ఉద్దేశాలను ఆచరణలో పెట్టలేకపోయారని సోషల్ ఆడిట్ అధికారులు వెల్లడించారు. అలాగే ఉపాధి పథకంలో వంద రోజులు పూర్తయిన వారికి కూడా పనులు కల్పించి వారికి వేతనాలు నేటికి చెల్లించలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. సిమెంట్ రహదారుల నిర్మాణాల్లో కూడా అవకతవకలున్నాయని వారు స్పష్టం చేశారు. ఎన్టీ ఆర్ గృహనిర్మాణాల్లో కూడా ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకుండానే కొంతమంది లబ్ధిదారులకు నిధులు చెల్లించారని వివరించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ ఆయా చెల్లింపులపై విచారణ చేసి ఆ నిధులను రికవరీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రవికుమార్, ఏపీఎమ్ మల్లేశ్వరరావు, సి ఆర్‌పీ, డీ ఆర్‌పీలు పాల్గొన్నారు.

పాక్‌కు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 18 : కాశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి నిరసనగా పట్టణంలోని ముస్లింలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. తొలుత అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ ముస్లిం మతగురువు ఎండీ.ఎ.ఖాదర్ ఆధ్వర్యంలో లాలాపేట మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మెయిన్ రోడ్ మీదుగా భారీ ర్యాలీ జరిపారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. బస్టాండ్ జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. ముస్లిం పెద్దలు ఎండీ షరీఫ్, అహ్మద్ అలీ, వజీద్ జిలానీ, ఇర్ఫాన్, జాకిర్, యజ్‌దానీ, మున్నా మస్తాన్, అక్బర్ పాల్గొన్నారు. కాగా వీర సైనికులకు నివాళులర్పిస్తూ ఆటో యజమానులు, డ్రైవర్లు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఆటో సంఘం నేతలు కె.శంకరరెడ్డి, యు.ఎర్రయ్యరెడ్డి, డి.లింగరాజు, బి.మోహన్, దుర్యోధన, భాస్కరరావు పాల్గొన్నారు.
పాక్ ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
పలాస, ఫిబ్రవరి 18: వీరజవాన్‌లపై పాక్‌ప్రేరేపిత ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వామపక్షాల ప్రజాసంఘాల నాయకులు అన్నారు. సోమవారం కాశీబుగ్గలో ప్రజాసంఘాల నాయకులు సమావేశం నిర్వహించి, వీరజవాన్‌లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడులు జరగకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు కట్టుదిట్టం లేకపోవడమే దాడులు పునరావృతమైనాయన్నారు. మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేసారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్‌ల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని, వామపక్షాలు, ప్రజాసంఘాల తరపున సంతాపం తెలియజేస్తున్నామని, ఆ కుటుంబాలకు ప్రజాసంఘాల మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు మద్దిల రామారావు, తామాడ సన్యాసిరావు, ఎన్.గణపతిరావు, చాపర వేణుగోపాల్, ఈశ్వరమ్మ, కుసుమ, భాగ్యలక్ష్మి, బి. ఓంకార్, ఎన్.నారాయణ తదితరులు పాల్గొన్నారు.