శ్రీకాకుళం

రిఫరెండంపై వెనుంజ వేస్తున్న నేతలు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఎన్నికలు వస్తున్నాయంటే - రిఫరెండం అన్న పదం మారుమోగుపోవాలి. కానీ, రిఫరెండంపై రాజకీయ పార్టీలన్నీ వెనుకంజ వేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ మంత్రులు, ఎం.పి.లు, ఎమ్మెల్యేలు రిఫరెండం అంటేనే వౌనం వహించే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఎమ్మెల్యేగా బి.్ఫరం జనసేన పార్టీ నుంచి కావాలంటే అందుకు ప్రత్యేకంగా స్క్రీన్ టెస్టు ఉంటుందన్న ప్రచారం తెలుగురాష్ట్రాల్లో చిట్టచివరి జిల్లాయైన శ్రీకాకుళానికి కూడా చేరింది. అందుకు అర్హులైన యువకులు, పదవీవిరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ కూడా ఆ స్క్రీన్ టెస్టుకు సిక్కోల్ నుంచి ఉత్సాహాం చూపిస్తున్న నేపథ్యంలో జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు సరికొత్త పల్లవితో మరో వ్యూహానికి తెరలేపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎం.పి.లు గడచిన ఐదేళ్ళు స్థానికంగా ఓట్లు వేసిన ప్రజలకు పరిపాలన ఏలా అందించారన్న దానిపై రిఫరెండం ఇవ్వాలంటూ ఒక పిలుపును యువత ద్వారా ఇప్పించేందుకు సన్నద్ధం అవుతున్నారు. అంతేకాకుండా అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షపార్టీలో ఉన్న మాజీ కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు కూడా వారిపై ఓటరుకు గల విశ్వసనీయత, పరిపాలన, అవినీతి, హత్యారాజకీయాలు అన్న నాలుగు అంశాలపై 3రిఫరెండం2 ఇచ్చుకునే ధైర్యం కలిగిన వారే ఈసారి ఎన్నికల బరిలో దిగితేనే వారికి జనం ఓట్లు వేస్తారన్న సంకేతాన్ని జనసేనపార్టీ సరికొత్త స్లోగన్‌ను ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఆయుధంగా వినియోగించాలన్న ఎత్తుగడకు శ్రీకాకుళం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు విలవిలాడిపోతున్నారు. జనసేనపార్టీ ఐదేళ్ళ బాబు సర్కార్‌లో పనిచేసే ప్రతీ మంత్రి, ఎమ్మెల్యేలు నాలుగు అంశాలపై రిఫరెండం ఇవ్వగలరా? అన్న పవన్‌కళ్యాణ్ ప్రశ్నకు కాదంటే ఒక సమస్య, అవునంటే మరెన్నో సమస్యలను ఎన్నికల ముందు ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలపై అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. రానున్న ఎన్నికల కోసం గడచిన పాలనలో విశ్వసనీయత, అవినీతికి రిఫరెండం ఇచ్చే ధైర్యం జిల్లాలో పది నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావులకు లేదంటూ ఓటరే నిర్ణయించేస్తున్న తరుణంలో జనసేన జిల్లాలవారీగా ఐదేళ్ళ పాలనలో 3రిఫరెండం2 ఆయుధంతో బహిరంగసభలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.