శ్రీకాకుళం

అభివృద్ధి పనులను పరిశీలించిన ఆర్డీవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, పిబ్రవరి 21: దక్షిణకాశీ శ్రీముఖలింగంలో ప్రభుత్వ పరంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను టెక్కలి డివిజన్ రెవెన్యూ అధికారి ఎస్.్భస్కరరెడ్డి గురువారం పనులను పరిశీలించారు. గత కలెక్టర్ ధనంజయరెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వరులు చేపట్టిన కృషే ఈ అభివృద్ధికి ప్రధాన కారణంగా ఇక్కడవారు ఆర్డీవోకు వివరించారు. ప్రధాన దేవాలయం చుట్టూ జరుగుతున్న పనులు, ఉత్సవాలకు ఏర్పాట్లు పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఆయనకు దేవాదాయ శాఖ సాంప్రదాయ స్వాగతం పలికింది. మధుకేశ్వరస్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ముఖమండపంపై అర్చకులు ఆయనను ఆశీర్వదించి ఆలయ చరిత్ర, శిల్పసంపదను, నిర్మాణగాథలను వివరించారు. ఆలయ ప్రాంగణంలోవారాహి అమ్మవారిని దర్శించి శిల్పసంపదను తిలకించారు. ఇటువంటి మహాపుణ్యక్షేత్రం ప్రాంతంలో ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టడం ఎంతో అదృష్టమని అన్నారు. ఆయనతో పాటు తహశీల్దార్ బి. ఎల్లారావు, కార్యనిర్వాహణాధికారి వివి ఎస్ నారాయణ, రెవెన్యూ పరిశీలకులు చిన్నారావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతీ శాఖాధికారి సమర్ధవంతంగా పనిచేయాలి
* ఆర్డీవో భాస్కరరెడ్డి
జలుమూరు, ఫిబ్రవరి 21: మండలం శ్రీముఖలింగంలో మార్చి4న జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను ప్రతీ శాఖాధికారి సమర్ధవంతంగా తమ విధులను నిర్వర్తించాలని టెక్కలి డివిజన్ రెవెన్యూ అధికారి ఎస్.్భస్కరరెడ్డి అన్నారు. మండలం తహశీల్దార్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తనకు ఈ ఉత్సవాలు కొతె్తైనా చాలా మంది అధికారులు పాతవారే కనుక సుదూర ప్రాంతాలనుండి వచ్చే వేలాది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కల్గకుండా చూసుకోవాలని ఆర్డీవో అన్నారు. స్వామిని దర్శించేందుకు వివిధ ప్రాంతాలనుండి వచ్చే భక్తులకు దేవాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి వివి ఎస్ నారాయణను ఆర్డీవో అడిగితెలుసుకున్నారు. ప్రతీ శాఖాధికారితో చర్చించారు. భక్తులకు తాగునీరు, గ్రామపొలిమేరల్లో మలమూత్ర విసర్జనశాలలు ఏర్పాటుచేయాలని, నదిలో జరిగే చక్రతీర్థ స్నాన సమయాల్లో క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు ఏవిధంగా చేపట్టాలని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా, గ్రామంలో ప్రతీ క్షణం పారిశుద్ధ్య కార్యక్రమాలు జరిగేలా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు తహశీల్దార్ డి. ఎల్లారావు, ఎంపీడీవో కె.ప్రభాకరరావు, జలుమూరు వైద్యాధికారి తాడేల శ్రీకాంత్, పంచాయతీ విస్తరణాధికారి కొమరాపు అప్పలనాయుడు, ఆరోగ్య, విద్యుత్, రక్షణ, అగ్నిమాపక సిబ్బంది, ఆర్‌డబ్ల్యు ఎస్ జే ఈ నాగభూషణ్, రెవెన్యూ పరిశీలకులు చిన్నారావు, త్యాగరాజు, పలువురు గ్రామరెవెన్యూ అధికారులు, శ్రీముఖలింగం పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి పలువురు పాల్గొన్నారు.

విద్యతో వినయవిధేయతలు విద్యార్థులకు అవసరం
జలుమూరు, ఫిబ్రవరి 21: విద్యార్థులు కళాశాలలో కేవలం విద్య నేర్చుకోవడమే కాకుండా విద్యతోపాటు వినయవిధేయతలు అవసరమని విశ్రాంతి ప్రభుత్వ ప్రిన్సిపాల్ కోన గాలిమోహనరావు అన్నారు. జలుమూరు ఎస్‌కెపి ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోగురువారం నిర్వహించిన ఫేర్‌వెల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జలుమూరు కళాశాలకు ఐదు దశాబ్ధాలు దాటిన చరిత్ర ఉందని, ఇక్కడ చదివే ఎందరో విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారని అన్నారు. ప్రస్తుత తరుణంలో విద్యార్థినీ, విద్యార్థులు మంచి మార్గంలో నడిచి అటు తల్లిదండ్రులకు, ఇటు కళాశాలకు పేరు ప్రఖ్యాతులు తేవాలని సూచించారు. స్థానిక ప్రిన్సిపాల్ ప్రగఢ దుర్గారావుమాట్లాడుతూ ఇదే కళాశాలలో చదువుకున్న తాను ఇక్కడే ప్రిన్సిపాల్‌గా పనిచేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ప్రశాంతతకు, విద్య లక్ష్యాలను సాధించుటకు జలుమూరు కళాశాల చక్కనైనదని, రాష్ట్రంలో ఎంతో గుర్తింపు లభించిందని అన్నారు. దివంగత కోన పెంటమ్మ గతంలోస్థలదాతగా ముందుకు వచ్చినందున ఇంత మారుమూల గ్రామంలోకళాశాల ఏర్పాటు జరిగిందని ఆమె ధాతృత్వంతోనే ఇంతమంది విద్యార్థులకు నేడు బతుకుదారి ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తి,విద్య అధ్యాపకులు మచ్చ నిరంజన్, పలువురు అధ్యాపకులు, కళాశాల స్థలదాత వారుసుడు దొరబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న నృత్యప్రదర్శనలు, లఘునాటికలు
జలుమూరు, ఫిబ్రవరి 21: మండలం చల్లవానిపేట జంక్షన్ సమీపంలో ఉన్న వంశధార డిగ్రీ కళాశాలలో గురువారం ఘనంగా ఫేర్‌వెల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు, లఘునాటికలు పలువురిని ఆకట్టుకొన్నాయి. ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు నిర్విరామంగా సాగింది. ముందుగా ఏర్పాటుచేసిన సమావేశంలో డైరెక్టర్ శాసనపూరి మధుబాబు, ప్రిన్సిపాల్ సూర్యనారాయణ, పలువురు కళాశాల అధ్యాపకులు విద్యార్థులకు పలు సూక్తులు అందజేశారు. కళాశాల ప్రారంభం నేటికి సాధించిన ప్రగతి, పలు అంశంలపై ఎమ్‌డీ మధుబాబు వివరించారు.