శ్రీకాకుళం

‘సమన్వయం’ సత్తా చూపేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఎన్నికల వ్యూహానికి పదునుపెట్టేలా..నేతల సమన్వయం సత్తా చాటిచెప్పేలా..రాజకీయ సమరానికి సై చెప్పేందుకు జిల్లా తెలుగుదేశం పార్టీ సన్నద్ధం అవుతోంది. జిల్లాలో పది నియోజకవర్గాలకు పదీ విజయం సాధించడంతోపాటు, పార్లమెంటు నియోజకవర్గాలు విజయఢంకా మ్రోగించేలా ప్రత్యేక కార్యాచరణకు అంకురార్పణం మూహూర్తం నిర్ణయించారు. నేతలు, కార్యకర్తల మధ్య గల పొరపొచ్చలు తొలగించేందుకు జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేయనున్న ప్రయత్నానికి ఇన్‌ఛార్జి మంత్రి పితాని సత్యన్నారాయణ సారథ్యంలో మరోసారి టీడీపీ బలాన్ని, బలగాన్ని జిల్లా రాజకీయ పార్టీలకు, అందులో పనిచేసే నేతలు, కార్యకర్తలకు చూపించేలా జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఎన్టీఆర్ భవన్ సిద్ధమవుతోంది. సిక్కోల్ రాజకీయాలు సంకుల సమరానికి సై అంటూ..జిల్లా తెలుగుదేశం పార్టీ మరోసారి తమ సత్తా చూపేలా జిల్లా విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించేందుకు సన్నద్ధం అయ్యింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పితాని సత్యన్నారాయణ, మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళావెంకటరావు, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా తు.చ.తప్పకుండా హాజరుకావాలంటూ ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శీరిషా ఆహ్వానం పంపారు. మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అనే రీతిలో పోటీపడతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలో పోటాపోటీగా చేరికలు ఉంటున్నాయి. వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి హామీలకు పరిమితమయ్యే పరిస్థితి ఉంటేం అధికార పార్టీయైన టీడీపీకి మాత్రం హామీలతోపాటు అమలు కూడా అవకాశం ఉండటం వల్ల వారి కలిసోచ్చే అంశం. ఆ అవకాశానికి మరికొద్ది గంటల్లో 3కోడ్2కళ్ళేం వేసే సమయం. ఈ నేపథ్యంలో జిల్లా విస్తృతస్థాయి సమావేశం నుంచి నేతల మధ్య గల పొరపొచ్చలు లేవంటూ నిన్న,మొన్నటి రోజుల్లో జరిగిన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో మంత్రులు అచ్చెన్న, కళా, విప్ కూన రవికుమార్‌లు కలిసి కన్పించడంతోనే సిక్కోల్ రాజకీయాల్లో మళ్ళీ సమన్వయం కన్పిస్తుందన్న మాట వినిపించకనే వినిపించింది. అటువంటి అనుకూల పరిస్థితుల నడుమ టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదేళ్ళు అమలుచేసిన సంక్షేమపథకాలు ప్రజలకు వివరించే విధానాలు చర్చించడంతోపాటు, కొద్దిరోజులుగా ఎన్నికల వరాలుగా ఇచ్చే పథకాలు ప్రజలకు అందించేలా ప్రతీ కార్యకర్తకు తమ బాధ్యతను సవివరంగా చెప్పేందుకు ఈ సమావేశం ప్రధానంగా వినియోగించుకునేలా ఇన్‌ఛార్జి మంత్రి పితాని సత్యన్నారాయణ రూపకల్పన చేసినట్టు 3ఆంధ్రభూమి2కి చెప్పారు. ఇప్పటికే అన్నదాతల మనుసు గెలుచుకున్న బాబు ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ, డ్వాక్రా అక్కచెల్లెళ్ళ నచ్చేలా పసుపు-కుంకుమా, పింఛన్లు రెట్టింపు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు టీడీపీకి ఓటు వేసేలోపే వారి కుటుంబాలకు ఈ పథకాలన్నీ చేరాలంటే టీడీపీ వశుధైకకుటుంబం చేయాల్సిన విధివిధానాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు వివరించారు. ఎవరూ ఊహించని రీతిలో సంక్షేమంపై బాబు దృష్టి పెట్టడం, మరోవైపు బీసీల్లో ప్రతీ కులానికి కార్పొరేషన్ పెట్టే దిశగా అడుగులు వేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచాయన్నారు. ఎన్నికల ముందే ఇలా వరాలు ప్రకటిస్తున్న టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అని ప్రజల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాని మంత్రి పితాని పేర్కొన్నారు. అలాంటి అంచనాలు చేరుకునేందుకు పార్టీలకు నిచ్చనలా ఉపయోగపడేది మాత్రం 3మానిఫెస్టో2నే అని చెప్పారు. అటువంటి మానిఫెస్టో కమిటీలో జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ముఖ్యమంత్రి స్థానం కల్పించారన్నారు. అచ్చెన్న ఆలోచనలు, అమలుచేసే విధానంలో వ్యూహాత్మక ఎత్తుగడలు సిక్కోల్ నేతకు దక్కిందన్నారు. టీడీపీ - వైసీపీ పార్టీలు ఎన్నికలకు సై అంటున్న వేళ ప్రజల మనసు గెలుచుకునేలా మెనిఫెస్టోని తయారు చేయడం వారికి కత్తిమీద సామే..అయితే ఇప్పటికే సంక్షేమంలో ఎన్నో మెట్లు ఎక్కిన టీడీపీ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుందని సర్వత్రా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే ఆ బాధ్యతను ఇప్పుడు యనమల నేతృత్వంలోని బృందంపై బాబు పెట్టారని అన్నారు. మొత్తం 15 మందితో మెనిఫెస్టో కమిటీని ప్రకటించారని చెప్పారు. ఇలా..బాబు మళ్ళీ మీరే రావాలి..అంటూ టీడీపీ జిల్లా పార్టీ పండుగకు ఆరంభ కార్యక్రమమే ఎన్నికల పార్టీ సమన్వయకమిటీ సమావేశం ప్రధాన అంశమని మంత్రి పితాని వివరించారు.