శ్రీకాకుళం

ఐదేళ్లు అవకాశమిస్తే వందేళ్ల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరుబుజ్జిలి, మార్చి 14: రానున్న ఎన్నికల్లో నిరంతర శ్రామికుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే రాష్ట్రం వందేళ్లు అభివృద్ధి సాధిస్తుందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. గురువారం సరుబుజ్జిలి మండల టీడీపీ అధ్యక్షులు లావేటి పూర్ణారావు అధ్యక్షతన మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎంపీ, ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలతో దేశంలోనే సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రకెక్కారన్నారు. డ్వాక్రా మహిళలకు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించిన దాఖలాలు ఏ రాష్ట్రంలో లేవని, ఒక్క ఆంధ్రాలోనే ఈ పథకం రూపుదిద్దుకోవడం జరిగిందన్నారు. అలాగే రాష్ట్ర రాజధాని, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్రం అభివృద్ధి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ప్రతికార్యకర్త ఒక సైనికుల్లా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఏ శక్తులూ అడ్డుకోలేవని వారన్నారు. ఈ సమావేశానికి మండలంలోని 21 గ్రామ పంచాయతీల నుంచి తెలుగుదేశం శ్రేణులు పోటాపోటీగా సభా వేదిక వద్దకు చేరుకోవడంతో జనసందోహంగా మారింది. మండలంలో మూలసవలాపురం గ్రామం నుంచి సీనియర్ నాయకులు ఈశ్వరరావు, 400 మంది ప్రజలతో ర్యాలీగా వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సమావేశంలో చిగురువలస, కొత్తకోట, గోనిపాడు, మతలబుపేట, తురకపేట, చినవెంకటాపురం, రావివలస గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 200 కుటుంబాలు టీడీపీలో చేరగా, వీరికి విప్ రవికుమార్, ఎంపీ రామ్మోహన్‌నాయుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అలాగే విశ్రాంత ఆర్డీవో పి. ఎం.జె.బాబు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నందివాడ గోవిందరావు, టీడీపీ నాయకులు శివ్వాల సూర్యనారాయణ, సిద్దార్థ, కూన గణపతిరావు, అంబాళ్ల రాంబాబు సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నాయకులు ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, ఏ ఎంసీ చైర్మన్ పల్లి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయం వద్ద అపారిశుద్ధ్యాన్ని తొలగించండి
పాలకొండ (టౌన్), మార్చి 14: నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న శాఖాగ్రంథాలయం పరిసర ప్రాంతాల్లో అపారిశుద్ధ్యాన్ని తొలగించి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని గ్రంథాలయాల జిల్లా సెక్రటరీ జి.తిరుమలకుమారి అన్నారు. గురువారం ఆమె శాఖాగ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠకులకు అందుతున్న దినపత్రికలు, నిరుద్యోగులకు అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలు నిర్వహణ పట్ల శాఖా గ్రంథాలయాధికారి బబ్బురు గణేష్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెతో పాటు అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎస్.వి.రమణమూర్తి ఉన్నారు.