శ్రీకాకుళం

ఎవోబీలో.. శాంతియుతంగా ఎన్నికల నిర్వహించాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 14: ఆంధ్ర, ఒడిషా రాష్ట్రాల్లోనూ శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జనార్థన్ నివాస్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒడిషాలోని గంజాం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఇంటర్ స్టేట్ బోర్డర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలోని ఇచ్చాపురం, సోంపేట, కంచిలి, మందస, కవిటి మండలాలు గంజాం జిల్లా సరిహద్దుల్లో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా గంజాయి, నాటుసారా, నగదు రవాణపై నిఘా ఉంచామని తెలిపారు. ఇందు నిమిత్తం ఆరు చెక్ పోస్టులను ఏర్పాటు చేసామన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎ.వెంకటరత్నం మాట్లడుతూ, 20 కిలోల గంజాయి, డాక్యుమెంట్లు లేకుండా రవాణా అవుతున్న నగదును స్వాధీనం పరుచుకున్నట్లు తెలిపారు. గంజాం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒడిషాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్రాలోని ఇచ్చాపురం సరిహద్దులో ఉన్నట్లు తెలిపారు. లిక్కరు, నగదు రవాణాపై గట్టి నిఘా ఉంచామని, రెండు రాష్ట్రాలలోనూ ఎన్నికలు శాంతియుతంగాను, సజావుగాను జరగడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. బరంపురం పోలీసు సూపరింటెండెంట్ మాట్లాడుతూ 0885944944 ఫోనులో అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ సమావేశానికి గంజాం కలెక్టర్ విజయ్ అమృత కోరంగి, ఎస్పీ త్రినాథ్, ఇచ్చాపురం రిటర్నింగ్ అధికారి సీతామహాలక్ష్మీ, స్పెషల్‌బ్రాంచి డి.ఎస్పీ కృష్ణవర్మ, ఎక్సైజ్ ఇంచార్జి డిప్యూటీ కమిషనర్ సుఖేష్, పలాస ఎక్సైజ్ అధికారులు, తదితరులు హాజరయ్యారు.

నేటి నుంచి విద్యార్థులకు ఒంటిపూట బడులు
ఆమదాలవలస, మార్చి 14: జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల ప్రకారం ఈనెల 12నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రకటిస్తున్నట్లు స్థానిక మండల విద్యాశాఖాధికారి కె.చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఇక్కడ విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఒంటిపూట బడులకు టైంటేబుల్ ప్రకటించామని, ఇందులో భాగంగానే ఉదయం 7.45నిమిషాల నుండి మధ్యాహ్నం 12.30వరకు పాఠశాలలు నిర్వహించవల్సివుంటుందని ఆయన తెలిపారు. అలాగే 10గంటల నుండి 10.20వరకు ఇంట్రెవెల్ ఇవ్వాలని, ఈ ఉత్తర్వులను అన్ని పాఠశాలలు విధిగా నిర్వహించాలని ఆయన తెలిపారు.
10వ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం:
ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఏపి ఎస్ ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని మండల విద్యాశాఖాధికారి ఎమ్ ఈవో చంద్రశేఖరరావు తెలిపారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను చూపించి ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కాంగ్రెస్, జనసేన పార్టీలకు అభ్యర్థులు కావలెను
ఆమదాలవలస, మార్చి 14: వచ్చేనెల 11న జరగనున్న స్థానిక శాసనసభ స్థానం ఎన్నికలకు గాను కాంగ్రెస్, జనసేన పార్టీలకు ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అభ్యర్థులు కావలెను. తెలుగుదేశం, వైసీపీ రెండు ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఎంపిక దాదాపు ఖరారుఅయి పూర్తయినప్పటికి కాంగ్రెస్, జనసేన పార్టీలు అధిష్టానాలు అభ్యర్థుల కోసం వెతుకులాట సాగిస్తుంది. టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కూనరవికుమార్, వైసీపీ తరుపున తమ్మినేని సీతారాం ఎన్నికల బరిలో పోటీ పడుతూ ఇప్పటికే చేపకింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు. నియోజకవర్గంలో ఎంతో చరిత్ర గలిగిన కాంగ్రెస్ పార్టీకి ఒకనాడు కంచుకోటగా ఉన్న ఆమదాలవలస నియోజక వర్గం సరైన నాయకత్వం లేకపోవడంతో నిర్వీర్యంగా మారింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కుటుంబీకులు ఈసారి ఎన్నిలకు దూరంగా ఉండడంతో కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు చెల్లా చెదురవుతున్నారు. వైసీపీ, టీడీపీ పార్టీల అభ్యర్థులు హోరాహోరీ పోరులో తాము గెలిచే అవకాశం లేదని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముద్రతోనే తటస్థంగా ఉంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు నామినేటెడ్ పోస్ట్‌లు వచ్చే అవకాశం వుంటుందని స్థానిక మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి ఆలోచిస్తున్నట్లు తెలుస్తొంది. ఇక జనసేన, బీజేపీ నాయకులకు నియోజకవర్గంలో సరైన పట్టులేకపోవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు కొద్దిపాటి ప్రచారానికే పరిమితమవుతున్నారు.

గ్రామదేవత ఆశీస్సులతో ఎమ్మెల్యే ప్రచారం
జలుమూరు, మార్చి 14: నరసన్నపేట ఎమ్మెల్యేగా టీడీపీ తరుపున రెండవసారి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆయన జన్మించిన మండలం మర్రివలస గ్రామంలో గ్రామదేవతను గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు చేపట్టి ప్రచారాన్ని సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో ప్రతీ కార్యకర్త పట్టుదల,కృషితో శాసనసభ్యునిగా గెలిపించారని, మీ సమస్యల పరిష్కారానికి ఐదేళ్లుగా కృషి చేశానని స్పష్టం చేశారు. ఏ శాసనసభ్యుడు చేయని అభివృద్ధి తాను చేపట్టానని, మళ్లీ అవకాశం ఇస్తే సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని అన్నారు. రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గం నరసన్నపేటని నిలిచేలా చేస్తానని అన్నారు. ముందుగా సాంప్రదాయ పద్దతిలో గ్రామదేవతకు ముర్రాటలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయనతో పాటు ఆయన సతీమణి బగ్గు సుగుణ అందరిని ఆప్యాయతగా పలకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎంసీ అధ్యక్షులు వెలమల చంద్రభూషణ, మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, మండల జన్మభూమి కన్వీనర్ బగ్గు గోవిందరావు, ఆ పార్టీ నేతలు బలరాం, పొన్నాడ బాలయ్య, దుంగ స్వామిబాబు, మునుకోటి దామోధరరావు,పంచిరెడ్డి త్రినిధరావు, పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం మర్రివలస పంచాయతీలో పలు గ్రామాల్లో ఆయన ఇంటింటా ప్రచారాలు నిర్వహించారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
* తహశీల్దార్ ఎల్లారావు
జలుమూరు, మార్చి 14: మరికొద్ది రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను గ్రామస్థాయిలో సజావుగా, సక్రమంగా జరిగేలా చూడాలని జలుమూరు తహశీల్దార్ డి.ఎల్లారావు అన్నారు. మండలం తహశీల్దార్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ అధికారుల ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. ప్రతీ గ్రామంలో ఎన్నికల నిబంధనల మేరకు మన విధులను సక్రమంగా నిర్వహించాలని ఎటువంటి రాజకీయాల ఒత్తిళ్లకు తలదించకూడదని, ఎటువంటి పిర్యాదులు వచ్చినా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొంటామని అన్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు రెవెన్యూ పరిశీలకులు రావాడ త్యాగరాజు, చిన్నారావు, పలువురు రెవెన్యూ అధికారులు, సహాయ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు
సారవకోట, మార్చి 14: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు గురువారం చదువుల తల్లి సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన వీడ్కోలు సభలో విద్యార్థీ, విద్యార్థినులు ఆటాపాటలతో అలరించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సమయపాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీడీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
సారవకోట, మార్చి 14: గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు నాయకత్వంలో గల టీడీపీ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించిందని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి సాధుచిన్నికృష్ణమనాయుడు వివరించారు. పార్టీ అభ్యర్థి, ప్రస్తుత శాసనసభ్యుడు బగ్గురమణమూర్తికి మద్దతుగా గురువారం పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించడానికి టీడీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని తర్లి, చోడసముద్రం, కిడిమి తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీబీ ఎన్ ఆర్టీ ఇంఛార్జ్ సురవరపు తిరుపతిరావు, నీటి సంఘం అధ్యక్షుడు చిన్నాల మాధవరావు, పలువుర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వైసీపీలో భారీ చేరికలు
పాతపట్నం, మార్చి 14: పాతపట్నం మండలంలో వైసీపీ తనయొక్క ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో తమ ప్రచారాన్ని ముఖ్యంగా పాతపట్నం పంచాయతీలో గత రెండు రోజులుగా ప్రతీ వీధిలో ఇంటింటా ప్రచారం కొనసాగించారు. మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండల సింగుపురం పంచాయతీ, బోరుభద్ర పంచాయతీలోమాజీ సర్పంచ్‌లుతో సహా అధిక సంఖ్యలో చేరికలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎస్టీ పంచాయతీ అయిన ఎస్ ఎస్ మనుగులో అధిక సంఖ్యలో ప్రజలు వైసీపీ నాయకురాలు రెడ్డి శాంతి సమక్షంలో చేరికలు జరుగుతున్నాయి. పాతపట్నం పంచాయతీకి వచ్చేటప్పుడు సవిరిగామ ప్రదీప్‌కుమార్, లింగాల ఉషారాణిల ఆధ్వర్యంలో ప్రతీ వీధి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా పార్టీలో చేరికలు విరివిగా సాగిస్తున్నారు. పార్టీ నాయకురాలు రెడ్డిశాంతికి హారతులిచ్చి ప్రజలు సాగనంపుతున్నారు. ఈ కార్యక్రమంలో పడాల గోపి, రెడ్డి రాజు, గంగు వాసుదేవరావు, బొచ్చునారాయణమూర్తికొండాల నర్శింహారావు తదితరులున్నారు.