శ్రీకాకుళం

స్క్రూటీనీలో గౌతు, సీదిరిల నామినేషన్ తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, మార్చి 26: నామినేషన్‌ల పరిశీలనంతరం గౌతు విజయలక్ష్మి, సీదిరి శ్రీదేవి, ఎన్.అప్పలరాజు, కోత అరుణకుమారి, అప్పలరాజురెడ్డి, గొరకల రుక్మిణిల నామినేషన్‌లను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి అనిత తెలిపారు. స్క్రూటీనీ అనంతరం 36 నామినేషన్‌ల సెట్లుకు గాను 15 మంది అభ్యర్థులకు గాను ఆరుగురు నామినేషన్‌లు తిరస్కరణకు గురైనాయని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు సకాలంలో పత్రాలు దాఖలు చేయకపోవడంతో ఈ నామినేషన్‌లను తిరస్కరించినట్లు ఆమె తెలిపారు.

పసుపుదండు ర్యాలీ అదరహో
పలాస, మార్చి 26: ఎన్నికల ప్రచార నిమిత్తంలో భాగంగా పలాసకు విచ్చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషాల ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విచక్రవాహనాల ర్యాలీతో కెటిరోడ్డు పసుపుమయంగా మారింది. నారా లోకేష్ హెలికాప్టర్‌లో పలాస జిజేకాలేజికి చేరుకొని అక్కడ నుంచి వేలాది మంది తెలుగుతమ్ముళ్లు సహచరంతో ద్విచక్రవాహనాలతో ర్యాలీగా హరిపురంకు చేరుకున్నారు. ఈ ర్యాలీ కెటిరోడ్డు మీదుగా కొనసాగడంతో పట్టణానికి పసుపుపూసారా, పసుపుదండు వచ్చిందా అనే చందంగా టీడీపీ శ్రేణులు నభూతోనభవిష్యత్తుగా నిర్వహించారు. ఈ ర్యాలీలో నారా లోకేష్ ప్రజలకు అభివాదం చేస్తూ ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌతు శిరీషా పోటీ చేస్తున్నారని, వారి విజయానికి ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని కోరారు.

కూన రవికుమార్‌ను గెలిపించండి
సరుబుజ్జిలి, మార్చి 26: ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. మంగళవారం మండలంలోని షలంత్రి పంచాయతీ బురుగువలస గ్రామంలో ఎన్నికల ప్రచారం అభ్యర్థి తరపున నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి చంద్రబాబు పేద ప్రజలు, మహిళలు, రైతులు, ఇతర వర్గాలు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించి ఓట్లును అభ్యర్ధించారు. అలాగే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గ్రామాల్లో సీసీ రహదారులు, ఎల్ ఈడీ బల్బులు వంటి వౌళిక సౌకర్యాలు వచ్చాయన్నారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు పల్లి భాస్కరరావు, శివ్వాల సూర్యనారాయణ, లావేటి పూర్ణారావు, కూన గణపతిరావు, గుర్రాల చినబాబు, కె.సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు, గోవిందరావు, రాంబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు.