శ్రీకాకుళం

టీడీపీని ఓడించేందుకు ముగ్గురు దొంగలు డ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస/మందస, మార్చి 26: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు ముగ్గురు దొంగలు కుట్రపన్నుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. 32 కేసుల్లో 16 జైలుశిక్ష అనుభవించిన జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే టీడీపీ అధినేత చంద్రబాబు కావాలా, ఫ్యాక్షనిస్టు జగన్ కావాలా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేక హెలీకాప్టర్‌లో పలాసకు విచ్చేసి అక్కడ నుంచి ద్విచక్రవాహనంపై నారా లోకేష్ హరిపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు చేరుకున్నారు. నారా లోకేష్‌కు తెలుగుతమ్ముళ్లు ఏరువాక గుర్తును అందజేసి రైతన్నలను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీని ఓడించేందుకు జగన్ కెసీ ఆర్, మోడీతో కుమ్మక్కై వైసీపీ కోసం కేసీ ఆర్ 1000 కోట్ల రూపాయలు అందించారన్నారు. పసుపుకుంకుమలను నిలబెట్టేవాడు కావాలా, పసుపుకుంకుమలు తీసే ఫ్యాక్షనిస్టు కావాలా అని ప్రశ్నించారు. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో సీ ఎం నడిపారని, అభివృద్ధి, సంక్షేమానికి టీడీపీకి రెండు కళ్లు అని అన్నారు. జూన్ నుంచి పింఛన్ 3 వేల రూపాయలు చేస్తామని, టీడీపీ హాయంలో ప్రవేశపెట్టిన 120 సంక్షేమ పథకాలతోపాటు భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదవాడిని లక్షాధికారి తయారుచేయడమే టీడీపీ లక్ష్యమన్నారు. తిత్లీ తుపాన్ ధాటికి సిక్కోలు విలవిలాడిపోతే ప్రక్క జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు కనీసం ఓదార్చాడానికి రాలేదని గుర్తు చేసారు. తిత్లీ తుపాన్ సయయంలో ప్రజలు చూపిన అనురాగ అభిమానానికి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ కోడికత్తి డ్రామా ఆడి, సీ ఎం సీటుపై వ్యామోహంతో పాదయాత్రలు, రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వివిధ సామాజిక వర్గాలవారికి 24 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి వారి అభివృద్ధి చేసామన్నారు. మత్స్యకారులు కోసం 50 ఏళ్లుకు పింఛన్లు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పలాస టీడీపీ అభ్యర్థి గౌతుశిరీషా, నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్నచౌదరి, టీడీపీ నాయకులు జికెనాయుడు, వజ్జ బాబురావు, గాలి కృష్ణారావు, లోడగల కామేశ్వరరావు, డి.జయలక్ష్మి, డి.తాతారావు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో జుత్తు సతీమణి చేరిక
మందస, మార్చి 26: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం హరిపురంలో నిర్వహించిన బహిరంగసభలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు సతీమణి,రాష్ట్ర వైసీపీ మహిళ విభాగపుప్రధాన కార్యదర్శి జుత్తు ధనలక్ష్మి, మాజీ ఎంపీపీ బత్తిన హేమశ్వరరావు, మాజీ సర్పంచ్‌లు గురుమూర్తి, జుత్తు విజయలక్ష్మిలతోపాటు పలువురు ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. సీ ఎం పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషా, ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు విజయానికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. టీడీపీలో చేరిన వారిలో రామారావు, జుత్తు కూర్మారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.