శ్రీకాకుళం

స్వీప్ కార్యక్రమాల ద్వారా అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం,మార్చి 26: స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించనున్నట్ల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జనార్ధన్ నివాస్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఓటింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈవీఎమ్‌లు, వీవీ ప్యాట్‌లపై మారుమూల గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్గించే నిమిత్తం స్వీప్ నోడల్ అధికారి కెవి ఎన్ చక్రధరబాబు అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. ఫ్లాష్‌మాబ్ హాట్ ఎయిర్ బెలూన్స్ లను తయారుచేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాలలో వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే నిమిత్తం వారికి వలంటీర్ల ఏర్పాటు, వాహన సదుపాయాలు, రైలింగ్ వంటి సదుపాయాలను కలుగజేయనున్నామని చెప్పారు. బ్రెయిలీ బ్యాలెట్ పేపర్ ద్వారా అంధుడు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ స్వీప్ కార్యక్రమానికి నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ కె.వి. ఎన్ చక్రధరబాబు, జేసీ-2 పి.రజనీకాంతారావు, డీపీ ఆర్వో ఎల్.రమేష్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి
* స్వీప్ నోడల్ అధికారి చక్రధరబాబు

శ్రీకాకుళం,మార్చి 26: ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని ఎన్నికల స్వీప్ నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ కె.వి. ఎన్ చక్రధరబాబు తెలిపారు. మంగళవారం స్థానిక పొట్టిశ్రీరాములు జంక్షన్ వద్ద మోడల్ బెలూన్ ఈవీ ఎమ్, వీవీ ప్యాట్, కంట్రోల్ యూనిట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శత శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోడానికి స్వీప్ ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. 2019 సాదారణ ఎన్నికల్లో కొత్తగా వీవీ ప్యాట్‌లను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. వీవీ ప్యాట్ ద్వారా ఓటు వేసిన అభ్యర్థుల వివరాలు కన్పిస్తాయన్నారు. ఈసారి ఎన్నికల్లో బ్యాలెట్‌పేపర్‌పై అభ్యర్థుల ఫొటోలను ముద్రించడం జరిగిందని తద్వారా ఓటు వేయడం మరింత సులభతరం కానున్నదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో బుర్రకథలు, వాహనాల్లో ఆడియో, వీడియో ద్వారా ప్రజలకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలలోను, ఆర్టీసీ కాంప్లెక్స్, ఉపాధి హామీ పనులు చేసే ప్రాంతాలలో సైతం అవగాహన కల్గించునున్నామన్నారు.యువతను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు. ముఖ్య కూడలిల్లో హోర్డింగులు పెడుతున్నామని, అన్ని పోలింగ్ కేంద్రాలలోను మంచినీరు, విద్యుత్, రైలింగ్ వంటి వౌళిక సదుపాయాలను కల్పిస్తున్నామని, వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 11న ఉదయం 6గంటలకు మాక్‌పోల్‌తో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నదని, 7గంటల నుండి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నదని చెప్పారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి అబ్జర్వర్‌లు వచ్చారని తెలిపారు. జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశామన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అనుసరించాలన్నారు. 24గంటలు ముందుగా అనుమతులను సిబిదా యాప్ ద్వారా అనుమతులను పొంది ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని చెప్పారు. ఈకార్యక్రమానికి నగర పాలక సంస్థ కమీషనర్ ఆర్.శ్రీరాములునాయుడు, సహాయ కమీషనర్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.