శ్రీకాకుళం

పార్లమెంట్ అభ్యర్థుల పరిశీలనలో నలుగురు తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం,మార్చి 26: శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికలకు వేసిన నామినేషన్‌లలో నలుగురు అభ్యర్థుల నామినేషన్‌లను తిరస్కరించారు. నామినేషన్ల ఘట్టం 25వ తేదీన ముగియగా మంగళవారం అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జనార్ధన్ నివాస్ పరిశీలించారు. పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల పోటీల్లో 13 మంది అభ్యర్థులు నామినేషన్‌లు వేయగా పరిశీలన అనంతరం నాయుడుగారి రాజశేఖర్ (స్వతంత్య్ర అభ్యర్థి), కింజరాపు రామ్మోహన్‌నాయుడు (టీడీపీ), మెట్ట రామారావు (జనసేన), డోల జగన్మోహనరావు (కాంగ్రెస్), బేత వివేకానంద మహారాజ్ (స్వతంత్య్ర అభ్యర్థి), దువ్వాడ శ్రీనివాస్ (వైసీపీ), పేర్ల సాంభమూర్తి (బీజేపీ),మట్ట సతీష్ చక్రవర్తి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), నంబాళ్ల కృష్ణమోహన్ (స్వతంత్య్ర అభ్యర్ధి), నామినేషన్లు సరిపోయినట్లు ధృవీకరించారు. తిరస్కరించిన నామినేషన్లలో కింజరాపు విజయకుమారి (టీడీపీ), దువ్వాడ వాణి (వైసీపీ), పేర్ల కౌశిక్ (బీజేపీ), సాగిపల్లి ప్రసాదరావు ( ఇండియా ప్రజాబంధు పార్టీ) ఉన్నారు. విజయకుమారి, దువ్వాడ వాణి, కౌశిక్ నామినేషన్లును బి ఫారంతో ప్రధాన అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉండడంతో తిరస్కరించగా సాగిపల్లి ప్రసాదరావు 3 ఎ ఫారం సమర్పించకపోవడం, అభ్యర్ధిత్వాన్ని బలపర్చిన నలుగురు అభ్యర్థుల వివరాలు ఓటరు జాబితాలోని వివరాలకు సరిపోకపోవడం వలన తిరస్కరించడం జరిగింది.

నీతివంతమైన పాలనను సమర్ధించండి
* గుండ విశ్వనాధ్
శ్రీకాకుళం(రూరల్),మార్చి 26: నీతివంతమైన పాలనను సమర్ధించాలని గుండ లక్ష్మీదేవి తనయుడు గుండ విశ్వనాధ్ కోరారు. మండలంలోని నైర పంచాయతీ చల్లవానిపేట గ్రామంలోఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధి హామీ వేతనదారులతో మాట్లాడారు. నీతివంతమైన పాలన ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అందించారని, ఇటువంటి పాలన కొనసాగించాలంటే ఎమ్మెల్యేగా మళ్లీ లక్ష్మీదేవిని పార్లమెంట్ సభ్యులుగా కింజరాపు రామ్మోహన్‌నాయుడును గెలిపించేందుకు సైకిల్ గుర్తుపై ఓటు వెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీర రమణ, చిట్టి మోహన్, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, కలగ శివ, కనుగుల శివ, తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల ప్రచార రథం ప్రారంభం

శ్రీకాకుళం,మార్చి 26: ఓటర్ల ప్రచార వాహనాలకు మంగళవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జనార్ధన్ నివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలు గ్రామాల్లో తిరిగి ఓటర్లను చైతన్యవంతులను చేస్తారు. ఓటు వేసే విధానం గూర్చి తెలియజేస్తారు. ఈకార్యక్రమంలో జేసీ, స్వీప్ నోడల్ అధికారి కె.వి. ఎన్ చక్రధరబాబు, జేసీ-2 పి.రజనీకాంతారావు తదితరులున్నారు.