శ్రీకాకుళం

చంద్రబాబును మళ్లీ ఆశీర్వాదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోంపేట, ఏప్రిల్ 9: తెలుగుదేశం పార్టీని ప్రగతి సాధ్యమని, గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఈ నాలుగున్నర ఏళ్లులో సాధించామని మళ్లీ చంద్రబాబును ఆశీర్వాదించి సీ ఎం పీఠంలో కూర్చొబెట్టడానికి ప్రజలు సహకరించాలని టీడీపీ నాయకులు సూరాడ చంద్రమోహన్, చిత్రాడ శ్రీనివాస్, ఆర్.కోదండకృష్ణ, భాస్కరరావులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలో 23 పంచాయతీల్లో నిర్వహించిన ప్రచారాన్ని నిర్వహించారు. రాష్టవ్య్రాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమపథకాలు మళ్లీ టీడీపీ పార్టీని గెలిపిస్తాయన్నారు. ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే టీడీపీ గెలుపు చారిత్రిక అవసరమని, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రామ్మోహన్‌నాయుడు, అశోక్‌లను గెలిపించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసారు. మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలే టీడీపీకి శ్రీరామరక్ష
సరుబుజ్జిలి, ఏప్రిల్ 9: బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్షగా మారనున్నాయని ఆమదావలస అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన రవికుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని సింధువాడ, వీరమల్లిపేట, కొండ్రగూడ, డకరవలస, సుభద్రాపురం, తమ్మినాయుడుపేట పాఠశాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఉత్సాహభరితంగా రవికుమార్‌కు ఘన స్వాగతం పలకడంతో పాటు బాణాసంచాల కాల్చుతూ మహిళలు నృత్యంతో ప్రచారాన్ని వేడెక్కించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరంతరం శ్రామికుడిగా శ్రమించి రాష్ట్భ్రావృద్ధికి ఎంతో కృషిచేశారన్నారు. రైతు పక్షపాతిగా రైతు రుణమాఫీతో పాటు అన్నదాత సుఖీభవ, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ, రూ.2 వేలు పింఛన్ వంటి పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. 11న జరగనున్న ఎన్నికల్లో టీడీపీకి బాసటగా నిలవాలని కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు శివ్వాల సూర్యనారాయణ, టి.సురేంద్ర, తాడేల వెంకటరమణ, దేశల్ల రామారావు, ఎన్ని శ్రీదేవి, అప్పలనాయుడు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

తమ్మినేని దత్తత గ్రామంలో టీడీపీ పాగా
సరుబుజ్జిలి, ఏప్రిల్ 9: ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆమదాలవలస వైకాపా అసెంబ్లీ అభ్యర్ధి తమ్మినేని సీతారాం దత్తత గ్రామమైన వీరమల్లిపేటలో టీడీపీ పాగా వేసింది. గతంలో రాష్ట్ర మంత్రిగా తమ్మినేని ఉన్నప్పుడు వీరమల్లిపేట గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ఆ గ్రామంలో ఉన్న ఓటర్లు తమ్మినేని ఏ పార్టీలో ఉంటే అదే పార్టీకి మద్దతు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. తమ్మినేని శ్రీరామ్మూర్తి చారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న సీతారాంకు గ్రామ ఓటర్లు ఏకగ్రీవంగా ఓటు వేయడం పరిపాటిగా మారడంతో వీరమల్లిపేట గ్రామంపై ఎన్నికల్లో ఇతర అభ్యర్థులు ఓట్లు ఆశించేవారు కాదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కూన రవికుమర్ వీరమల్లిపేట గ్రామంలో మంగళవారం ప్రచారం చేయగా ఆ గ్రామం నుంచి ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు రవికుమార్‌ను గ్రామంలో ఊరేగిస్తూ మంగళహారతులు, నుదుటన కుంకుమ దిద్ది టీడీపీకి మద్దతు పలికారు. దీనితో తమ్మినేని కంచుకోటగా ఉన్న వీరమల్లిపేటలో ఎట్టకేలకు టీడీపీ పాగా వేసిందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ కార్యకర్తల బైక్ ర్యాలీ
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 9 : ఎన్నికల ప్రచారం చివరి రోజైన మంగళవారం పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. సంతపేట నుంచి మెయిన్ రోడ్, రత్తకన్న, దాసన్నపేట, రథం వీధి, కార్జీ వీధి, బెల్లుపడ మీదుగా ర్యాలీ కొనసాగింది. సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కాళ్ల ధర్మారావు, నందికి జానీ, బత్తిన కృష్ణయ్య, సాలిన ఢిల్లీ, కాళ్ల దిలీప్, జి.శేఖర్, కె.శంకర రెడ్డి, కె.నాగరాజు, డి.విశ్వనాథ్, ఆశి లీలారాణి, ఇందిర తదితరులు పాల్గొన్నారు. 9వ వార్డులో శ్రీనివాససాహు, 16వ వార్డులో నాగరాజు పాత్రో పార్టీ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు.

ఫ్యాన్ పోస్టర్లతో వైసీపీ ప్రచారం
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 9 : పట్టణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఫ్యాన్ పోస్టర్లతో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. బెల్లుపడ నుంచి మెయిన్ రోడ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. వైసీపీని గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. జగన్ సీఎం అయితే అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మవద్దని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పి.రాజ్యలక్ష్మి, నేతలు పి.యాదవరెడ్డి, బుడ్డెపు త్రినాథ్, బి.పార్వతీశం, ఉప్పాడ బలరాం, పి.విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు బెల్లుపడ తదితర ప్రాంతాలలో చాట్ల తులసీదాస్, నీలాపు ఢిల్లీ, ఆశి చిరంజీవులు, డాక్టర్ ఉలాల శేషుయాదవ్, తిప్పన కూర్మారెడ్డి తదితరులు ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా సాయిరాజ్‌ను, ఎంపీగా దువ్వాడ శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.

పోలింగ్ నియమాలు పాటించాలి
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 9 : పోలింగ్ రోజున ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సీఐ పైడపునాయుడు కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల వరకు ప్రత్యక్ష వీడియో రికార్డింగ్ ఉంటుందన్నారు. గొడవలు, ప్రచారాలకు పాల్పడి కేసులబారిన పడవద్దని సూచించారు. ఓటర్లను వాహనాలపై తరలించకూడదన్నారు. దివ్యాంగులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలలో రావాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు ఏజెంట్లుగా ఉండరాదన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నలుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడకూడదని పేర్కొన్నారు.

ఉత్సాహంగా సాగిన ప్రచారాలు
కవిటి, ఏప్రిల్ 9: సార్వత్రిక ఎన్నికల తేది గురువారం కావడంతో రాజకీయపార్టీలు ప్రచారాన్ని మంగళవారం సాయంత్రంతో ముగించాయి. అందులో భాగంగా వైసీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా పార్టీ అభ్యర్థి పిరియా సాయిరాజ్ సతీమణి విజయ జగతిలో ప్రచారాన్ని ఉత్సాహంగా చేసారు. గ్రామంలోని మహిళలతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించి, హిందుసంప్రదాయ బద్దంగా ఓటర్లును ఓట్లును అభ్యర్థించారు. జగన్‌కు ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజానాయకుడు అవుతారని కోరారు. తమ అమూల్యమైన ఓట్లును వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఎంపీ అభ్యిర్థి శ్రీనివాస్‌లకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

గ్రామాల్లో టీడీపీ ప్రచారాలు
కవిటి, ఏప్రిల్ 9: ఎన్నికల ప్రచారానికి చివరిరోజు మంగళవారం మండలంలో వివిధ గ్రామాల్లో టీడీపీ పార్టీ ప్రచార కార్యక్రమాలను ఆయా గ్రామాల పరిధిలో చేపట్టారు. గ్రామాల్లో ప్రశాంతంగా ప్రచారాన్ని నిర్వహించి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బెందాళం అశోక్, ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడులకు తమ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ఎం.సున్నాపల్లి డీలర్ మృతి
సంతబొమ్మాళి, ఏప్రిల్ 9: మండలంలో లింగూరు పంచాయతీ, ఎం.సున్నాపల్లి చౌకదుకాణాల డీలరు చిరంజీవులు(53) గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈయన మృతి పట్ల తహసీల్థార్ కోటేశ్వరరావు, జడ్‌పీటీసీ లక్ష్మిదేవి, ఎంపీపీ కృష్ణవేణి, డీలర్లు సంఘం అధ్యక్ష,కార్యదర్శులు ఎ.రామారావు, జయలతోపాటు డీలర్లు, స్థానిక మాజీ సర్పంచ్ బి.ప్రకాశ్, మండల టీడీపీ అధ్యక్షుడు జి.బీమారావులు సంతాపం వ్యక్తం చేసారు. గత 30 సంవత్సరాలు నుంచి ఏకాధాటిగా డీలరుగా చేస్తూ ప్రజల మన్ననలు పొంది అటువంటి వ్యక్తి గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుడుకు భార్య, కుమారుడు తేజ వున్నారు.