శ్రీకాకుళం

‘సమన్వయానికి’ సంసిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 8: తెలుగుదేశం పార్టీ రెండేళ్ళ పాలన అనంతరం ప్రజల్లో గల 80 శాతం సంతృప్తిని శతశాతం చేసేందుకు ఎమ్మెల్యేలంతా సమన్వయంగా పనిచేసేలా ముఖ్యమంత్రి నియమించిన సమన్వయ కమిటీ తొలి సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఎం.పి. రామ్మోహన్‌నాయుడు సభ్యుడుగా హాజరై ప్రజలకు చేరువుగా ప్రజాప్రతినిధులు ఉంటూ నియోజకవర్గాలను యూనిట్‌గా తీసుకుని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుపై అలుపెరగని సామర్థ్యాన్ని వినియోగించాల్సివుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అధినేత ఆరా పెట్టడంతోపాటు, ప్రత్యేక సర్వేల ద్వారా గ్రేడింగ్ ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నా, కొన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమం అమల్లో అలమరకలు ఉంటున్నాయన్న విషయాన్ని రామ్మోహన్‌నాయుడు కమిటీ దృష్టికి తీసువెళ్ళినట్టు తెలిసింది. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమల్లో సమానమైన గ్రేడింగ్ కన్పించేలా కృషి జరగాల్సివుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థాయి నుంచి కలిసిమెలిసి పనిచేసేందుకు వీలుగా ఈ కమిటీ సమన్వయం చేస్తుందని సమావేశంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. టిడీపీ క్యాలెండర్ జిల్లాలవారీగా, నియోజకవర్గాలవారీగా సిద్ధమవుతున్నట్టు తెలిపారు. జిల్లా నుంచి ఎం.పి.రామ్మోహన్‌నాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావులు ఈ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.