శ్రీకాకుళం

భవిష్యత్ మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిటి, ఏప్రిల్ 17: ప్రతిపక్షంలో ఉన్నామని కార్యకర్తలు నిరాస చెందొద్దని,ప్రతి పక్ష పాత్రను మరింత సమర్ధవంతంగా పోషిస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని వైస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఎన్నికలు హామీలు నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని భవిష్యత్ వైఎస్సార్‌సీపీదేనని అన్నారు. మండల కేంద్రం కవిటిలో ఆదివారం జరిగిన ఆ పార్టీ నియోజక వర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ధర్మాన మాట్లాడారు. ప్రజలను మభ్యపెడుతున్న టీడీపీ నేతలను హామీలపై నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చంద్రబాబు బిజీగా ఉన్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిపై విమర్శలకే జిల్లా మంత్రి అచ్చెన్న పరిమితవౌవుతున్నారని ఏనాడు జిల్లా అభివృద్ధిపై గానీ, సమస్యలపై గాని మాట్లాడిన సందర్భమే లేదని ధ్వజమెత్తారు.ప్రతి కార్యకర్త అధికార పార్టీ అక్రమాలను నిలదీసి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ కార్యకర్తలంతా ప్రజలతో నిత్యం ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు.మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ నియోజక వర్గానికి ఇద్దరు సమన్వయ కర్తలు ఉండటంతో కార్యకర్తలు అయోమయంతో ఉన్నారని ఎవరికి బాధ్యతలు అప్పగించినా పార్టీ పటిష్టానికి కృషి చేస్తామని స్పష్టం చేసారు.పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జీ నర్తు రామారావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి పాలైన ఏనాడు నిరాశ చెందలేదని కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ పటిష్టానికి కృషి చేస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పిలక రాజ్యలక్ష్మీ,కంచిలి ఎంపిపి, జెడ్పీటీసీలు ఇప్పిలి లోలాక్షి,జయమ్మ,జిల్లా యూత్ పార్టీ అధ్యక్షుడు తిలక్,శ్యాంపురియా,తిలక్,కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.