శ్రీకాకుళం

కటకటాల్లోకి.. ‘నీలిచిత్ర’కారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 26: జిల్లా అంతటా హాల్‌చల్ చేసిన మహిళల నీలిచిత్రాలు కథ కటకటాల వెనక్కి చేరింది! నైపుణ్యంతో తీసి, నెట్‌లో పెట్టి, చివరికి కేబుల్ టీవీలో ప్రసారం చేస్తామంటూ బెదిరించి లక్షల రూ.లు కాజేసేందుకు పన్నాగం పన్నిన దొంగ స్క్రీన్‌ప్లే, దర్శకులు కటకటాల్లోకి పోలీసులు నెట్టేశారు. జిల్లాలో ఆమదాలవలస నీలిచిత్ర నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి చెప్పారు. సోమవారం ఇక్కడ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, ఆడపిల్లలను ఆకర్షించుకుని, వారితో నీలిచిత్రాలు తీసి, ప్రసారం చేస్తామంటూ బెదిరింపులతో డబ్బు గుంజేందుకు వ్యూహాత్మకంగా వ్యవహారించిన నిందితులను అరెస్టు చేసినట్టు వివరాలు తెలిపారు. చింతాడ మహేశ్‌బాబు అలియాస్ మహేశ్ ఆమదాలవలసలో నెట్‌సెంటర్‌ను నిర్వహిస్తూ తన కేంద్రానికి వచ్చే అమ్మాయిలు, వివాహిత మహిళలతో నీలిచిత్రాల వీడియోలను చిత్రీకరించుకున్నారని తెలిపారు. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు 2008 సెక్షన్ 66(డి), (ఈ), 67, 67(ఎ), ఐపిసి సెక్షన్ 328, 497, 420 376 కింద క్రిమినల్ కేసు పెట్టినట్టు తెలిపారు. ప్రధాన నిందితుడైన మహేశ్‌బాబు నుంచి హార్డ్‌డిస్క్, సెల్‌ఫోనును సీజ్ చేసినట్టు చెప్పారు. నిందితులు సంబంధిత మహిళలకు నీలిచిత్రాలను నెట్‌లో పెడతామని, కేబుల్ టివీలో ప్రసారం చేయిస్తామని బెదిరిస్తూ రెండు లక్షల రూ.లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. నాన్-బెయిల్‌బుల్ కేసును నమోదు చేశామని, కేసును కోర్టులో సమర్పిస్తామని ఏడేళ్ళ వరకూ శిక్షపడే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. ఇటువంటి చర్యలపై యువతలో సానుకూలత దృక్పథంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, అందరూ ఆలోచన చేయాల్సిన పరిస్థితలు ఏర్పడినట్టు హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్లును ఇస్తున్నారని వాటి కాల్స్, ఇతర అంతర్జాలం వినియోగాలపై పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో డి.ఎస్పీలు కె.్భర్గవరావునాయుడు, పి.శ్రీనివాసరావు, వేవికానంద, ఆదినారాయణ, ఆమదాలవలస సి.ఐ. నవీన్‌కుమార్ తదితరులు ఉన్నారు.