శ్రీకాకుళం

విజ్ఞాన శాస్త్ర మూలాల నుండి ఆలోచించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 26: విజ్ఞాన శాస్త్ర మూలల నుండి విద్యార్థులు ఆలోచించాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పిలుపునిచ్చారు. ప్రభుత్వ పురుషుల కళాశాలలో బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో మాలిక్యూలార్ బయాలజీలో శక్తిసామర్థ్యాల పెంపుపై ఐదు రోజులు ప్రాంతీయ వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. విజ్ఞాన శాస్త్రాన్ని మూలల నుంచి ఆలోచించడం ప్రధానమైన అంశమన్నారు. విజ్ఞాన శాస్త్రాన్ని సాధారణంగా అభ్యసించడమే కాకుండా వాటి లోతులను పరిశీలించి అభ్యసించాలన్నారు. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ అర్థం చేసుకోవడం ప్రధానమైన అంశమన్నారు. మాలిక్యూలర్ స్థాయిలో బయాలజీ ప్రక్రియ జరగడాన్ని అవగాహన చేసుకోవాలన్నారు. ప్రతీ అంశంలోనూ పదార్థం ప్రత్యేకత కలిగినదన్నారు. సజీవ, నిర్జీవ పదార్థాలను అవగాహన చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ సజీవ పదార్థం, నిర్జీవ పదార్థం ఉంచి ఉత్పత్తి అయినవేనన్నారు. అవగాహన చేసుకోవడం ఒక ఎత్తు అయితే అందులో ఉపయోగించే పరిజ్ఞానం, పరికరాలు మరో ఎత్తు అన్నారు. వీటిపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. విశ్వంలో అనేక పాలపుంతలు ఉన్నాయని అందులో మనం జీవిస్తున్న సౌరవ్యవస్థ ఒకటన్నారు. విశ్వం ఏర్పడిన తీరును గమనించాలని అందులో పదార్థం, రసాయనిక బంధాల గూర్చి సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రతీ ఎలిమెంట్ ఆటమ్, ఆటమ్ మాలిక్యూలర్‌గాను, మాలిక్యూలర్ టిస్యూ ఏర్పడుతుందన్నారు. శాస్త్ర విజ్ఞానం అభ్యసించే విద్యార్థిగా ఈ అంశాలపై చక్కటి అవగాహనను మూలలనుంచి సోధన చేసినప్పుడు పరిపూర్ణవ వస్తుందన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.బాబూరావు, వర్శిటీ రిజిస్ట్రార్ జి.తులసీరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, వేమన వర్శిటీ సహాయ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.ఉదయశంకర్; సమన్వయ కర్త ఎన్‌ఎస్‌ఎన్ స్వామి, అధ్యాపకులు పి.సురేఖ, ఎం.ప్రదీప్, బయోటెక్నాలజీ విద్యార్థులు పాల్గొన్నారు.