శ్రీకాకుళం

‘రేవ్’ కేకలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: జిల్లాలో కొంతమంది విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడటంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా సొసైటీలో కాస్త హోదా ఉన్నవారు, సెలబ్రీటీల పిల్లలు ‘రేవ్’ పార్టీ అంటూ జిల్లా ముఖద్వారం వద్ద గల రూరల్ ఏరియాల్లో నిర్వహిస్తున్న మత్తులో జోగుతుంటారు. అయితే, అలాంటి రేవ్ పార్టీలో కొంతమంది సంపన్నులు డబ్బు కోసం నిర్వహిస్తూ యూత్ బలహీనతను క్యాష్ చేసుకుంటారు. కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి అమ్మాయిలను ట్రాప్‌లో లాగి వారితో రేవ్‌పార్టీల్లో విచ్చలవిడిగా శృంగారం చేస్తుంటారు. ఇలాంటి వాటిని వీడియో తీస్తూ వారిని బ్లాక్‌మెయిల్ కూడా చేస్తుంటారు. ఇక ఈ రేవ్ పార్టీలు జిల్లాలో కూడా పెరిగిపోయింది. వీకెండ్ రోజుల్లో నగరానికి చెందిన కొంతమంది సంపన్నులు అమ్మాయిలకు డబ్బు ఎర వేస్తున్నారు. దీంతో రేవ్ జోరు ఇంకా ఎక్కువయ్యింది.
తాజాగా జిల్లా ముఖద్వారం నుంచి పిషిణీ, దేవునిపాలవలస, కొయ్యాం, ఎచ్చెర్ల ప్రాంతాల్లో నిర్మించిన ఫార్మ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లలో నగరానికి చెందిన ‘పేకాట శ్రీమంతులు’ కొందరు కార్డుషోకు వెళ్తూవస్తున్న మధ్యలోనే రేవ్..రేవ్..మంటూ పార్టీలకు, మితిమీరిన శృంగారానికి తెరలేపిని విషయం పోలీసుశాఖకు తెలిసిందే! కానీ, అటువంటి రిసార్ట్‌లపై దాడులు చేసే దాఖలాలు లేవ్! జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బ్రహ్మారెడ్డి అంచెలంచెలుగా నేరాలను నియంత్రించడంలో పురోగతి సాధించి, సిక్కోల్ ప్రజలతో హేట్సాఫ్ అనిపించుకుంటున్నారు. అయితే, ఈ రేవ్ కేకలు వినిపించకుండా కొంతమంది స్టేషన్ హౌస్ అధికారులు పహారా కాస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఆమదాలవలస పట్టణంలో నీలిచిత్రాలు రాకెట్ నిందితులు అరెస్టుల నేపథ్యంలో రేవ్ పార్టీల వ్యవహారం ఎస్పీకు ఆలస్యంగా తెలిసింది. దీంతో ఆయన నిఘా పెంచాలన్న హుకుం సిబ్బందికి తాకినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిన్నటికి నిన్న శ్రీకాకుళం నగరంలో జరిగిన పేకాట వెనుక కరెన్సీ కట్టలు వ్యవహారం డిఐజి కార్యాలయానికి కొంతమంది ఆ శాఖ సిబ్బంది చేరవేసినట్టు సమాచారం. గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసిన శ్రీకాంత్ తన పాతమిత్రులతో ఈ జూదగాళ్ళ వివరాలు రహస్యంగా సేకరించి, ఆ సంఘటనపై ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాన్ని విశాఖపట్నం నుంచే రంగంలోకి దింపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ గుట్టురట్టయితే - ఎంతమంది పోలీసు సిబ్బంది మెడకు ఉచ్చు బిగుసుకుంటుందో అన్న చర్చ కాప్స్‌లో మొదలైంది. ఇంతలో రేవ్ పార్టీల సమాచారం ఎస్పీకి చేరడంతో ‘కట్టల వ్యవహారం’ రగులుకుంటోంది.