శ్రీకాకుళం

మన్యంలో కుండపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతంపేట, సెప్టెంబర్ 26: సీతంపేట మన్యంలో సోమవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ సోమవారం కురిసిన వర్షంతో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహించాయి. సుమారు గంటన్నరకు పైగా కురిసిన వర్షం కారణంగా వర్షపునీరు రహదారి పైప్రవహించింది.కుండపోత వర్షం కారణంగా పాలకొండ-హడ్డుబంగి రహదారి మద్యలో ఉన్న కుసిమిగెడ్డ,జమ్మడుగెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రహదారి పై రాకపోకలు స్థంభించిపోయాయి.ఈ ఏడాదికి ఇదే పెద్ద వర్షంకావడంతో గెడ్డలు రహదారి పై నుండి ప్రవహిస్తున్నాయి.
* కొట్టుకుపోయిన వాహనం:
పాలకొండ-హడ్డుబంగి ప్రధాన రహదారి మీదుగా గెడ్డలు ఉప్పొంగి ప్రవహించడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుండి సాయంత్రం వరకు గెడ్డలు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రహదారి పై నుండి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికి ఓ వాహనచోదకుడు సాహసం చేసి గెడ్డను దాటే ప్రయత్నంలో నీటి ప్రవాహ వేగానికి గెడ్డలో కొట్టుకుపోయాడు.అయితే అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు అతన్ని కాపాడినప్పటికి వాహనం మాత్రం నీటి వేగానికి కొట్టుకుపోయింది.దీంతో ఎంకెవరు గెడ్డను దాటే సాహసం చేయలేకపోయారు.గెడ్డలో నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రయాణికులు గెడ్డ సమీపంలో నిలిచిపోయిన వాహనాల్లోనే ఉండిపోయారు.